సంధి (పుస్తకం)


కోరాడ రామకృష్ణయ్య వ్రాసిన వ్యాకరణ గ్రంథము[1]. 1935లో ప్రచురింపబడింది.

సంధి
కృతికర్త: కోరాడ రామకృష్ణయ్య
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాకరణము
విభాగం (కళా ప్రక్రియ): భాషాశాస్త్రము
ప్రచురణ: ప్రాచ్యభాషా పరిశోధనాలయము, మద్రాసు విశ్వవిద్యాలయము
విడుదల: 1935
పేజీలు: 158

విషయ సూచికసవరించు

 • భాషాలక్షణము - వ్యాకరణము
 • ఆర్యభాషారూపములు - చారిత్రక చిహ్నములు
 • ఆంధ్రమున నాగమ విధానము
 • బహువచనరూప నిష్పత్తి కుఙ్ విధానము
 • సంధి స్వరూప లక్షణములు
 • సంధిలోని యాగమాదుల స్వరూపము
 • యడాగమ స్వరూపము
 • ద్రావిడభాషలోని సంధి
 • సంస్కృతభాషలోని సంధి
 • లోపసంధి
 • పదాంత్యవర్ణలోపము
 • ఇకార - ఉకార సంధులు
 • ప్రథమావిభక్తి ప్రత్యయస్వరూపము
 • ప్రథమేతరవిభక్తి సంధి
 • అపదాదిస్వర సంధి
 • ద్విరుక్తటకారము
 • ప్రాఁతాదులు ఆగమసంధి
 • 'టు'గాగమ 'రు'గాగములు, అందుకు ప్రభృతులు
 • నుగాగమము
 • అలిగాగమము
 • ఆదేశ సంధి
 • గసడదవాదేశ సంధి
 • సరళాదేశ సంధి
 • కళాద్రుతప్రకృతిక విభాగము

పత్రికా సమీక్షసవరించు

ఈ పుస్తకాన్ని భారతి మాసపత్రిక ఏప్రిల్ 1936 సంచికలో పెనుమెచ్చ సత్యనారాయణరాజు సమీక్షించాడు. అతడి అభిప్రాయం క్రింది విధంగా ఉంది.

" ఈ'సంధి' వ్యాకరణములకు లొంగని పెక్కు ప్రయోగములను సాధించుటయేగాక వాని వ్యుత్పత్తులను కూడ కూలంకుషముగ తెలుపుచున్నది.

జీవద్భాషయగు నాంధ్రమునకుఁ గాలక్రమమున జరిగిన మార్పులన్నియు నీ సంధి చూపుచున్నది. ఏశబ్దమునైను సాధింపవలెయుననిన దాని పూర్వోత్తరోదంతము నామూలముగా నెఱింగి తత్త్వ నిర్ణయము చేయవలెనను సిద్ధాంతము బోధపఱుచునదియే ఈ 'సంధి'.

పెక్కురూపములను అపూర్వఫక్కిని తమిళకర్ణాటశబ్దముల సాదృశ్యముతో సాధించి తెలుఁగునకుఁ బ్రత్యేకాగమశాస్త్ర మనావశ్యకము అనుటను పాఠకులకు సుళువు కలిగించునదీ నూతనమగు 'సంధి'. ఇందలి విషయము లన్నియు నపూర్వములు. ఆంధ్రులకు అనఁగాఁ గేవలాంధ్రభాషా మాత్రైక వేదులకుఁ బారాయణము చేయఁదగినది. అనిదంపూర్వమగు నీ'సంధి'ని వ్రాసి వెలయించి శ్రీరామకృష్ణయ్యగా రాంధ్రభాషకు మహోపకారము నొనర్చిరి."

మూలాలుసవరించు

 1. [1]భారతి మాసపత్రిక ఏప్రిల్ 1936 సంచిక పేజీలు 140-142