సజ్జిదా షా
సజ్జిదా బీబీ షా (జననం 1988, జూన్ 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా ఆడింది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ లో, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో రాణించింది. 2000 - 2010 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 60 వన్డే ఇంటర్నేషనల్స్, ఎనిమిది ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. హైదరాబాద్, బలూచిస్తాన్, సింధ్, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సజ్జిదా బీబీ షా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాద్, పాకిస్తాన్ | 1988 ఫిబ్రవరి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 15) | 2000 జూలై 30 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 మార్చి 18 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 24) | 2000 జూలై 23 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మే 26 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 12 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 9) | 2009 మే 25 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 మే 8 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2007/08 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10–2010/11 | Zarai Taraqiati Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | Balochistan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–2016/17 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 11 |
క్రికెట్ రంగం
మార్చుసజ్జిదా షా 2000, జూలై 23న కేవలం పన్నెండేళ్ళ వయసులో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసింది.[3] ఆ పర్యటనలో నాలుగు వన్డేలు ఆడింది,[4] తన మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడింది,[5] ఇప్పటి వరకు ఐర్లాండ్‌లో ఆడిన ఏకైక మహిళల టెస్టు అది.[6]
2001లో, కరాచీలో నెదర్లాండ్స్‌తో ఏడు వన్డేలు ఆడింది. 2002లో శ్రీలంకలో శ్రీలంకతో ఆరు వన్డేలు ఆడింది.[4]
నెదర్లాండ్స్‌లో జరిగిన 2003 అంతర్జాతీయ మహిళా క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీలో, పాకిస్తాన్ మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఆడింది.[4] జపాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో, కేవలం నాలుగు పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి జపాన్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసింది.[7] ఇది టోర్నమెంట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా,[8] మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్ ప్రదర్శనగా మిగిలిపోయింది.[9] మొత్తం పన్నెండు వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచింది.[10] మహిళల వన్డే చరిత్రలో (15 సంవత్సరాల 168 రోజుల వయస్సులో) ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.[11]
మరుసటి సంవత్సరం, వెస్టిండీస్ పాకిస్తాన్‌లో పర్యటించింది. షా ఏడు వన్డేలు,[4] ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ టెస్టు ఆమెకు (పాకిస్థాన్‌కి)[12] ఇప్పటివరకు జరిగిన చివరి టెస్టు మ్యాచ్.[5] అప్పటినుండి, ఆమె దక్షిణాఫ్రికాతో రెండు ఆసియా కప్ టోర్నమెంట్లు, ఐదు వన్డేలు ఆడింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Sajjida Shah". ESPNcricinfo. Retrieved 11 December 2021.
- ↑ "Player Profile: Sajjida Shah". CricketArchive. Retrieved 11 December 2021.
- ↑ Cricinfo profile
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 List of Women's ODIs played by Sajjida Shah Archived 2012-10-01 at the Wayback Machine at CricketArchive
- ↑ 5.0 5.1 Women's Test matches played by Sajjida Shah at Cricket Archive
- ↑ List of Women's Test matches played by Ireland Archived 2007-09-30 at the Wayback Machine at Cricket Archive
- ↑ Scorecard Archived 2012-08-02 at Archive.today of Pakistan Women v Japan Women match, 21 July 2003 at CricketEurope
- ↑ Best innings bowling for the 2003 IWCC Trophy Archived 2012-07-24 at Archive.today at CricketEurope]
- ↑ Best innings bowling in Women's ODIs Archived 2011-06-11 at the Wayback Machine at Cricket Archive]
- ↑ Bowling averages for players who took at least ten wickets in the 2003 IWCC Trophy Archived 2009-01-07 at the Wayback Machine at CricketEurope
- ↑ "Records | Women's One-Day Internationals | Bowling records | Youngest player to take five-wickets-in-an-innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
- ↑ List of women's Test matches played by Pakistan Archived 2011-06-11 at the Wayback Machine at Cricket Archive