సత్తిపిండి
సత్తిపిండి అనేది బతుకమ్మ పండగలలో తప్పనిసరిగా ఉండే ఒక పిండివంట[1]. తయారైన పిండి సత్తెలతో{కారేజీలు} తీసుకెళ్ళి గోదావరిలో బతుకమ్మలను కలిపిన తరువాత అక్కడున్న ఆడువారికి వాయినంగా తమతో తీసుకొచ్చిన సత్తి పిండిని ఇస్తుంటారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు పెసలతో చేస్తే మరికొందరు వరిపిండి, మరికొందరు మొక్కజొన్న పిండితో చేస్తుంటారు. జొన్నలను మెత్తగా ఆడించి ఆపిండికి పంచదార, నెయ్యి చేర్చి కొంచెం పొడిపొడిగా ఉండేలా మారుస్తారు. వరి, పెసలతో కూడా ఇదేమాదిరి చేస్తారు. కొందరు రెండు రకాల ధాన్యాలను కలిపి కూడా చేస్తుంటారు.
సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. [2]
మూలాలుసవరించు
- ↑ "ఏడొద్దుల బతుకమ్మ - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ "బతుకమ్మ · sriguru.org.in". sriguru.org.in (in ఇంగ్లీష్). 2020-02-14. Retrieved 2020-09-25.
బాహ్య లంకెలుసవరించు
- Bathukamma Sattu Pindi Recipes 2018 | How to make Bathukamma (బతుకమ్మ) Sathi Pindi Telangana Special