ఛత్తీస్‌గఢ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़), మధ్య భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఇది 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా వున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది.
ఛత్తీస్‌గఢ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
రాయ్‌పుర్ - 21°16′N 81°36′E / 21.27°N 81.60°E |
పెద్ద నగరం | రాయ్‌పుర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
20,795,956 (17వది) - 108/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
135,194 చ.కి.మీ (?) - 16 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[ఛత్తీస్‌గఢ్ |గవర్నరు - [[ఛత్తీస్‌గఢ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
2000-11-01 - శేఖర్ దత్ - భూపేశ్ బాఘెల్ - Unicameral (90) |
అధికార బాష (లు) | హిందీ, ఛత్తీస్‌గఢీ |
పొడిపదం (ISO) | IN-CT |
వెబ్‌సైటు: www.chhattisgarh.nic.in | |
ఛత్తీస్‌గఢ్ రాజముద్ర |
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము. హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
పేరు వెనుక చరిత్రసవరించు
చత్తిష్ అనగా36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం.
జిల్లాలుసవరించు
- బస్తర్
- బిలాస్‌పూర్
- దంతేవాడ (దక్షిణ బస్తర్)
- ధంతరి
- దుర్గ్
- జంజ్‌గిర్-చంప
- జష్పూర్
- కంకేర్ (ఉత్తర బస్తర్)
- కవార్ధ
- కోర్బా
- కొరియ
- మహాసమంద్
- రాయగఢ్
- రాయ్‌పుర్
- రాజ్‌నంద్‌గావ్
- సర్గూజా
- సుక్మ
- బలోద బజార్
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సౌలభ్యానికై విభజించబడ్డాయి.
ప్రభుత్వంసవరించు
రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అనుగా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర గణాంకాలుసవరించు
- అవతరణము.2000 నవంబర్ 1
వైశాల్యము.1,36,034 చ.కి.
- జనసంఖ్య. 25,540,196 స్త్రీలు. 12,712,281 పురుషులు. 12,827,915 నిష్పత్తి .991
- జిల్లాల సంఖ్య.27
- గ్రామాలు. 19,744 పట్టణాలు.97
- ప్రధాన భాష. చత్తీస్ గరి, హింది ప్రధాన మతం.హిందూ
- పార్లమెంటు సభ్యుల సంఖ్య, 11 శాసన సభ్యుల సంఖ్య. 90
- మూలము. మనోరమ యీయర్ బుక్
దేవాలయాలుసవరించు
- బాంబ్లేశ్వరి దేవాలయం: రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో డోంగర్‌ఘర్‌లో ఉన్న హిందూ దేవాలయం.
చిత్రమాలికసవరించు
Tendu Patta (Leaf) collection in Chhattisgarh, India.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Chhattisgarh. |
- ఛత్తీస్‌గఢ్ travel guide from Wikivoyage
- Chhattisgarh News
- Chhattisgarh's traditional Recipes/Food/Cusine