సంజీవరెడ్డి నగర్

సంజీవరెడ్డి నగర్ (ఎస్.ఆర్. నగర్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గుర్తుగా దీనికి సంజీవరెడ్డి నగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది అమీర్‌పేటకు అతి దగ్గరలో ఉన్న వ్యాపార కేంద్రం.[1]

సంజీవరెడ్డి నగర్
ఎస్.ఆర్. నగర్
సమీప ప్రాంతాలు
సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారి
సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారి
సంజీవరెడ్డి నగర్ is located in Telangana
సంజీవరెడ్డి నగర్
సంజీవరెడ్డి నగర్
Location in Telangana, India
సంజీవరెడ్డి నగర్ is located in India
సంజీవరెడ్డి నగర్
సంజీవరెడ్డి నగర్
సంజీవరెడ్డి నగర్ (India)
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు Urdu
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500038
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

పేరు - చరిత్ర

మార్చు

ఇది మొదటగా గురుమూర్తినగర్ గా పిలువబడుతుండేది. భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడి 1967లో ఇక్కడ నివసించడం వల్ల ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశాడు. దాంతో 1975లో ఈ గురుమూర్తినగర్ ను సంజీవరెడ్డి నగర్ గా మార్చారు.

వాతావరణం

మార్చు

ఎక్కువ చెట్లతో మంచి వాతావరణాన్ని కలిగివున్న ఈ ప్రాంతం నివాసానికి అనువుగా ఉంటుంది. దాదాపు సనత్‌నగర్లో కలిసేవున్న ఈ ప్రాంతంలో విభిన్న రకాల సంస్కృతి కనిపిస్తుంది. సంజీవరెడ్డి నగర్ రోడ్డు జంక్షన్ బొంబాయి-పూణే రోడ్డుకు అనుసంధానించబడి ఉంటుంది. 2000 సెప్టెంబరు 4న దివంగ‌త ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది. ఆయ‌న‌ను టార్గెట్ చేసిన మావోయిస్టులు ఇదే కూడలిలో కాల్చిచంపారు.[2]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. ది హన్న్ ఇండియా (18 November 2014). "SR Nagar A well-planned educational hub". Ch. Saibaba. Retrieved 23 May 2018.
  2. "Hyderabad: ఐపీఎస్‌ అధికారి ఉమేష్ చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం: సీపీ ఆనంద్‌". EENADU. Retrieved 2022-03-29.

ఇతర లంకెలు

మార్చు