సంగమము

రెండు కానీ, అంతకన్నా ఎక్కువ కానీ నీటి ప్రవాహాలు కలవడం

సంగమం (Confluence - కాన్‌ఫ్లుయెన్స్) అనగా రెండు లేదా అంతకుమించి నదులు కలియుస్థలము[1]. ఉపనదులు ప్రధాన నదిలో కలిసిపోయే ప్రదేశాలు దీనిని సూచిస్తాయి, లేదా రెండు లేదా మరిన్ని పెద్దనదులు ఒక చోట కలిసిపోయి మరొక నదిగా అవతరిస్తాయి. ఉదాహరణకు కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర అనే నదులు వేరువేరుగా ప్రవహిస్తూ శిమోగా జిల్లా కూడ్లి వద్ద ఏకమయి తుంగభద్ర నదిగా అవతరిస్తుంది. తరువాత తుంగభద్ర నది కృష్ణానదికి పెద్దఉపనదిగా ఆలంపూర్ సమీపంలో కృష్ణా నదితో సంగమిస్తుంది, ఇక్కడ నుంచి కృష్ణా నదిగా పిలవబడుతుంది. భారతదేశ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక హిమాలయ నది భాగీరథి నది, దీని ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడినుండి ఇది గంగా నది అని పిలవబడుతుంది.

గంగానది యొక్క జన్మస్థలం - అలకనంద, భాగీరథి నదుల సంగమ ప్రదేశం

మూలాలు సవరించు

  1. "Conflux – Definition of conflux by Merriam-Webster". merriam-webster.com.
"https://te.wikipedia.org/w/index.php?title=సంగమము&oldid=3165538" నుండి వెలికితీశారు