సత్తెనపల్లి ఫీరోజీ మహర్షి

ఫీరోజీ మహర్షి (1829-1889) గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వ‌రిలో 'ఫీరోజీ ఆరాధ‌నోత్స‌వాలు' పేరుతో ఒక పెద్ద ఉత్స‌వం జ‌రుగుతుంది. మ‌హారాష్ట్రులు పూజించే ఒక సాధ‌కుడు ఫీరోజీ పేరున ఊర్లో ఒక పెద్ద ఆల‌యం ఉంది.అచ‌ల త‌త్వాన్ని బోధించిన ఉత్త‌ర భార‌త త‌త్వ‌వేత్త‌ల్లో ఆయ‌నొక‌రుగా భావిస్తారు. స‌త్తెన‌ప‌ల్లిలో మ‌హారాష్ట్రుల జ‌నాభా గ‌ణ‌నీయంగా ఉంది. మ‌హారాష్ట్ర వీధి (అర‌కాలీ బ‌జార్‌) పేరుతో వారికో వీధి కూడా ఉంది. పేరుకు ఉత్స‌వం మ‌హారాష్ట్రుల‌దే అయినా ఊరంతా ఇందులో పాలుపంచుకుంటుంది. నిజానికి వూర్లో ఇదొక్క‌టే పెద్ద తిరునాళ్ల‌.

ఫీరోజీ కుటుంబ నేపథ్యం

మార్చు

ఫీరోజీ పూర్వికులు మహారాష్ట్రకు చెందిన క్షత్రియులు. ఫీరోజీ తాత పాపాజీగారూ ఛత్రపతి శివాజీ మనవడైన షాహూజీకి సమకాలికులు. షాహూజీ పంపడం వలననే వీరి తాతగారు హైదరాబాదుకు వచ్చారట. వారి రాజ్యం ముగిసిన తర్వాత సత్తెనపల్లి ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారట. ఫీరోజి గారి తండ్రి నర్సోజీ సత్తెనపల్లి జమిందారు రాజా మానూరు వెంకట గోపాల రాయని గారి దగ్గర సుబేదారుగా పనిచేసారట.

వీరి ధర్మపత్నివీరాబాయమ్మ ఫీరోజీ గారికి లక్ష్మోజిరావు, గోవిందరావు అని ఇద్దరు కుమారులు, లక్ష్మీభాయి, వీరాబాయి, పెదగోవిందబాయి, చినగోవిందబాయి అను నలుగురు కుమార్తెలు.

రచనలు

మార్చు

ఫీరోజీ సంస్కృతంలోనూ, తెలుగులోనూ రచనలు చేసారు

  1. శ్రీరామ శతకము
  2. శేషాచార్య శతకము
  3. పన్నగాచల నాయక శతకము
  4. నమ: శివాయ శతకము
  5. స్వప్రకాశము
  6. తత్త్వ సంగ్రహము
  7. సత్రాజితీయము (యక్షగానము)
  8. రామాయణము (షట్ కాండము)
  9. గుమ్మెట కథ
  10. దారుకావన విహారము (రగడ)
  11. దశావతారములు (దండకము)
  12. శ్రీరామ దండకము
  13. గంజేంద్ర మోక్షము (కీర్తన)
  14. ప్రహ్లాద చరిత్ర (కీర్తన)
  15. భద్రాద్రి మజిలీలు (కందార్ధములు)
  16. మార్కండేయ విలాసము
  17. శ్రీరామ చంద్రార్య శతకము
  18. ఏకవింశత్యవతార స్తోత్రము
  19. శివలీలా మహత్తు

ఇవే కాక అనేక పద్యములు కీర్తనలనూ చెప్పారు. వాటిలో కొన్నింటిని వారి ముఖ్య శిష్యులు వనమా సుబ్బారాయుడు గారు సంగ్రహించి నాలుగు బాగములుగా విభజించి ‘‘పరమానంద సుధాలహరి’’ అనే పేరుతో గ్రంథస్ధం చేసారు.

అంత్యదశ

మార్చు

ఫీరోజి సరిగా అరవై సంవత్సరాలు జీవించారు. ఫీరోజీ గారి ధర్మపత్ని వీరాబాయమ్మ గారు భర్తగారి అనంతరం ముప్పది సంవత్సరముల పై కాలము జీవించి వృద్ధాప్యం వలన సిద్ధార్ధ సంవత్సర మార్గశిర శుద్ధ తదియ మంగళవారము (1919 నవంబరు 25వతేదీ) న పరమపదించారు.

బయటిలింకులు

మార్చు