సందీప్ సావంత్

మరాఠి నాటకరంగ, సినిమా, టివి దర్శకుడు, రచయిత.

సందీప్ సావంత్, మరాఠి నాటకరంగ, సినిమా, టివి దర్శకుడు, రచయిత.[1] ఇతడు రూపొందించిన శ్వాస్ సినిమాకు భారత జాతీయ అవార్డు వచ్చింది.[2][3] తన తొలి చిత్రం శ్వాస్ నిర్మాతలలో సావంత్ ఒకరు.[4]

సందీప్ సావంత్ 'శ్వాస్', 'నాడి వహతే' చిత్రాల రచయిత, దర్శకుడు, నిర్మాత.

వ్యక్తిగత జీవితం

మార్చు

సైకాలజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన సావంత్ ముంబైలోని విలే పార్లేలో నివసిస్తున్నాడు.[1] శ్వాస్ సినిమాకు కాస్ట్యూమ్స్ రూపొందించిన నీరజ పట్వర్ధన్ వివాహం చేసుకున్నాడు.[4]

సినిమారంగం

మార్చు

పిల్లలకోసం టెలివిజన్ డాక్యుమెంటరీలు రూపొందించాడు. పిల్లలతో కలిసి పనిచేయడానికి అతనికి ఇష్టమని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ముక్త రాజాధ్యక్ష పేర్కొన్నాడు. శ్వాస్ సినిమాలో పర్శ్యా పాత్ర పోషించినందుకు అశ్విన్ చిటిల్ ఉత్తమ బాల కళాకారుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.[1] సందీప్ సావంత్ 2017లో నాడి వహతే సినిమా తీశాడు. ఈ సినిమాకు కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం విభాగాల్లో సందీప్ సావంత్ వ్యవహరించగా, నీరజ పట్వర్ధన్ ఈ సినిమాను నిర్మించింది.

సినిమాలు

మార్చు
  1. శ్వాస్ (2014)
  2. నాడి వహతే (2017)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Rajadhyaksha, Mukta (2004-10-09). "Breath of hope". Frontline. Retrieved 27 June 2021.
  2. Deosthalee, Deepa (2012-06-04). "Aamchi Pichchur". Outlook. Retrieved 27 June 2021.
  3. Mehar, Rajesh (2005-03-18). "Fresh Shwaas of air". The Hindu. Archived from the original on 2005-05-10. Retrieved 27 June 2021.
  4. 4.0 4.1 Unnithan, Sandeep (2004-11-22). "Waiting to exhale Marathi film 'Shwaas' nominated as India's official entry for Oscars". India Today. Retrieved 27 June 2021.

బయటి లింకులు

మార్చు