సంయుక్తబీజం (Zygote, జైగోట్) [1] అనేది ఫలదీకరణ కణం, ఇది కొత్త జంతువు లేదా మొక్కగా పెరుగుతుంది. ఆడ అండాన్ని మగ స్పెర్మ్ సెల్ చేరినప్పుడు, ఏర్పడిన ఫలిత కణాన్ని 'జైగోట్' అంటారు. అప్పుడు జైగోట్ అంతకుఅంత అవుతూ, పిండంగా ఏర్పడుతుంది. అలా రెండు సంయోగకణముల (గామేట్ల) యూనియన్ నుండి ఒక జైగోట్ ఏర్పడుతుంది, ఇది మానవ జీవి యొక్క అభివృద్ధిలో మొదటి దశ. రెండు హాప్లోయిడ్ కణాలైన అండం, స్పెర్మ్ కణాల మధ్య ఫలదీకరణం ద్వారా జైగోట్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి డిప్లాయిడ్ కణాన్ని తయారు చేస్తాయి. డిప్లాయిడ్ కణాలలో తల్లిదండ్రుల క్రోమోజోములు, DNA రెండింటి యొక్క పోలికలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇది పూర్తిగా ఏర్పడిన మానవుడిని సృష్టించడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని జంతువులు జైగోట్‌ను పూర్తిస్థాయిలో పెరిగే వరకు తమ శరీరంలో ఉంచుకుంటాయి. జైగోట్ ఏర్పడటానికి, శిశువు పుట్టడానికి మధ్య ఉన్న సమయాన్ని గర్భం అంటారు. ఇతర జంతువులు తమ శరీరంలో జైగోట్‌ను ఉంచవు, కానీ గుడ్డు పెడతాయి. గుడ్డు సిద్ధంగా ఉన్నంత వరకు జైగోట్ పెరుగుతుంది, అది పొదగబడి పిల్ల పుడుతుంది.

జైగోట్: స్పెర్మ్‌తో ఫలదీకరణం తరువాత గుడ్డు కణం. మగ, ఆడ కణాలు జతకూడుతున్నాయి, కాని జన్యు పదార్ధం ఇంకా ఏకం కాలేదు.

అర్థం కాని లేదా కఠిన పదములకు వివరణ సవరించు

  • గామేట్ (Gamete) - బీజకణం, శుక్లధాతువు, సంయోగి, సంయోగికణము, పునరుత్పత్తి కణములు, స్త్రీలోని ఆండము లేక పురుషునిలోని శుక్రకణము

మూలాలు సవరించు

  1. "English etymology of zygote". etymonline.com. Archived from the original on 2017-03-30.