సంచార్ సాధీ పోర్టల్
సంచార్ సాధీ పోర్టల్ ను భారత టెలికాం విభాగం ( డాట్ ) 2023 వ సంవత్సరం మే 16వ తేదీన ప్రారంభించింది[1]. దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సంచార్ సాధీ పోర్టల్ పై ప్రజలు బ్లాక్ చేయడంతో పాటు ట్రాక్ చేసుకోవచ్చని టెలికాం విభాగం తెలియజేసింది[2]. వాడిన మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేయకముందే ఆ ఫోన్ వివరాలను ఈ పోర్టల్ లో తనిఖీ చేసుకునే సదుపాయం కల్పించింది[3]. మొదటి విడత సంచార్ సౌదీ పోర్టల్ ను సెంట్రల్ ఎక్సెప్ట్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ( CEIR ) గా రూపొందించారు. తాజాగా ప్రారంభమైన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యే తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ కూడా సంచార్ సాథీ పోర్టల్ లో మొదటి అడుగుగా అభివర్ణించారు కేంద్రమంత్రి. ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ లోని సమాచారాన్ని ఎవరూ చూడకుండా దానిని సంచార్ సాథీ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వెల్లడించారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం ఒక అంశంగా పేర్కొన్నారు. నో యువర్ మొబైల్ అనే రెండో ఫీచర్ గురించి వివరించారు.
మూలాలు :
- ↑ "Sanchar Saathi". sancharsaathi.gov.in. Retrieved 2023-12-22.
- ↑ Telugu, ntv (2023-05-16). "Sanchar Saathi portal: 'సంచార్ సాథీ పోర్టల్' ప్రారంభం.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?". NTV Telugu. Retrieved 2023-12-22.
- ↑ veeralakshmi (2023-05-19). "సంచార్ సాథీ పోర్టల్ – లక్ష్యం , పూర్తి వివరాలు తెలుగులో". adda247. Retrieved 2023-12-22.