సీసము మూలకాల ఆవర్తన పట్టికలో 14 వ సముహమునకు చెందిన మూలకం[4].14 వ సమూహాన్నికార్బను సముదాయం అనికూడా అంటారు. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 82 .సీసము యొక్క సంకేత ఆక్షర Pb. సీసమును లాటిన్ లో ప్లంబం (plumbum) అంటారు. పదములోని మొదటి, 5వ ఆక్షరాన్నికలిపిPb అని ఈ మూలకం యొక్క సంకేత ఆక్షరంగా నిర్ణయించారు. ఆవర్తన పట్టికలో దీని స్థానం థాలియంకు బిస్మత్కు మధ్యన ఉంటుంది. సీసమును చాలా యేళ్ళుగా మనిషి ఉపయోగిస్తూ వచ్చాడు.

సీసము, 00Pb
A small gray metal cube surrounded by three gray metal nuggets in front of a light gray background
సీసము
Pronunciation/ˈlɛd/ (led)
Appearancemetallic gray
Standard atomic weight Ar°(Pb)
సీసము in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Sn

Pb

Fl
థలియంసీసముబిస్మత్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 6
Block  p-block
Electron configuration[Xe] 4f14 5d10 6s2 6p2
Electrons per shell2, 8, 18, 32, 18, 4
Physical properties
Phase at STPsolid
Melting point600.61 K ​(327.46 °C, ​621.43 °F)
Boiling point2022 K ​(1749 °C, ​3180 °F)
Density (near r.t.)11.34 g/cm3
when liquid (at m.p.)10.66 g/cm3
Heat of fusion4.77 kJ/mol
Heat of vaporization179.5 kJ/mol
Molar heat capacity26.650 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 978 1088 1229 1412 1660 2027
Atomic properties
Oxidation states−4, −2, −1, 0,[3] +1, +2, +3, +4 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.87
Atomic radiusempirical: 175 pm
Covalent radius146±5 pm
Van der Waals radius202 pm
Color lines in a spectral range
Spectral lines of సీసము
Other properties
Natural occurrenceprimordial
Crystal structureface-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for సీసము
Speed of sound thin rod(annealed)
1190 m/s (at r.t.)
Thermal expansion28.9 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity35.3 W/(m⋅K)
Electrical resistivity208 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic
Young's modulus16 GPa
Shear modulus5.6 GPa
Bulk modulus46 GPa
Poisson ratio0.44
Mohs hardness1.5
Brinell hardness5.0 HB = 38.3 MPa
CAS Number7439-92-1
History
DiscoveryMiddle Easterns (7000 BC)
Symbol"Pb": from Latin plumbum
Isotopes of సీసము
Template:infobox సీసము isotopes does not exist
 Category: సీసము
| references

ఇతిహాసం

మార్చు

సీసము మానవునిచే కొన్ని వేలఏండ్లుగా వాడబడుచున్నది. అంతేకాదు ముడి ఖనిజం నుండి కరగించి వేరు చెయ్యడం కూడా సులభం. ప్రస్తుతం టర్కీ అని పిలవబడే ఒకప్పటి కాటల్ హోయుక్ (catalhoyuk)లో క్రీ.పూ.6400నాటి సీసపు పూసలను కనుగొన్నారు[5].గ్రీకులు స్రీ.శ.650 నాటికే భారీప్రమాణంలో సీసము మూడుఖనిజాన్ని త్రవ్వితియ్యడమే కాకుండ, దానినుండి తెల్లసీసాన్ని ఉత్పత్తి చేసేవారు.200వేల సంవత్సరాలకు పైగా దీనిని రంగులపరిశ్రమలో విరివిగా వాడెవారు.[4] తొలి కంచుకాలంలో సీసమును ఆంటిమొని, ఆర్సెనిక్ కలిపి ఉపయోగించేవారు.17 వ శతాబ్ది వరకు తగరానికి సీసానికి వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేక పొయ్యేవారు. రెండింటిని ఒకటిగానే భావించేవారు. సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం), తగరాన్ని ప్లంబం కాండిడం (plumbum candidum:బ్రైట్ సీసము)అని పిలిచేవారు.

పూర్వపుకాలం వాళ్ళు సీసమును విగ్రహాలు,నాణెములు,పాత్రలు, వ్రాతబల్లలు తయారు చేసెవారు.[6] రోమనులు సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం)అని,తగరాన్నిప్లంబం అల్బం (‘plumbum album)అనివ్యహరీంఛేవారు.

ఉనికి -లభ్యత

మార్చు

సూర్య వాతావరణం లో సీసం ఉన్నది.అలాగే వేడి మరుగుజ్జు నక్షత్రాలలోను(hot subdwarfs)[7] పుష్కలంగా లభించును. విడిగా లోహరూపంలో ప్రకృతిలో అరుదుగా లభించును. సీసం సాధారణంగా జింకు, వెండి , రాగి ముడిఖనిజాలలో ఉన్నందున,[8] లోహఉత్పత్తి సమయంలో వాటితో పాటు సీసం కూడా వేరు చేయ్యబడుతుంది. సీసాన్ని ఎక్కువ ప్రమాణంలో కలిగిఉన్న ఖనిజం గలేనా (galena;PbS), ఇందులో 86.6% సీసం ఉన్నది. సీసం యొక్క మిగతా ముడి ఖనిజాలు సేరుస్ సైట్(cerussite:PbCO3), ఏంగిల్ సైట్ (PbSO4)[9], (Pb3O4). భూమి మట్టిలోపల 1.4×101మి.గ్రాం/కిలో;సముద్రంలో 3×10-5మి.గ్రాం/లీటరుకు.[10]

సీసము భౌతిక ధర్మాలు

మార్చు

సీసము ఒక లోహ మూలకం. ఇది మృదువుగా ఉండి, సాగకొట్టిన సులభంగా కావలసిన రూపంలోకి సాగును. అంతే కాకుండా బలమైన పరివర్తకోత్తర లోహ మూలకము (post-transition metal). తాజా సీసము నీలిచాయతో తెల్లగా ఉండును. కాని గాలితో సంపర్కము వలన లేత బూడిదరంగుకు మార్పు చెందును. సీసమును కరిగించినప్పుడు క్రోమియం-వెండి ల వన్నెకలిగి మెరుస్తుంది.ఇది అతి భారమైన రేడియో ధార్మికగుణ రహితమైన మూలకము. ఇది స్థిరమైన మూలకాలలో ఎక్కువ పరమాణు సంఖ్య కలిగి ఉన్న మూలకం. సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో సీసముయొక్క సాంద్రత 11.34 గ్రాము/సెం.మీ 3. ద్రవ స్థితిలో(ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు /సెం.మీ3. పరమాణు ద్రవ్యరాశి 207.21 , అణువు స్పటికం కేంద్రికృతఘనాకృతి. సీసము యొక్క ద్రవీభవన స్థానం327.46°C . సీసము యొక్క మరుగు స్థానం1749°C . ఎక్కువ సాంద్రత కలిగిన లోహ మూలకం సీసము.

మూలకం తక్కువ విద్యుత్తు వాహకతత్వమును ప్రదర్శించును. కాని ఎక్కువ క్షయికరణను తట్టుకునే గుణం, ఆర్గానిక్ రసాయనాలలో చర్యజరిపే గుణాన్ని కలిగిఉన్నది. ఇతర లోహాలను సీసములో అంశి భూతం గా కలపడం వలన సీసము యొక్క ధర్మాలలో గుణాత్మకమైన మార్పులు ఏర్పడును. ఈ మూలకంలో రాగి లేదా ఆంటిమొనిలను కలుపుట వలన సీసలోహం యొక్క దృఢత్వము పెరగడమే కాకుండ దానికి సల్పూరిక్ ఆమ్లం వలన కలిగే లోహ క్షయికరణను నిరోధించే గుణం పెరుగుతుంది.

సీసము యొక్క భౌతిక లక్షణాలపట్టిక [6]

భౌతిక లక్షణం పరిమితి
వర్ణం నీలిఛాయ బూడిదరంగు
భౌతిక స్థితి ఘనరూపం
పరమాణు భారం 207.2
ద్రవీభవన స్థానము 327.46oC, 600.61 K
మరుగు స్థానము 1750oC, 2023 K
ఎలక్ట్రానులసంఖ్య 82
ప్రోటానులు 82
సాంద్రత,20°Cవద్ద 11.34 g/cm3

ద్రవస్థితిలో (ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు/సెం.మీ3. పరమాణుద్రవ్యరాశి 207.21, అణువు స్పటికం కేంద్రికృత ఘనాకృతిలో నిర్మాణమై ఉండును. సీసము యొక్క ద్రవీభవస్థానము327.46 °C . సీసముయొక్క మరుగుస్థానం 1749 °C.

రసాయనిక చర్యలు

మార్చు

సీసము ఇతర రసాయనిక పదార్థాలతో జరుపు రసాయనిక చర్యలు ఈ విధంగా ఉన్నయి[11]

  • నీటితో చర్య:నీటితోకాని,నీటి ఆవిరితోకాని ఎటువంటి చర్య లేదు.
  • ఆక్సిజన్ తో చర్య:గట్టిగా వేడిచేసిన కరిగి వెండి గోళపుముద్దవలె అగును.క్రమంగా పుడి ఏర్పడును.ఉపతియలం అక్సిజను కారణంగా పుడి ఉపరితలం మీద ఏర్పడును. పుడి వేడిగా ఉన్నప్పుడు ఆరెంజిరంగులో,చల్లారినప్పుడు పసుపురంగుకు మారును.

lead + oxygen —> lead (II) oxide

2Pb (s) + O2 (g) —> 2PbO (s)

సజల ఆమ్లాలతో చర్య
  • హైడ్రోక్లోరిక్‌ఆమ్లం: సీసము సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనును.ఫలితంగా లెడ్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు ఏర్పడును.

lead + hydrochloric acid —> lead chloride + hydrogen Pb (s) + 2HCl (aq) —> PbCl2 (aq) + H2 (g)

  • సల్ఫ్యూరిక్‌ ఆమ్లం:సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సీసము నెమ్మదిగా చర్య జరుపును.ఫలితంగా లెడ్ సల్ఫేట్, హఈడ్రోజన్ వాయువు వెలువడును.

lead + sulphuric acid —> lead sulphate + hydrogen

Pb (s) + H2SO4 (aq) —> PbSO4 (aq) + H2 (g)

  • నత్రికామ్లంతో:సజల నత్రికామ్లంతో కూడా చర్య మందకోడిగా జరుగును.ఫలితంగా లెడ్ నైట్రేట్, హైడ్రోజన్ వాయువు వెలువడును.

lead + nitric acid —> lead nitrate + hydrogen

Fe (s) + 2HNO3 (aq) —> Fe (NO3)2 (aq) + H2 (g)

ఐసోటోపులు(Isotopes)

మార్చు

సీసము 4 ఐసోటోపులను కలిగి, ప్రతి ఐసోటోపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.208 Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల (ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,, 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.126Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.208Pb ఐసోటోపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటోపు.

స్వాభావికంగా లభించే సీసము ఐసోటోపులు [12]

ఐసోటోపు ద్రవ్య సంఖ్య అర్ధజీవితకాల వ్యవధి లభ్యత
204Pb 204 >= 1.4×10+17 ఏండ్లు 1.4%
206Pb 206 స్థిరం 24.0%
207Pb 207 స్థిరం 22.1%
208Pb 208 స్థిరం 52.4%

ఉపయోగాలు

మార్చు

సీసమును గృహనిర్మాణావసరాలలో వాడెదరు. సీసాన్ని, సీసం-ఆమ్ల విద్యుత్ ఘటకాలలో,[13] తూటాలలో,తూకపు గుళ్ళలో వినియోగించెదరు.తక్కువ ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమధాతువులను తయారు చేయుటకు,, రెడియెసను/ధార్మికశక్తి నుండి రక్షణకల్పించు పరికరాలలో సీసమును వాడెదరు.

సీసం వలన అనర్థాలు

మార్చు

సీసాన్ని అధిక ప్రమాణంతో లోపలి తీసుకున్న మనుష్యులకు, జంతువులకు ప్రమాదం. నాడీ వ్యవస్థను నాశనం కావించి, మెదడు పని తీరుపై ప్రభావం చూపించును. అధిక సీసము ఉన్నచో క్షీరదాలలో రక్తాన్ని అస్తవ్యస్థ పరచును. సీసము నాడి వ్యవస్థపై దుష్ప్రభావము కల్గించును. పురాతన రోమ్, గ్రీసు, చైనా లలో సీసమును విషంగా ఉపయోగించిన రుజువులు ఉన్నాయి .

దీర్ఘకాలంగా జింకు ప్రభావంనకు లోనైన, గురైన వారి ఆరోగ్యంపై జింకు తీవ్రమైన దుష్ప్రభావం కల్గిస్తుంది.దీనివల రక్తవత్తిడి పెరగడం,సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవటం, కంటిలో శుక్లాలు ఏర్పడటం, కండరాల, కీళ్ళనొప్పులు రావడం, నాడీవ్యవస్థలో బలహీనతలు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి ఏర్పడును[8]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Standard Atomic Weights: Lead". CIAAW. 2020.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Pb(0) carbonyls have been observered in reaction between lead atoms and carbon monoxide; see Ling, Jiang; Qiang, Xu (2005). "Observation of the lead carbonyls PbnCO (n=1–4): Reactions of lead atoms and small clusters with carbon monoxide in solid argon". The Journal of Chemical Physics. 122 (3): 034505. 122 (3): 34505. Bibcode:2005JChPh.122c4505J. doi:10.1063/1.1834915. ISSN 0021-9606. PMID 15740207.
  4. 4.0 4.1 "Lead". www.rsc.org. Retrieved 2015-03-29.
  5. Heskel, Dennis L. (1983). "A Model for the Adoption of Metallurgy in the Ancient Middle East". Current Anthropology. 24 (3): 362–366. doi:10.1086/203007.
  6. 6.0 6.1 "Lead Element Facts". chemicool.com. Retrieved 2015-03-29.
  7. Anil Ananthaswamy (Aug 2, 2013). "Giant clouds of lead glimpsed on distant dwarf stars". New Scientist.
  8. 8.0 8.1 "Lead". niehs.nih.gov. Retrieved 2015-03-29.
  9. Holleman, Arnold F.; Wiberg, Egon; Wiberg, Nils (1985). "Blei". Lehrbuch der Anorganischen Chemie (in German) (91–100 ed.). Walter de Gruyter. pp. 801–810. ISBN 3-11-007511-3.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  10. "The Element Lead". education.jlab.org. Retrieved 2015-03-29.
  11. "Lead, Pb". sciencepark.etacude.com. Retrieved 2015-03-29.
  12. "Isotopes of the Element Lead". education.jlab.org. Retrieved 2015-03-29.
  13. "lead". infoplease.com. Retrieved 2015-03-29.