సంకేపల్లి నాగేంద్రశర్మ
సంకేపల్లి నాగేంద్రశర్మ కరీంనగర్ కు చెందిన రచయిత, పుస్తక సమీక్షకుడు, చరిత్రకారుడు, పాత్రికేయుడు.[1][2]
సంకేపల్లి నాగేంద్రశర్మ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | వేములవాడ | 1960 జూన్ 1
వృత్తి | జర్నలిస్టు, చిత్రకారుడు, రచయిత, చరిత్ర ఉపాధ్యాయుడు |
భాష | తెలుగు |
విద్య | ఎం.ఎ., ఎల్.ఎల్.బి., బి.ఇడి., పిజి డిప్లొమా(పబ్లిక్ రిలేషన్స్) |
రచనా రంగం | చరిత్ర |
సాహిత్య ఉద్యమం | తెలంగాణ ఉద్యమం |
పురస్కారాలు | సురవరం సాహిత్య పురస్కారం, పివి ప్రతిభా పురస్కారం |
జీవిత భాగస్వామి | నందగిరి శారద |
సంతానం | ఫణికృష్ణ, సాయికిరణ్ |
జననం, విద్య, వృత్తి
మార్చుసంకేపల్లి నాగేంద్రశర్మ తల్లిదండ్రులు కమలమ్మ, కాంతయ్య. ఇతను 1960లో వేములవాడలో జన్మించాడు. వేములవాడలో పాఠశాల విద్య, ఆ తరువాత డిగ్రీ విద్య కరీంనగర్ లో పూర్తి చేసాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్ లో, న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసాడు. పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా చేసాడు. చరిత్ర ఉపాధ్యాయుడిగా కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేసాడు.[2]
రచనలు
మార్చు- హరివిల్లు (వ్యాసాలు)
- మానేరు తరంగాలు (కవిత్వం)
- జీవనవేదం (కవిత్వం)
- నాగేంద్రశర్మ కథలు
- బతుకు తెరువు కథలు
- తెలంగాణ వీణ (వ్యాస సంపుటి)
- సబ్బినాడు ప్రతిభామూర్తులు (వ్యాస సంకలనం)
- ఎములాడ మూలవాగు (కవిత్వం)
- తెలంగాణ ఉద్యమంలో చారిత్రకాంశాలు (వ్యాసాలు)[3]
- రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య చరిత్ర
- వేములవాడ ఆనువంశిక బ్రాహ్మణ చరిత్ర
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర చరిత్ర
అవార్డులు
మార్చుబయటి లంకెలు
మార్చువనరులు
మార్చు- ↑ "బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు". Youtube. ఆకాశవాణి. Retrieved 19 March 2022.
- ↑ "తెలంగాణ చారిత్రక వ్యాసాలు". Retrieved 19 March 2022.
- ↑ "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
- ↑ "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. 2022-09-03. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.