సంసార (2001 సినిమా)

సంసార 2001లో విడుదలైన భారతదేశ / ఇటాలీయన్ / ఫ్రెంచి/జర్మన్ చలనచిత్రం. జ్ఞానోదయం కోసం బౌద్ధ సన్యాసి అన్వేషణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి పాన్ నాలిన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని పాన్, టిమ్ బేకర్ రచించగా సన్యాసి తషి పాత్రలో షాన్ కు, పెమా పాత్రలో క్రిస్టీ చుంగ్ నటించారు.

సంసార
దర్శకత్వంపాన్ నాలిన్
కథా రచయితపాన్ నాలిన్, టిమ్ బేకర్
నిర్మాతఫండాంగో / ఓషన్ ఫిల్మ్స్ డిస్ట్రీబూషన్ / పండోర ఫిల్మ్ / పారడిస్ ఫిల్మ్స్
తారాగణంషాన్ కు, క్రిస్టీ చుంగ్, నీలేషా బావోరా
ఛాయాగ్రహణంర్యాలీ రాల్ట్చేవ్
కూర్పుఇసాబెల్ మీర్
సంగీతంసిరిల్ మోరిన్, దాదాన్
విడుదల తేదీ
2002
సినిమా నిడివి
138 నిముషాలు
దేశాలుభారతదేశం, ఇటలీ, ఫ్రెంచి, జర్మన్, స్విట్జర్లాండ్
భాషలుటిబెటన్, లడఖి భాష
బడ్జెట్$3,000,000 (అంచనా)

కథసవరించు

ఇది లడఖ్, హిమాలయాల ప్రాంతంలో రూపొదించిన ఆధ్యాత్మిక ప్రేమకథ చిత్రం. ప్రపంచాన్ని త్యజించి ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందేందుకు ఒక వ్యక్తి చేసిన పోరాటం, తన ప్రేమను జీవితాంతం నిలుపుకునేందకు ఒక మహిళ చేసిన పోరాటం ఈ చిత్రం. ఇందులోని కథాంశం విశ్వామిత్రుడు, మేనక వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది.

నటవర్గంసవరించు

  • షాన్ కు
  • క్రిస్టీ చుంగ్
  • నీలేషా బావోరా

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: పాన్ నాలిన్
  • నిర్మాత: ఫండాంగో / ఓషన్ ఫిల్మ్స్ డిస్ట్రీబూషన్ / పండోర ఫిల్మ్ / పారడిస్ ఫిల్మ్స్
  • రచన: పాన్ నాలిన్, టిమ్ బేకర్
  • సంగీతం: సిరిల్ మోరిన్, దాదాన్
  • ఛాయాగ్రహణం: ర్యాలీ రాల్ట్చేవ్
  • కూర్పు: ఇసాబెల్ మీర్

అవార్డులు - పురస్కారాలుసవరించు

ఈ చిత్రం 51వ మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "ది మోస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఆడియన్స్ అవార్డు" పొందడంతోపాటు వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఇతర పురస్కారాలను అందుకుంది. అంతేకాకుండా ఇటలీ, ఫ్రాన్సు దేశపు టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.[1]

మూలాలుసవరించు

ఇతర లంకెలుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.