సంగమిత్ర బందోపాధ్యాయ

భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త

సంఘమిత్ర బందోపాధ్యాయ కోల్‌కతా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అనేక పరిశోధనలు చేసి అనేక అవార్డులు పొందారు. 1968 లో పశ్చిమ బెంగాల్ లో జన్మించిన సంఘమిత్ర మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కోల్‌కతా లోని ప్రెసిడెన్సీ కాలేజీలో బి.యస్సీ ఫిజిక్స్ చేశారు. అక్కడే గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు.

సంఘమిత్ర బంద్యోపాధ్యాయ
జాతీయతభారతీయ ప్రజలు
రంగములుకంప్యూటర్ సైన్స్
వృత్తిసంస్థలుఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కాలేజ్, కోల్ కతా (B.Sc. భౌతిక శాస్త్రం)
కలకత్తా విశ్వవిద్యాలయం, రాజాబజార్ సైన్స్ కాలేజ్ (B.Tech.)

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్ (M.Tech.)

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (పి.హెచ్.డి.)
ముఖ్యమైన పురస్కారాలుపద్మశ్రీ(2022) 2022
ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో ఇన్ఫోసిస్ ప్రైజ్(2017)
ఇంజనీరింగ్ సైన్స్ లో శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి(2010)

జీవిత విశేషాలు

మార్చు

ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం, ఐఐటి ఖర్గపూర్, ఐ.ఎస్.ఐ ల నుండి బి.టెక్, ఎం.టెక్, కంప్యూటర్ సైన్స్ లో పి.హె.డి ని పొందారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, కలకత్తా లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్.ఎ, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, ఇటలీ, మెక్సికో దేశాలలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేశారు. అనేక దేశాలలో వివిధ ప్రసంగాల కొరకు ఆహ్వానింపబడ్డారు.[1] ఆమె 130 కి పైగా జర్నల్ రచనలను, 140 వ్యాసాలను రచించారు. ఆ వ్యాసాలను అంతర్జాతీయ సమావేశాలలోనూ, పుస్తకములలోనూ, కొన్ని విజ్ఞానశాస్త్ర పత్రిఅకలోనూ ప్రచురింపబడ్డాయి. ఆమె సాప్ట్ కంప్యూటింగ్,డేటా మైనింగ్, బయో ఇన్‌ఫార్మాటిక్స్ రంగాలలో అనేక ముఖ్య విషయాలను జర్నల్ లలో వ్రాసారు. ఆమె పరిశోధనలలో ప్రధానాంశం కంప్యుటేషనల్ బయాలజీ, బయో ఇన్‌ఫర్మేటిక్స్, సాఫ్ట్ అండ్ ఇవల్యూషనరీ కంప్యూటేషన్ , పాటర్న్ రికగ్నిషన్, డేటా మైనింగ్. ఆమె అలహాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఫెలోషిప్ పొందారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ లోనూఫెలోషిప్ పొందారు. ఆమె ఐ.ఇ.ఇ.ఇ కు సీనియర్ సభ్యులుగా యున్నారు. సంగమిత్ర అనేక గౌరవ అవార్డులు పొందారు. వాటిలో డా.శంకర్ దయాళ్ శర్మ బంగారు పతకం, ఖరగ్ పూర్ లోని ఐఐటి నుండి వెండి పతకం పొందారు. ఇండియన్ నేషనల్ సైన్సెస్ అకాడమీ నుండి యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. యంగ్ ఇంజనీరు అవార్దు ఆఫ్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెక్నాలజీ నుండి స్వర్ణజంతంతి ఫెలోషిప్ ను, జర్మనీ నుండి హంబోల్ట్ ఫెలోషిప్ ను అందుకున్నారు. ఆమె ఇటలీ లోని ఐ.సి.టి.పి లో సీనియర్ అసోసియేట్ గా కూడా ఎంపిక కాబడినారు. ఆమెకు 2010 లో ప్రతిష్టాకరమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది.

పురస్కారాలు, గౌరవాలు

మార్చు
  • పద్మశ్రీ (2022)
  • ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో ఇన్ఫోసిస్ ప్రైజ్ 2017 [2]
  • ఇంజనీరింగ్ సైన్స్ లో శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి, 2010
  • జె.సి బోస్ ఫెలోషిప్
  • జర్మనీలోని అవ్ హెచ్ ఫౌండేషన్ నుంచి హంబోల్ట్ ఫెలోషిప్ 2009-2010.
  • ఫెలో, ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టివిఎఎస్), 2019.
  • ఫెలో, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐన్ఎస్ఎ), 2016.
  • ఐఈఈఈ ఫెలో, 2016
  • ఫెలో, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (నాసి), అలహాబాద్, 2010.

మూలాలు

మార్చు
  1. "ఆమె జీవిత చరిత్ర" (PDF). Archived from the original (PDF) on 2015-05-28. Retrieved 2014-03-07.
  2. "Infosys Prize - Laureates 2017 - Sanghamitra Bandyopadhyay". www.infosys-science-foundation.com. Retrieved 2022-02-03.

ఇతర లింకులు

మార్చు