సంబల్‌పూర్ జిల్లా

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో సంబల్పూర్ జిల్లా ఒకటి. చారిత్రక ప్రత్యేకత కలిగిన సంబల్పూర్ నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మహానదీ ముఖద్వారంలో ఉంది. జిల్లా వైశాల్యం 6702 చ.కి.మీ. జిల్లాలో 60% భూభాగం దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో దేవ్‌ గర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బర్గర్ మరుయు జర్స్‌గుడా జిల్లాలు, ఉత్తర సరిహద్దులో సుందర్‌గఢ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో సుందర్ఘర్, అంగూల్ జిల్లాలు ఉన్నాయి. ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సంబల్పూర్ వారధిగా ఉంది. ఒకప్పుడీ జిల్లా వజ్రాలవ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఈ జిల్లా వస్త్రాల తయారీకి కూడా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ జిల్లాలో తయారుచేయబడే " సంబల్పురి చీర "లు రాష్ట్రమంతటా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. సంబల్పురి సంగీతం , సంబల్పురి నృత్యం కూడా జిల్లాకు మరికొంత ప్రత్యేకత తీసుకువసున్నాయి. జిల్లాలోని " బద్రమ అభయారణ్యం "లో అరుదైన జంతువులు సంచరిస్తూ ఉంటాయి.

సంబల్‌పూర్ జిల్లా
జిల్లా
పైన: ఘంటేశ్వరి ఆలయం దిగువ: హుమా సమీపంలో మహానది
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంసంబల్‌పూర్
Government
 • Member of Lok SabhaNagendra Kumar Pradhan (BJD)
విస్తీర్ణం
 • Total6,702 కి.మీ2 (2,588 చ. మై)
జనాభా
 (2001)
 • Total9,35,613
 • జనసాంద్రత122/కి.మీ2 (320/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా
 • Otherహిందీ,ఇంగ్లీషు, Sambalpuri
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
768 xxx
టెలిఫోన్ కోడ్663
Vehicle registrationOD-15
లింగ నిష్పత్తి1.031 /
అక్షరాస్యత67.25%
లోక్ సభ నియోజకవర్గంSambalpur
Vidhan Sabha constituency7
 
  • Athamallik
    Chhendipada
    Deogarh
    Kuchinda
    Rairakhol
    Rengali
    Sambalpur
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,530 మిల్లీమీటర్లు (60 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత47 °C (117 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత11.8 °C (53.2 °F)

చరిత్ర

మార్చు

సంబల్పూర్ " ప్టోల్మి " పుస్తకంలో సంబలక అని పేర్కొనబడింది. ఒడిషా రాష్ట్ర పశ్చిమ భాగంలో ఉన్న సహజసౌందర్యం కలిగిన ప్రదేశం ఇది. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునుపు ఇది రాజాస్థానంగా ఉండేది. 1862లో రాజ్యానికి పురుషవారసులు లేనికారణంగా ఇది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 1905లో ఈ జిల్లా బెంగాల్ భూభాగంలో చేర్చబడింది. అయినప్పటికీ ఉపవిభాగాలైన ఫూల్ఝర్, చందర్పూర్, పదమపూర్ మద్యభూభాగంలోనే ఉన్నాయి.1912లో బెంగాలు లోని ఒడిషా ప్రాంతం ఒడిషా , బిహార్ భూభాగంగా చేయబడింది. 1936లో ఒడిషా ప్రత్యేక భూభాగంలో భాగంగా మారింది. 1947లో ఒడిషా భారత ప్రభుత్వంలో ఒక రాష్ట్రంగా మార్చబడింది. 1993లో సంబల్పూర్ జిల్లా 4 ప్రత్యేక జిల్లాలుగా విభజించబడ్డాయి. 1993లో బర్గఢ్ జిల్లా రూపొందించబడింది. 1994లో ఝార్సుగూడా , దేవ్గడ్ జిల్లాలు రూపొందించబడ్డాయి. సంబల్పూర్ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది..[1]

అష్టసాంబులు

మార్చు

సంబల్పూర్ జిల్లాలో చౌహాన్ పాలనలో పలు శివాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో అష్టసాబులు ప్రత్యేకత సంతరించికున్నాయి. అవిభాజిత సంబల్పూర్ జిల్లాలోని అష్టసాంబుల వివరణ పట్టిక:-

సంఖ్య పేరు ప్రాంతం
1 భీమలేశ్వర్ హుమ
2 కేదార్నాథ్ అంబబానా (ప్రస్తుతం బర్గద్ జిల్లా)
3 బిశ్వనాథ్ డేగా (ప్రస్తుతం బర్గద్ జిల్లాలో ఉంది)
4 బలుంకేశ్వర్ గైసమ (బర్గద్ జిల్లా)
5 మంధన బాబా మనేశ్వర్
6 స్వప్నేశ్వర్ సొర్న (ప్రస్తుతం బర్గద్ జిల్లా)
7 బిశ్వేశ్వర్ సొరంద (ప్రస్తుతం బర్గద్ జిల్లా)
8 నీలకంటేశ్వర్ నిలీ (ప్రస్తుతం బర్గద్ జిల్లా)
9 బాబా కమలేశ్వర్ ససన్, కమల్‌చక్.

జిల్లాలోని శివాలయాల పూజారులను చాణపతి అంటారు.

ఆర్ధికం

మార్చు

సంబల్పూర్ జిల్లా ఆర్థికకరంగం ప్రధానంగా వ్యవసాయం మీద తరువాత అరణ్యం మీద ఆధారపడి ఉంది. అరణ్యం ఆర్థికరంగం మీద ఆదాయాన్ని అందిస్తూ, గృహావసరాలను తీరుస్తూ ప్రధాన పాత్ర వహిస్తుంది. అరణ్యం కొంతమంది ప్రజలకు జీవనాధారంగా మారింది. సంబల్పూర్ అభయారణ్యాలకు ఆనుకుని నివసిస్తున్న ప్రజలు అధికంగా అరణ్యం మీద అధికంగా ఆధారపడుతున్నారు. గతంలో సంబల్పూర్ వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. కెందు ఆకులు (తునికి ఆకులు) కూడా సంబల్పూర్ అరణ్యాలలో ఉత్పత్తు ఔతున్నాయి. కెందు ఆకులు అరణ్య ఉత్పత్తులలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీటిని ఒడిషా బంగారు ఆకులుగా వర్ణిస్తుంటారు. చేనేత వస్త్రాలకు కూడా సంబల్పూర్ ప్రత్యేక గుర్తింపును పొదుతుంది. వీటిని సంబల్పూర్ వస్త్రాలు అంటారు. సాటిలేని నమూనా, నిర్మాణం, డిజైన్‌లకు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సంబల్పూర్ చీరెలను "బాందనా చీరె " అంటారు. సంబల్పూర్ పారిశ్రమీకరణ చేయబడిన తరువాత స్టీలు, అల్యూమినియం, విద్యుత్తు ఉత్పత్తి రంగంలో ఉతపత్తిని సాధించింది. సంబల్పూర్ గిరిజన సంప్రదాయ సంపద, అద్భుతమైన అరణ్యభూభాగం కలిగి ఉంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సంబల్పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,044,410,[3]
ఇది దాదాపు. సిప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడే ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.63%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 973:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.91%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు

మార్చు

సంబల్పూర్ జిల్లాలో ఆస్ట్రోయాసియాటిక్ భాషలలో ఒకటైన అసురి భాషను దాదాపు 17000 మంది మాట్లాడుతుంటారు.[6] ఆదివాసీ ప్రజలు భుంజియా భాషను దాదాపు 7000 మంది మాట్లాడుతుంటారు.[7] ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన ప్రజలు బుర్ల, హిరాకుడ్, ఒరియా భాషను మాట్లాడుతుంటారు. ముస్లిములు, మర్వాడీలు, సిక్కులు హిందీ మాట్లాడుతుంటారు. సంబల్పూర్ పట్టణంలో 90% ప్రజలు సంబలపురి భాషను మాట్లాడుతుంటారు.

సంస్కృతి

మార్చు

పర్యాటక ఆకర్షణలు

మార్చు

ఒడిషా రాష్ట్ర రాజధాని నుండి సంబల్పూర్ 321 కి.మీ దూరంలో ఉంది. ఇది వజ్రాల వ్యాపారానికి పురాతన కేంద్రంగా ఉంది. అంతేకాక అంతర్జాతీయంగా వస్త్రాల తయారీకి, గిరిజన సంప్రదాయానికి, అద్భుతమైన వనసంపదకు గుర్తించబడుతుంది. రైలు, రహదారి మార్గంలో సంబల్పూర్‌ను సులువుగా చేరవచ్చు.సంబల్పూర్‌లో మహానదీతీరంలో శ్యామలేశ్వరీ ప్రధానదైవంగా శ్యామల్ గుడి ఉంది. ఇతర ప్రధాన ఆలయాలలో బుధరాజా ఆలయం ఒకటి. ఈ ఆలయప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం బుధరాజా గిరిశిఖరం మీద ఉంది. ఈ ఆలయాలు సంబల్పూర్ పట్టణానికి 15కి.మీ దూరంలో ఒకరోజులో సందర్శించి రాగలిగిన దూరంలో ఉన్నాయి. సంబల్పూర్‌కు 20 కి.మీ దూరంలో హుమ ఆలయం ఉంది. ఆలయం ఆస్చర్యకరంగా 17 డిగ్రీలు వంగి ఉంటుంది. సంబల్పూర్ పాలకులు నిర్మించిన ఈ ఆలయం ఇంజినీరింగ్ అద్భుతంగా గత కొన్ని దశాబ్ధాలుగా గుర్తించబడుతుంది.

రాజకీయాలు

మార్చు

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

The following is the 4 Vidhan sabha constituencies[8][9] of Sambalpur district and the elected members[10] of that area

సంఖ్య నియోజకవర్గం రిజర్వేషన్ అసెంబ్లీ జియోజకవర్గం (బ్లాకులు) 14వ అసెంబ్లీ సభ్యుడు రాజకీయ పార్టీ
15 కుచిండ షెడ్యూల్డ్ కుల్లాలు కుచుండా (ఎన్.ఎ.సి) కుచుండా, బర్మా, జమంకిరా. రాజేంద్రకుమార్ ఐ.ఎన్.సి
16 రెంగలి షెడ్యూల్డ్ కులాలు రెంగలి, ధంకుడా, మనేశ్వర్ (కొంతభాగం) దుర్యోధన్ గార్డియా INC
17 సంబల్పూర్ నన్ సంబల్పూర్ (ఎం), బుర్లా (ఎన్.ఎ.సి), హిరాకుడ్. జయనారాయణ్ మిశ్రా. BJP
18 రైరఖొల్ లేదు రైరఖొల్ (ఎన్.ఎ.సి), రైరఖొల్, జుజిముర, నక్తిదుల్, మనేశ్వర్ (భాగం) ప్రసన్న ఆచార్య బి.జె.డి

మూలాలు

మార్చు
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  6. M. Paul Lewis, ed. (2009). "Asuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  7. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
  8. Assembly Constituencies and their EXtent
  9. Seats of Odisha
  10. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు