సంపత్ పాల్ దేవి
సంపత్ పాల్ దేవి ఉత్తర భారతదేశం లోని ఉత్తర ప్రదేశ్, రాష్ట్రం లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన భారతీయ సామాజిక కార్యకర్త. [1] ఆమె స్థాపించిన గులాబీ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజిక సంస్థ, మహిళా సంక్షేమం, సాధికారత కోసం పనిచేస్తోంది. [1] ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన గులాబి గ్యాంగ్ అనే సామాజిక సంస్థ వ్యవస్థాపకురాలు, గులాబి గ్యాంగ్ అనే సామాజిక సంస్థ మహిళా సంక్షేమం, సాధికారత కోసం పనిచేస్తుంది.[2][3] ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ (హిందీ సీజన్ 6)లో పాల్గొంది..[4]
నేపథ్యం
మార్చుసంపత్ పాల్ దేవి మహిళల హక్కుల కోసం గులాబీ గ్యాంగ్‌ను స్థాపించారు [5]గులాబీ గ్యాంగ్ ఉత్తర ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో విస్తరించి, 270,000 మంది సభ్యులతో సంఘటిత మహిళా ఉద్యమంగా అభివృద్ధి చెందింది. స్త్రీలు గులాబీ రంగు చీరలు ధరిస్తారు, వెదురు కర్రలను తమ ఆయుధాలుగా చేసుకున్నారు , వారిపై ఎవ్వరైన వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లాఆ హింసాత్మక చర్యకు ప్రతిఘటనగా వెదురు కర్రలను రక్షణకు ఆయుధాలుగా ఉపయోగిస్తారు. [6][7]ఫ్రెంచ్ జర్నలిస్ట్ అన్నే బెర్తోడ్ సహకారంతో రాసిన ఆత్మకథలో పాల్ ఆమె ప్రారంభ జీవితాన్ని వివరించింది.[8]BBC సంస్థ ప్రతినిధి నివేదిక ప్రకారం, బండా జిల్లా ఎక్కువగా కుల విచక్షణ (అనగా ఎక్కువ కులం,తక్కువ కులం అనే భావం బలంగా వున్న సమాజం ), భూస్వామ్య ఆధిపత్యం , పురుషాధిక్యప్రభావం సమాజం వున్న ప్రాంతం . స్త్రీ లపై వరకట్న వేధింపులు , గృహ, లైంగిక హింస సర్వసాధారణం. పేదరికం, వివక్ష, దురహంకారంతో కూడిన ఈ భూభాగంలో మహిళా జాగృతి బృందం ఆవిర్భవించడంలో ఆశ్చర్యం లేదని స్థానికులు అంటున్నారు. [9]మార్చి 2, 2014న, గులాబీ గ్యాంగ్‌కు అధిపతిగా ఉన్న పాత్ర నుండి పాల్‌ని తప్పించారు. కారణం ఆమె ఆర్థిక అక్రమాలు కు పాలుపడిందని, సమూహంలోని వారి ప్రయోజనాలకంటే ఆమె వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యతఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. [5]
ప్రారంభ జీవితం
మార్చుసంపత్ పాల్ దేవి ఒక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించినది. సంపత్ పాల్ దేవికి సాధారణ విద్య లేదు,, చిన్నతనంలో వ్యవసాయ పొలాలు, వ్యవసాయ భూములలో పనిచేయవలసి వచ్చినది. చదవడం, వ్రాయడం స్వయంగా తన వ్యక్తిగత ఇష్టం,అనురక్తితో నేర్చుకున్నది. ఆమె చివరికి చాలా సంవత్సరాలతరువాత పాఠశాలలో చేరింది, కానీ ఆమె పన్నెండు సంవత్సరాల వయస్సులో వివాహం చెయ్యడం వల్ల ఆమె విద్యను విడిచిపెట్టవలసి వచ్చింది. [10] సంపత్ పాల్ దేవి పదిహేనేళ్ల వయసులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది.[11]
గులాబీ గ్యాంగ్(గులాబీ సంఘం)నాయకత్వం
మార్చుఒక రోజు, ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామంలో,ఒక వ్యక్తి తన భార్యను నిర్దాక్షిణ్యంగా కొట్టడం సంపత్ పాల్ దేవి చూసింది. ఆమె అతడిని అతని భార్యను కొట్టడం,హింసించడం ఆపమని ఆమె అర్థించింది, విజ్ఞప్తి చేసింది, కానీ అతను సంపత్ పాల్ దేవి మాట వినలేదు, సరికదా ఆమెపై కూడా దాడి చేసి కొట్టాడు.మరుసటి రోజు, పాల్ దేవి మరో ఐదుగురితో కలిసి వెదురు కర్రలు పట్టుకుని తిరిగి వచ్చి, వారు అతనిని చితక కొట్టారు. [12]ఈ సంఘటన ఆ చుట్టు పక్కల జన వాసంలో ,ప్రజానీకంలో కారుచిచ్చు లా వ్యాపించింది.చాలా మంది మహిళలు తమకుంటుంబ తమ మీద జరుగుతున్న అణచివేత,హింస విషయాలలో జోక్యం చేసుకోమని అభ్యర్థిస్తూ సంపత్ పాల్ దేవిని కలిసారు.బండా జిల్లాలో మహిళలపై హింసను దౌర్జన్యం ఎదుర్కోవడంలో తమ వంతు భాద్యతగా లెక్కలేనంత మంది మహిళలు ఆమెతో చేరారు.[13][14]గులాబీ అనే పదం ఆంగ్లంలో pink color ను సూచిస్తుంది. [15] పాల్ దేవి, ఇతర వ్యవస్థాపక సభ్యులు, భారతదేశంలోని గ్రామాలలో చాలా మంది పురుషులకు ముఖ్యంగా మహిళలకు విద్యలేని కారణంగా మహిళలపై అణచివేత,మరియు బాల్య వివాహాలు, కుటుంబ సభ్యుల వత్తిడికి చిన్న వయస్సు లో పెళ్లి చేసుకోవలసి వస్తున్నదని,గృహ హింసకు అణచి వేతకు గురి కావాల్సి వస్తున్నదని గుర్తించారు. [16]
భారతదేశం యొక్క ఉపఖండంలో కొన్ని సామాజిక వర్గాల లోని మహిళలు సామాజిక ఆర్థికంగా పేదవారు, వనరులు లేనివారు కాబట్టి, వారు వివక్షకు గురై అంటరాని కులమని వెలివేయబడి అణచివేతను ఎదుర్కొంటున్నారు. [16] వీరిని "దళితులు"గా కూడా పరిగణిస్తారు, ఈ కులాలలో స్త్రీలు భారతదేశంలోని కుల వ్యవస్థలో అత్యల్ప స్థాయిగా పరిగణించబడ్డారుఎక్కువ - తక్కువ కుల వర్గీకరణ తదనంతరం దళితులపై అపారమైన రాజకీయ అణచివేతకు దారితీసింది, ఈ కుల వివక్షణ పై పోరాడాలని గులాబీ గ్యాంగ్ భావించింది. [17] సంపత్ పాల్ దేవి నాయకత్వంలో, గులాబీ గ్యాంగ్ అహింస పద్ధతిలో హింసాత్మక ఘటనలో పై నిరసనలు,ప్రదర్శనలలో పాల్గొన్నారు. జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతపై మరింత అవగాహన ప్రజలకు కల్పించాలని భావించి ప్రభుత్వ భవనాల చుట్టూ గుంపుగా చేరి తీవ్ర నిరసనలు తెలిపేవారు. [18]ఒకానొక సందర్భంలో, గులాబీ గ్యాంగ్ పోలీసులను అవమానపరచడానికి, పోలీసుల కంటే కుక్కలు తమ వైపు ఉన్నాయనిపోలీసులకు తెలియ చెప్పటానికి గులాబీ కుక్కలతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసనప్రదర్శన చేసారు. [19]2008లో బండా జిల్లా విద్యుత్ కార్యాలయం సిబ్బంది తమకు లంచాలు ఇవ్వలేదని గ్రామంలోని విద్యుత్‌ను నిలిపివేస్తే గులాబీ సంఘం సభ్యులు బండా జిల్లా విద్యుత్ కార్యాలయాన్ని చుట్టుముట్టి తమ నిరసనను ,ప్రతిఘటనను తెలిపారు. [20][21]గులాబీ గ్యాంగ్ వారు ,తమ లక్ష్య సాధనకు జిల్లా, గ్రామ అధికారులపై హింసను ఉపయోగించేవారు . ఒక సందర్భంలో, గులాబీ గ్యాంగ్ అధ్వాన్నమైన రహదారిని సరిచేయమని సంబంధిత అధికారిని అభ్యర్థించింది, అయితే ఆ అధికారి బదులుగా పాల్ దేవిని వ్యక్తిగతంగా దూషించారు. ఫలితంగా, వారు అందరూ అతనిని ఎత్తి పడేశారు , అతను చివరికి కొత్త రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపాడు. [22]మహిళలపై గృహ హింసలోఈ గులాబీ గ్యాంగ్ జోక్యం గురించి చెప్పా లంటే , వారు మొదట భర్తతో అహింసాత్మకంగా తర్కించి ఒప్పించే టందుకు ప్రయత్నించేవారు ,నచ్చ చెప్పేవారు . అయితే అతను తన భార్యపై వేధింపులను ఆపడంలో విఫలమైతే, ముఠా, భార్య ఇద్దరూ అతనిని కొట్టేవారు ,దారికి తెచ్చేవారు. [23][24]తమను వేధించే హింసించే భర్తలను ,మరియు వదిలేసే భర్తలను మహిళలు ఆత్మ స్థయిర్యం లో ఎదిరించి పోరాడాలని సంపత్ పాల్ విశ్వసించేది . ఆ విషయమే ఆమె వారికి బోధించేది. గులాబీ గ్యాంగ్ గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో 100 శాతం న్యాయం చేచేసిందని సంపత్ పాల్ దేవి ఒకసారి పేర్కొన్నారు. [25]అలా ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో ఎదురు దాడిని ఎదుర్కునే టందుకు , వెదురుతో చేసిన లాఠీ అని పిలువబడే పొడవాటి భారతీయ కర్రతో తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్చుకున్నారు. [13]ఆమె ఒకసారి చెప్పింది "అవును, మేము లాఠీలతో (పెద్ద వెదురు కర్రలతో) రేపిస్టులతో పోరాడతాము. మేము నేరస్థుడిని కనుగొంటే, మేము అతనిని చితక కొట్టేవారం,తద్వారా అతను మళ్లీ ఏ అమ్మాయికి లేదా స్త్రీకి తప్పు చేసే ప్రయత్నం చేయడు." [26] గులాబీ గ్యాంగ్ ఆత్మరక్షణ కోసం లేదా అణచివేతను ఎదుర్కోవడానికి చివరి ప్రయత్నంగా మాత్రమే హింసాత్మక పద్ధతులను ఉపయోగించింది.[27]
పింక్(గులాబీ రంగు) చీరల వినియోగం
మార్చుసంపత్ పాల్ దేవి, గులాబీ గ్యాంగ్ వారి దుస్తుల ఎంపికలో గులాబీ రంగునుఎంచుకున్నారు . గులాబీ రంగు చీర తమ కమ్యూనిటీల్లో తమకు గౌరవాన్ని ఇస్తుందని వారి నమ్మకం.[17] పింక్ అనేది గులాబీ రంగుకు ప్రత్యామ్నాయం. [28]గ్యాంగ్ సభ్యులు గులాబీ రంగు చీర ధరించడం తప్పనిసరి కాకున్నను, గులాబీ రంగు చీర ముఠా సభ్యులకు అధికారం, బంధం కలిగిస్తుందని భారతదేశంలోని మహిళలకు సమాజ భావనను నెలకొల్పుతుందని సంపత్ పాల్ దేవి విశ్వసించారు. [29]గులాబీ రంగు చీరను ఎంచుకొనుటకు మరో కారణం అంతవరకు ,గులాబీ రంగుతో భారతీయ సమాజంలో ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన సంబంధాలు లేనందున ఆ రంగు ఎంపిక చేయబడింది. [30]
అవార్డులు, విజయాలు
మార్చువరకట్నం, బాల కార్మికులు, అవినీతి, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సంఘం చేసిన ప్రయత్నాలకు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డ్స్‌ను గులాబీ గ్యాంగ్‌కు అందించారు.గులాబీ గ్యాంగ్ వారు నారీ శక్తి సమ్మాన్‌కు వారు చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా కెల్వినేటర్ 11వ GR8 ఆవార్డు ప్రధానం చెయ్యబడినది. [31]
గులాబీ గ్యాంగ్ కుంభకోణం
మార్చు2014 ప్రారంభంలో, గులాబీ గ్యాంగ్ ఆధారంగా తీసిన ఒక చిత్రం విడుదల కావడానికి నాలుగు రోజుల ముందు, సంపత్ పాల్ దేవిని గులాబీ గ్యాంగ్‌లో ఆమె నాయకత్వ స్థానం నుండి తొలగించారు.[32]గ్యాంగ్ కు చెందిన డబ్బు దుర్వినియోగం చేయడం, గులాబీ గ్యాంగ్‌కు దీటుగా రాజకీయాల్లో దేవి తన వృత్తిని కొనసాగించడం, ఆమె నిరంకుశ స్వభావం వంటి ఆరోపణల ఆధారంగా ఆమెను నాయకత్వం నుండి తొలగించారు. [33]సంపత్ పాల్ దేవి గులాబీ గ్రూపును సామాజిక వర్గంగా కాకుండా రాజకీయ సంస్థగా మార్చేసిందని గులాబీ గ్యాంగ్ సభ్యులు విశ్వసించారు. [32]గులాబీ గ్యాంగ్ సభ్యులకు తెలియజేయకుండా దేవి 2012 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నుండి పోటీ చేయడం, “బిగ్ బాస్” (హిందీ సీజన్ 6) షోలో స్వయంగా పాల్గొనడం , ఎన్నికల ప్రచారం చేయమని చేయమని గ్రూప్ సభ్యులపై ఒత్తిడి చేయడం వంటివి దీనికి తార్కారం ,సాక్ష్యం గా శివరే పేర్కొన్నాడు.[32]గులాబీ గ్రూప్‌కు ఇచ్చిన విరాళాల నుండి ఆమె వ్యక్తిగతంగా డబ్బు తీసుకున్నారని, ఆమె “గులాబీ గ్యాంగ్” చిత్ర నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుందని నిరూపించబడని వాదనలు కూడా ఉన్నాయి, ఎందుకంటే, ఇతర గ్రూప్ సభ్యుల మాదిరిగా కాకుండా, తమ గ్రూపు ఆధారంగా చిత్రం నిర్మాణం చేస్తున్నందుకు చిత్రనిర్మాత ల నుండి ఆమె పరిహారం కోరే ప్రయత్నం చేయలేదు. [32]తర్వాత 2014లో, దేవి తన మాజీ సహాయకులు జైప్రకాష్ శివరే, మిత్తు దేవిలపై భౌతిక దాడికి పాల్పడినది. వారు తనపై దాడి చేశారని పాల్ దేవి ఆరోపించింది, అయితే ఆమె భౌతికంగా ప్రతీకారం తీర్చుకున్నట్లు నివేదికలు చెప్పాయి.[34] గులాబీ గ్యాంగ్ నాయకురాలిగా సంపత్ పాల్ దేవి ని తొలగించిన తరువాత గులాబీ గ్యాంగ్ అసిస్టెంట్ కమాండర్ గా వున్న సుమన్ సింగ్ చౌహాన్ కొత్త లీడరు గా ఎన్నికయ్యారు. [35]
కమ్యూనిటీకి/సంఘానికి ఆమె సేవలు-డాక్యుమెంటరి చిత్రీకరణ
మార్చుగులాబీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసిన చాలా సంవత్సరాల తర్వాత, 2008లో, సంపత్ పాల్ దేవి పిల్లల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసారు . యువతుల విద్య యొక్క కీలకమైన స్వభావంపై ఆమెకున్న నమ్మకం కారణంగా, హాజరైన 600 మందిలో 400 మంది విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఆమె దృష్టిలో, బాలికలు చారిత్రాత్మకంగా పొలాల్లో పని చేసేవారి యొక్క భవిష్యత్తు మార్చడంలో , భారతదేశంలోని సామాజిక నిబంధనలను మార్చడంలో విద్య ముఖ్యమని ఆమె విశ్వసించినంది. [36]పాల్ దేవి ఒకసారి అన్నది "ప్రజలు, ముఖ్యంగా అత్యంత పేద, అట్టడుగున ఉన్న కులాలకు చెందినవారు, వారి అమ్మాయిలను చదివించరు. చాలా మందికి, బాలికలను పాఠశాలకు పంపడం ఆర్థిక స్థోమత సమస్య." [37]మహిళల ఆర్థిక స్వేచ్ఛ, భద్రతను గులాబీ గ్యాంగ్ ప్రోత్సహించినది , ఎం వారు అసలైన, హోమ్‌స్పన్ ఉత్పత్తులను రూపొందించే అనేక చిన్న వ్యాపారాలను స్థాపించారు. ఈ స్త్రీలు తయారు చేసే ఉత్పత్తులలో ఊరగాయలు, కొవ్వొత్తులు, ఆయుర్వేద ఔషధం గా పిలువబడే ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయి. [38]ఒక గులాబీ గ్యాంగ్ అనే డాక్యుమెంటరీ 2012లో గులాబీ గ్యాంగ్ పేరుతో విడుదలైంది, ఇది భారతదేశంలో పాల్ దేవి, ఈ మహిళలు ఎదుర్కొనే రోజువారీ సంఘర్షణలు, సంక్లిష్టతలను ప్రదర్శిస్తుంది. హింస - ప్రతిఘటన, లింగ వివక్షణ-సమానత్వం, భారతదేశంలోని లింగ సంబంధాlu యొక్క మొత్తం సహజవివరాలు చిత్రంలో ప్రస్తాయింపబడినవి. ఆమె, గులాబీ గ్యాంగ్ వారి లక్ష్యాల కోసం అవిశ్రాంతంగాపోరాటం ,శ్రమించడం చిత్రం యొక్క ప్రధాన అంశం. [39]చిత్రాన్ని వీక్షించిన తర్వాత, గులాబీ గ్యాంగ్ సభ్యులను ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులుగా చిత్రీకరించడం పట్ల పాల్ దేవి అసంతృప్తి చెందారు బదులుగావారి కార్యకలాపాలలో,సభ్యులు లాఠీలను(వెదురు కర్రలు) మాత్రమే ఉపయోగిస్తారని చూపించి వుంటే సబబు అని వాదించారు.[40] సంపత్ పాల్ దేవి భారతీయ టెలివిజన్ రియాలిటీ సిరీస్ బిగ్ బాస్‌లో పాల్గొన్నారు.ఈ రియాలిటీ సిరీస్లో ఆమె మహిళల హక్కుల విషయంలో తన ప్రధాన ఆదర్శాలు, పరిచయాలను ముందుకు తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకునే ప్రధాన లక్ష్యంతో పాల్గొంది. ఆమె తన నాయకత్వ స్వరం ద్వారా వీక్షకుల మధ్య అవగాహనను కల్పించాలని భావించినది. [41]
రాజకీయ ప్రయత్నాలు
మార్చు2010లో, ముఠా ప్రారంభమైన నాలుగు సంవత్సరాల తరువాత, పంచాయతీ ప్రాతినిధ్యం కోసం స్థానిక ప్రభుత్వంలో 21 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సభ్యుల ప్రాతినిధ్యం రోడ్డ పర్యవేక్షణ,నిర్వహణ , స్వచ్ఛమైన నీరుతో సహా సంఘం విషయాలను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. [42]పాల్ దేవి అనేక సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2007లో, ఆమె నారాయణి అసెంబ్లీ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవలేకపోయింది. [43]తరువాతి దశాబ్దంలో అనేక సార్ల విఫల ప్రయత్నాల తర్వాత, సంపత్ పాల్ దేవి 2022లో మళ్లీ పోటీ చేసి, తదుపరి ఎన్నికలకు ఆమె అభ్యర్థిత్వ టిక్కెట్ నిరాకరించడంతో, ఆమె తన కాంగ్రెస్ అభ్యర్థిత్వం నుండి వైదొలిగింది. [44]
Television
మార్చుసంవత్సరం | పేరు | పేరు | చానల్ | వివరాలు | రెఫరెన్సు |
---|---|---|---|---|---|
2012 | బిగ్ బాస్ (హిందీ )సీజన్,6 | పోటీదారి | కలర్ టీవి | Entered Day 1, నిస్కమించిన రోజు 34 |
ఇవికూడా చుడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Krishna, Geetanjali (5 June 2010). "The power of pink". Business Standard. Retrieved 20 July 2010.
- ↑ "Sampat Pal: All you need to know about the Gulabi Gang leader". Hindustan Times. 2014-03-07. Archived from the original on 8 March 2014.
- ↑ Fontanella-Khan, Amana (19 July 2010). "Wear a Pink Sari and Carry a Big Stick: The women's gangs of India". Slate magazine. Retrieved 7 March 2012.
- ↑ "'Gulabi gang' leader Sampat Pal to participate in Bigg Boss". Firstpost. 4 October 2012. Retrieved 2019-05-25.
- ↑ 5.0 5.1 "Sampat Pal Ousted from Gulabi Gang". The Times of India. 4 March 2014.
- ↑ Prasad, Raekha (15 February 2008). "Banda sisters". The Guardian. Retrieved 20 July 2010.
- ↑ "Sampat Pal: All you need to know about the Gulabi Gang leader". Hindustan Times. 7 March 2014. Archived from the original on 8 March 2014. Retrieved 2014-10-22.
- ↑ Berthod, Anne, Sampat Pal, Warrior in a Pink Sari: The Inside Story of the Gulabi Gang as Told to Anne Berthod, Zubaan, 2012
- ↑ Biswas, Soutik (26 November 2007). "India's "pink" vigilante women". BBC News. Retrieved 22 May 2018.
- ↑ Jachak, Shreya (October 17, 2023). "Sampat Pal Devi: An Epitome of Feminism".
- ↑ "Celebrating Female Heroes: The Gulabi Gang". Rice Love (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "Gulabi Gang :: History". gulabigang.in. Retrieved 2023-12-04.
- ↑ 13.0 13.1 Seelhoff, Cheryl Lindsey; Leigh, Sue; Rodgers, Melissa; Herold, Steph; Mantilla, Karla (2007). "INDIA: women form "gang for justice"". Off Our Backs. 37 (2/3): 4–5. ISSN 0030-0071. JSTOR 20838794.
- ↑ "Gulabi Gang :: History". gulabigang.in. Retrieved 2023-11-29.
- ↑ "She takes a stand : 16 fearless activists who have changed the world | WorldCat.org". search.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-11-30.
- ↑ 16.0 16.1 Thynne, Lizzie; Al-Ali, Nadje; Longinotto, Kim (2011). "an interview with Kim Longinotto". Feminist Review. 99 (99): 25–38. doi:10.1057/fr.2011.47. ISSN 0141-7789. JSTOR 41288873. S2CID 143314649.
- ↑ 17.0 17.1 "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". academic.oup.com. Retrieved 2023-11-30.
- ↑ Richards, Matthew S. (2016). "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". Communication, Culture & Critique. 9 (4): 558–576. doi:10.1111/cccr.12139. Retrieved 2023-11-29.
- ↑ Miller, Katy (December 6, 2013). "The Gulabi Gang as a Social Movement: An Analysis of Strategic Choice" (PDF). Archived from the original (PDF) on 2021-11-13. Retrieved November 29, 2023.
- ↑ Prasad, Raeka (February 14, 2008). "Banda Sisters". The Guardian. Retrieved November 30, 2023.
- ↑ White, Aaronette (July 23, 2009). "Justice by Any Means Necessary: Vigilantism among Indian Women". Feminism & Psychology. 19 (3): 313–327. doi:10.1177/0959353509105622. S2CID 143457584. Retrieved 2024-02-06.
- ↑ Richards, Matthew (2016-12-01). "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". Academic.oup.com. Retrieved 2023-11-30.
- ↑ Richards, Matthew (December 1, 2016). "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". Academic.oup.com. Retrieved November 30, 2023.
- ↑ "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". academic.oup.com. Retrieved 2023-12-04.
- ↑ "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". academic.oup.com. Retrieved 2023-12-04.
- ↑ Desai, Shweta. "Gulabi Gang: India's women warriors". Al Jazeera (in ఇంగ్లీష్). Retrieved 2023-12-05.
- ↑ "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". Retrieved 2023-12-02.
- ↑ https://www.collinsdictionary.com/us/dictionary/hindi-english/गुलाबी
- ↑ Thakkar, Shriya (2018-03-01). "Art in Everyday Resistance: A Case Study of the Pink Vigilantes of India". Junctions Graduate Journal of the Humanities (in అమెరికన్ ఇంగ్లీష్). 3 (1): 8. doi:10.33391/jgjh.5. S2CID 164296288.
- ↑ "Interview: Pink is Powerful as India's 'Gulabi Gang' Offers Hope for Oppressed Women". Asia Society (in ఇంగ్లీష్). Retrieved 2023-11-30.
- ↑ "Gulabi Gang: An Extraordinary Women's Movement » HelloNaari.com" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-04-25. Retrieved 2023-12-04.
- ↑ 32.0 32.1 32.2 32.3 "Gulabi Gang splits, Sampat Pal dethroned". Deccan Chronicle. 2014-03-04. Retrieved 2023-10-28.
- ↑ Richards, Matthew (2016-01-06). "The Gulabi Gang, Violence, and the Articulation of Counterpublicity". Retrieved 2023-11-17.
- ↑ "Sacked Gulabi gang founder Sampat Pal involved in street fight". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
- ↑ "She got Pink'd. Gulabi Gang leader gets the boot". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-03.
- ↑ "Pink Sari gang fights injustice | Panos London". 2015-04-02. Archived from the original on 2 April 2015. Retrieved 2023-11-17.
- ↑ Jainani, Deepa (November 25, 2011). "Pink Sari gang fights injustice | Panos London" (in ఇంగ్లీష్). Archived from the original on 2023-12-02. Retrieved 2023-12-02.
- ↑ Atreyee, Sen (December 20, 2012). "WOMEN'S VIGILANTISM IN INDIA: A CASE STUDY OF THE PINK SARI GANG". SciencesPo.fr. Retrieved November 30, 2023.
- ↑ "Gulabi Gang". Piraya Film (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
- ↑ "Indian woman who formed vigilante group fails to stop Bollywood movie". The Independent (in ఇంగ్లీష్). 2014-03-06. Retrieved 2023-11-17.
- ↑ "'Gulabi gang' leader Sampat Pal to participate in Bigg Boss-Fwire News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2012-10-04. Retrieved 2023-11-17.
- ↑ "Women's Vigilantism in India: A Case Study of the Pink Sari Gang | Sciences Po Mass Violence and Resistance - Research Network". www.sciencespo.fr (in ఇంగ్లీష్). 2016-01-25. Retrieved 2023-12-04.
- ↑ Miller, Katy (2013). ""The Gulabi Gang as a Social Movement: An Analysis of Strategic Choice"" (PDF). Archived from the original (PDF) on 2021-11-13. Retrieved 2024-02-06.
- ↑ "UP elections: Denied ticket, Gulabi Gang founder quits Congress". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-15. Retrieved 2023-11-17.