సతీ తులసి (1936 సినిమా)

1936 చిత్రం

సతీ తులసి 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల బలరామయ్య, వేమూరి గగ్గయ్య, శ్రీరంజని సీనియర్ నటించారు.శ్రీరామ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు భీమవరపు నరసింహారావు సంగీతాన్నందించాడు.[1]

సతీ తులసి
(1936 తెలుగు సినిమా)

సతీతులసి సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
తారాగణం ఘంటసాల బలరామయ్య,
వేమూరి గగ్గయ్య,
శ్రీరంజని సీనియర్
సంగీతం భీమవరపు నరసింహారావు
నిర్మాణ సంస్థ శ్రీరామ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

హిందూ పౌరాణిక కథ. విష్ణు భక్తిగల తులసి, జలంధర జీవితం, ఆమె విష్ణువు ప్రేమను ఎలా గెలుచుకుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నటుడు వేమూరి గగ్గయ్య జలంధర పాత్రను పోషించగా, తులసి టైటిల్ రోల్ శ్రీరంజని పోషించింది.

తారాగణం

మార్చు
  • ఘంటసాల బలరామయ్య,
  • వేమూరి గగ్గయ్య (జలంధర)
  • శ్రీరంజని సీనియర్
  • బి.ఎస్.రాజయ్య (ప్రబోధనాథ),
  • రామతిలకం (బ్రూండా),
  • మాధవపేద్దివెంకట రామయ్య (శివ),
  • సీనియర్ శ్రీరంజని (పార్వతి),
  • దోమెటి సత్యనారాయణ (విష్ణు)
  • పాపిరెడ్డి (ముని బాలకుడు),
  • పసుపులేటి వెంకట సుబ్బయ్య (రాహు),
  • లక్ష్మీ దేవి (లక్ష్మి),
  • రాజ్య లక్ష్మి (మోహిని),
  • రమణ (భూదేవి)

సాంకేతికవర్గం

మార్చు
  • సంభాషణలు, సాహిత్యం: దువ్వూరి రామి రెడ్డి
  • సంగీతం: భీమవరపు నరసింహారావు
  • కళ: టీవీఎస్ శర్మ (తంగిరల వెంకట సుబ్బయ్య శర్మ)


పాటల జాబితా

మార్చు

1.అఖిలాదారుని ఆడించేనె యశోద త్రీజగన్మోహన్, గానం.బి.ఎస్.రాజయ్యం గారు

2.ఇక ఏమి గతియో పతికిది తగునా పార్వతీనోర, గానం.రామతిలకం

3.ఏల సదయామేలా ప్రేమ నిరసనచేయు, గానం.రామతిలకం

4.కుసుమశరా క్రౌర్యమేల కన్యా జనతాపకా పరివేదకా, గానం.రామతిలకం

5.కోమలి నాపై కోపము మానుము ఏలామోము , గానం.వేమూరి గగ్గయ్య

6.గోవర్ధనదారీ మురదను జారీ మోహనశౌరి, గానం.ఘంటసాల రాధాకృష్ణయ్య

7.చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి, గానం.ఘంటసాల రాధాకృష్ణయ్య

8.చూచేనా యొకమారు సోగవాల్గానుల కలువపూలు, గానం.ఘంటసాల రాదాకృష్ణయ్య

9.జనన మరణ గుణ కాలాతీత జగధాదారా శాంతాకార, గానం.ఘంటసాల రాదాకృష్ణయ్య

10.జయతు జై యనుచు చనుడు చనుండు రయమున, గానం.వేమూరి గగ్గయ్య

11.నవ నవ కోమల నారద గాన మధురామృతరస, గానం.ఘంటసాల రాదాకృష్ణయ్య

12.పీచు గడ్డముల బెంచి కొమ్మకు గట్టి ఉయ్యాల లూపంగా, గానం.ఘంటసాల శేషాచలం,దొడ్ల సుబ్బిరామిరెడ్డి

13.ప్రణయ జలధి నోలలాడుచు హృదయాబ్జమా ముదమార, గానం.రామతిలకం

14.ప్రమధ గణము లొక్కటైన బలమున చలము విడక, గానం.వేమూరి గగ్గయ్య

15.వారేవా వారేవా చక్కని చుక్కవే చాన నన్నక్కున,

16.సంధ్యారాగం చాయా సోకెన్ నానా శోభాకరముగా, గానం.శ్రీరంజని

17.సరసి జనాభా సదమల తేజా మము నెటు బ్రోచెదవో, గానం.బృందం .

18.సుమాళి విరబూచే రమ్యంబుగా మధుసుధా దారుణి, గానం.శ్రీరంజని

19.స్వప్నంబో భ్రమయవునో యదార్ధమౌనో కాంతాలలామన్, గానం.వేమూరి గగ్గయ్య.

పద్యాలు

మార్చు

1.మురహర గిరిధర కరుణాపార జగదొద్దార (ప్రార్థనా గీతం), గానం.బృందం

2.అగ్ని కుండాన నిందన మట్టులెపుడు భవ్యయోగాగ్ని, గానం.రామతిలకం

3.ఇల చదరంగమందు జనులేల్లరు పావులహస్సులన్, గానం.శ్రీరంజని

4.ఎపుడు మన్మణి కోటీర మిలను బడియే, గానం.వేమూరి గగ్గయ్య

5.ఐoద వోపల రమ్యహర్మ్య భూములు లేవు వసియీంపగా, గానం.వేమూరి గగ్గయ్య

6.ఒక్కనాడైన చనువిచ్చి యుల్లమందు వలపు చిగురింప, గానం.రామతిలకం

7.ఓరీ మదాంధ నాకు విభవోద్దతి పేర్చమదీయ, గానం.మాధవపెద్ది వెంకట్రామయ్య

8.ఔరా వాసన సిగ్గులేదే ఇటు నీ యాస్యంబు జూపించ, గానం.రామతిలకం

9.కరుడుగా గట్టి లోకాంతకాల వజ్ర పాప భీకరమై, గానం.వేమూరి గగ్గయ్య

10.చంద్రకళ లేదు గాంగ నిర్ఘరము లేదు అలికమున , గానం.శ్రీరంజని

11.దురితుడు దుర్మధాంధుడు విధుతా నిలింప నికాయుడా,

12.దేవదానవుల వార్ధిని ద్రచ్చినప్పుడు అమృతంబు, గానం.వేమూరి గగ్గయ్య

13.నిరతము భర్తృ పూజనమే నిర్మల వృత్తముగా గనేంచి, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

14.నీదుకెమ్మూవి గన్నుల నీరజాస్తు డoభకమ్ముల

15.నీలకంఠుడు నీకడ నిలిచియుండ నామమాత్రాన, గానం.మాధవపెద్ది వెంకట్రామయ్య

16.పాతాళoబు జయీంపవచ్చియు వన ప్రాంతంబునన్, గానం.వేమూరి గగ్గయ్య

17.ప్రాపయి దైత్యవీర పరివారము నిన్ గొలువ, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

18.మీకు అర్ధాంగి లక్ష్మీనై మీ హృదబ్జ మధురసాసక్త, గానం.రామతిలకం.

19.ముల్లోకములు తల్లడిల దివిషద్భూపాల కానీ కినుల్, గానం.ఘంటసాల రాధాకృష్ణయ్య

20.లలిత చెంచలవౌట జలంధరుడు సఖియా, గానం.లక్ష్మీకాంతం.

మూలాలు

మార్చు
  1. "Sathi Tulasi (1936)". Indiancine.ma. Retrieved 2020-08-25.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బయటి లంకెలు

మార్చు