మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామిత్రుడు, మేనకకు జన్మించిన కుమార్తయే శకుంతల. [1]

మేనక
మేనక
మేనక విశ్వామిత్రులు: రాజా రవి వర్మ చిత్రం.
సమాచారం
గుర్తింపుApsara
పిల్లలువిశ్వామిత్రుని వల్ల శకుంతల

పురాణాల ప్రకారం చరిత్ర

మార్చు

మేనక దేవతలు, దానవులు నిర్వహించిన క్షీరసాగర మథనం లో జన్మించింది. ఆమె శీఘ్ర మేధస్సు, సహజ ప్రతిభ కలిగిన ప్రపంచంలోనే అత్యంత అందమైన అప్సరసలలో ఒకతె. కానీ ఆమె కుటుంబాన్ని కోరుకుంది. ప్రాచీన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఋషులలో ఒకరైన విశ్వామిత్రుడు, దేవతలను భయపెట్టాడు.మరొక స్వర్గాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నించాడు. ఇంద్రుడు, తన శక్తులను చూసి భయపడి, మేనకను స్వర్గం నుండి భూమికి పంపించి అతనిని ఆకర్షించడానికి, అతని తపస్సును విచ్ఛిన్నం చేయించాలని భావిస్తాడు.

విశ్వామిత్రుని ఇంత తీవ్రమైన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు కంకణం కట్టుకుని, ఇంద్రలోక నర్తకీమణులలో (రంభ, ఊర్వశి, మేనకలు) ఒకరైన మేనకను పంపిస్తాడు. పుష్కర సరస్సులో స్నానం చేస్తున్న మేనకను చూసి మోహించిన విశ్వామిత్రుడు, తన తపస్సు లక్ష్యాన్ని మరచి, మేనకపై ప్రేమ పెంచుకుని, ఆమెతో సంసారం చేస్తాడు. వారిద్దరి దాంపత్యబంధం కారణంగా వారికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. తను వచ్చిన పని దిగ్విజయంగా పూర్తయిందన్న భావనతో, తను కన్న ఆడపిల్లను విశ్వామిత్రుడికి అప్పగించి, మేనక తిరిగి ఇంద్రలోకానికి పయనమవుతుంది. దానితో విశ్వామిత్రుడికి నిజం తెలుస్తుంది. తను ఆశించిన బ్రహ్మర్షి స్థానం పొందాలంటే, తనవల్ల మేనకకు కలిగిన ఈ ఆడపిల్ల తనకు అవరోధం కారాదని భావిస్తూ, ఆమెను అక్కడి శకుంతల పక్షులకు అప్పగించి, తాను తిరిగి, తపస్సుకు వెళ్లిపోతాడు విశ్వామిత్రుడు.[2]

మూలాలు

మార్చు
  1. Devdutt Pattanaik (2000). The Goddess in India: The Five Faces of the Eternal Feminine. Inner Traditions / Bear & Co. p. 67.
  2. "Vishwamithra". Hindu Brahmins (in ఇంగ్లీష్). Archived from the original on 2020-05-31. Retrieved 2020-05-21.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మేనక&oldid=3888167" నుండి వెలికితీశారు