సత్తు (మిశ్రలోహము)

సత్తు (ఇంగ్లీషులో en:pewter అనేది తగరము తో కూడిన ఒక మిశ్రలోహము (alloy). ఇందులో సాధారణంగా తగరము (tin) పాలు 85-99% వరకు ఉంటుంది. మిగిలినది రాగి, నీలాంజనం (antimony), బిస్మత్ తోపాటు అప్పుడప్పుడు కాసింత వెండి వంటి లోహాలు కొద్ది పాళ్ళల్లో ఉంటాయి. రాగి, నీలాంజనం కలపడం వల్ల సత్తుకి గట్టిదనం వస్తుంది. నాసి రకం సత్తులో అప్పుడప్పుడు సీసం కూడా కలవడం వల్ల సత్తుకి కాసింత లేత నీలి రంగు వస్తుంది. సత్తులో కలిసిన ఇతర లోహముల ప్రభావం వల్ల సత్తు ద్రవీభవన స్థానం తక్కువ: 170–230 °C (338–446 °F).[1][2].

చరిత్ర

మార్చు
 
సత్తు ముక్కలు

సత్తు వాడుక పురాతన కాలం నుండీ ఉంది. సా. శ. పూ 1450లో ఈజిప్టులో సత్తు వాడకం ఉన్నట్లు గోరీల తవ్వకాలలో నిదర్శనం కనిపించింది.[3] సమీప ప్రాగ్దేశాలు (Near East) లో సత్తు వాడుక విరివిగా ఉండేది.

రకాలు

మార్చు

సత్తులోని ఘటకద్రవ్యాలని, వాటి పాళ్ళని, యూరప్ లోని వ్యాపార సంఘాలు 12వ శతాబ్దం నుండి నియంత్రించడం మొదలు పెట్టేయి. ఈ నియంత్రనణ వల్ల మూడు రకాల సత్తులు వాడుకలోకి వచ్చేయి:

  1. Fine Metal: ఈ రకం సత్తుని భోజన సామగ్రి (tableware) (కత్తులు, చెంచాలు, ఫోర్కులు, కంచాలు, వగైరా) తయారు చెయ్యడానికి వాడేవారు. ఇందులో 99 శాతం తగరం, 1 శాతం రాగి ఉండేవి.
  2. Trilling Metal: ఈ రకం సత్తుని వడ్డన సామగ్రి (holloware) (పళ్ళేలు, గిన్నెలు, గరిటెలు వగైరా) తయారు చెయ్యడానికి వాడేవారు. ఇందులో 4 శాతం వరకు సీసం ఉండేది.
  3. Ley Metal: ఈ రకం సత్తుని భోజనేతర సామగ్రుల తయారీలో వాడేవారు. వీటిల్లో 15 శాతం వరకు సీసం ఉండేది.

సీసం యొక్క విష లక్షణాలు అవగతం అవడంతో ఇటీవల కాలంలో సత్తులో సీసం కలపడం పూర్తిగా మానేసారు.

భారతదేశంలో సత్తు వాడుక

మార్చు
  • సా. శ. 1950 వరకు సత్తు గిన్నెలు వంటలకి (ముఖ్యంగా చారు కాచడానికి) వాడేవారు. కొత్త కోడలు అత్తింటికి వచ్చినప్పుడు అనుభవం లేకపోవడంవల్ల ఖాళీ సత్తు గిన్నెని పొయ్యి మీద పెట్టడం, అది కరిగిపోవడం, అత్తమ్మ గుండె దిగజారిపోవడం అనే సంఘటనలు తరచు జరిగేవి.
  • సత్తుని దొంగనాణెములు ముద్రించడానికి వాడేవారు. వర్తకులు వీటిని తేలికగా పసికట్టి విసిరికొట్టేవారు.

మూలాలు

మార్చు
  1. "Pewter". Belmont Metals. 2 July 2021.
  2. Campbell (2006), p. 207.
  3. Hull (1992), p. 4.