సంఖ్యా కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో జనాభాలెక్కలు, వివిధ శాసనాలు, సినాయి పర్వతము నుంచి కనాను సరిహద్దువరకు ప్రయాణం, గూఢచారులు కనాను దేశాన్ని చూసిన విధం, ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం, వారి తిరుగుబాటు, ఎడారిలో నలభైఏండ్ల సంచారం, మొదలగు విషయాలు చెప్పబడినవి.[1]

ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలతో సంఖ్యాకాండము మొదలవుతుంది. హెబ్రీ భాషలో ఈ పుస్తకము పేరు ‘అరణ్యములో’. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర విషాద యాత్రగా మారింది. వారు తమ దృష్టిని దేవుడు, వాగ్దాన దేశము మీద కాకుండా తాము విడచివచ్చిన ఐగుప్తు మీద పెట్టారు. వారి అవిశ్వాసం అసంతృప్తికి దారి తీసింది. సణుగుడు, గొణుగుడు వారి దినచర్యగా మారింది. త్వరితగతిన వారు అవిధేయతతో దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారి సమాజములో అలజడి మొదలయ్యింది. దేవుడు వారి పట్ల ఎంతో సహనాన్ని చూపించాడు. నలభై సంవత్సరాలు వారు అరణ్యములోనే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే కనాను లో ప్రవేశించటానికి కావలసిన విశ్వాసం వారికి లేదు. ఇశ్రాయేలీయుల అవిశ్వాసం, అవిధేయత వారికి అవరోధం, అడ్డంకులుగా మారాయి. దేవుడు వారి కోసం ఉద్దేశించినవి వారు పొందలేకపోయారు.[2]

అయినప్పటికీ, దేవుడు తాను అబ్రాహాముకు ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశము వైపు నడిపించాడు. వారు యెరికో పట్టణము సమీపములో, యొర్దాను నదికి తూర్పున మోయాబు మైదానములో ప్రవేశించుటతో ఈ పుస్తకము ముగుస్తుంది.

మూలాలు

మార్చు
  1. "సంఖ్యా కాండ దర్శనం". Prabha News. 2023-10-01. Retrieved 2024-06-17.
  2. "సంఖ్యా కాండము: పరిచయం by Paul Kattupalli". Defender's Voice (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-06. Retrieved 2024-06-17.