2023
గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
2023 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము. 2023 నూతన సంవత్సరం ఆదివారంతో ప్రారంభం అవుతుంది. 2023 అనేది 3వ సహస్రాబ్ది, 21వ శతాబ్దపు 23వ సంవత్సరం. 2020 దశాబ్దపు సంవత్సరం.
సంఘటనలుసవరించు
- జనవరి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మహబూబాబాద్,[1] కొత్తగూడెం[2] పట్టణాలలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయాలు ప్రారంభించబడ్డాయి.
- జనవరి 25: 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలు ప్రకటించబడ్డాయి.[3]
- ఫిబ్రవరి 1: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[4]
- ఫిబ్రవరి 3: తెలంగాణ శాసనసభ బడ్జెట్ (2023-24) సమావేశాలు ప్రారంభమై, ఫిబ్రవరి 12 వరకు కొనసాగాయి.
- ఫిబ్రవరి 6: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[5][6]
- ఫిబ్రవరి 6 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 41,000 మందికి పైగా మరణించారు. 120,000 మందికిపైగా గాయపడ్డారు.[7][8]
- ఫిబ్రవరి 9: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్ సమీపంలో ప్రారంభించబడింది.[9]
- ఫిబ్రవరి 11: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.[10]
- ఫిబ్రవరి 15: కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి చేయడంకోసం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.[11][12]
- ఫిబ్రవరి 24: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో బయో ఏషియా సదస్సు-2023 ప్రారంభమై, ఫిబ్రవరి 26న ముగిసింది.[13][14]
- డిసెంబరు: తెలంగాణ శాసనసభ ఎన్నికలు
మరణాలుసవరించు
- జనవరి 2: ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945)
- జనవరి 2: రమాకుమారి దేవి, జయపురం ఆఖరి మహారాణి, మాజీ శాసనసభ్యురాలు (జ. 1930)
- జనవరి 5: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (జ. 1946)
- జనవరి 6: సునీల్ బాబు, సినిమా ఆర్ట్ డైరెక్టర్
- జనవరి 9: వసంత్ కుమార్ బావ, విశ్రాంత ఐఏఎస్, చరిత్రకారుడు, రచయిత.
- జనవరి 12: పావులూరి కృష్ణ చౌదరి, హోమియోపతి వైద్య నిపుణుడు (జ. 1926)
- జనవరి 14: సంతోఖ్ సింగ్ చౌదరి, రాజకీయ నాయకుడు (జ. 1946)
- జనవరి 15: ముకర్రం జా, నిజాం వారసుడు (జ. 1933)
- జనవరి 20: ఆరుమిల్లి సూర్యనారాయణ, భారతీయ సినిమా నిర్మాత (జ. 1939)
- జనవరి 27: జమున, సినిమా నటి (జ. 1936)
- జనవరి 29: వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి (జ. 1955)
- ఫిబ్రవరి 2: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ. 1930)
- ఫిబ్రవరి 4: ఆర్.వి.గురుపాదం, భారతీయ సినిమా నిర్మాత (జ. 1970)
- ఫిబ్రవరి 5: పర్వేజ్ ముషార్రఫ్, పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి (జ. 1943)
- ఫిబ్రవరి 8: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (జ. 1936)
- ఫిబ్రవరి 18: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (జ. 1983)
- ఫిబ్రవరి 19: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ. 1951)
- ఫిబ్రవరి 19: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (జ. 1962)
- మార్చి 3: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)
మూలాలుసవరించు
- ↑ hansindia (2023-01-12). "KCR at inaugurating the new Collectorate building complex of Mahabubabad Photo Gallery". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.
- ↑ "kcr inaugurates kothagudem collectorate office". Vaartha. 2023-01-12. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.
- ↑ "Padma awards2023: చినజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ". EENADU. 2023-01-25. Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-25.
- ↑ "Budget-2023: బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ". web.archive.org. 2023-02-01. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ." EENADU. 2023-02-06. Archived from the original on 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Telangana Budget 2023: దేశానికే నమూనా". EENADU. 2023-02-07. Archived from the original on 2023-02-07. Retrieved 2023-02-08.
- ↑ "Earthquake Kills More Than 110 People in Turkey, Syria". Bloomberg.com (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Powerful quake kills at least 360 people in Turkey, Syria". AP NEWS (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Funday returns with double deckers & musical fountains in Hyderabad". The Times of India. 2023-02-20. ISSN 0971-8257. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-25.
- ↑ telugu, NT News (2023-02-11). "Formula E | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్ రేసు". www.ntnews.com. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.
- ↑ "దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు". EENADU. 2023-02-16. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-25.
- ↑ telugu, NT News (2023-02-15). "కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-25.
- ↑ India, The Hans (2023-02-24). "Minister KTR opens 20th Edition of BioAsia in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.
- ↑ "Bio Asia: హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు". EENADU. 2023-02-24. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.