సత్యనారాయణ గోయెంకా

అంతర్జాతీయ విపశ్యన ధ్యాన గురువు

ఎస్. ఎన్. గోయెంకా (S. N. Goenka) గా సుపరిచితులైన సత్యనారాయణ గోయెంకా (1924-2013) సుప్రసిద్ధ అంతర్జాతీయ విపశ్యనా ధ్యాన గురువు. భారతీయ సంతతికి చెందిన ఎస్. ఎన్. గోయెంకా బర్మా (మైయిన్మార్) లో ఒక ధనిక భారతీయ కుటుంబంలో జన్మించారు. 1969 లో భారతదేశంలో స్థిరపడి విపశ్యనా ధ్యానాన్ని బోధించడం ప్రారంభించారు. అనతికాలంలోనే ప్రభావశీలుడైన విపశ్యనా ధ్యాన గురువై తూర్పు, పాశ్చాత్య దేశాలలోని అన్ని జాతి మత భేదాలకతీతంగా వేలాదిమంది ప్రజలకు విపశ్యనాను బోధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ధ్యాన కేంద్రాలను స్థాపించారు.[1] విమోచనకు బుద్ధుని మార్గం జాతి మత వర్గాలకు అతీతమైనదని, సార్వత్రికమైనదని, శాస్త్రీయమైనదని ఆయన చేసిన బోధనలు ప్రముఖమైంది. ఆగష్టు 2000 లో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన ‘మతపరమైన, ఆధ్యాత్మిక నాయకుల మిలీనియం ప్రపంచ శాంతి సదస్సు’కు (Millennium World Peace Summit of Religious and Spiritual Leaders) గోయెంకా ఉపన్యాసకునిగా ఆహ్వానించబడ్డారు.[2] ఆయన ఆద్వర్యంలో నవంబర్ 2008 లో, ప్రపంచ విపస్సనా పగోడా (Global Vipassana Pagoda) ముంబై శివార్లలో నిర్మించబడింది. 2012 లో ఆయన భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం పొందారు.[3]

తన భార్యతో గోయెంకా

బయటి లింకులు

మార్చు
  • Vipassana pioneer SN Goenka is dead Zee News[1]
  • Master of the Dharma: An Interview with S. N. Goenka (1924-2013) [2]

మూలాలు

మార్చు
  1. "Remembering SN Goenka, the man who brought Vipassana back to India". Firstpost. Archived from the original on 2018-06-17. Retrieved 2013-12-21.
  2. Wednesday, 30 August: Venerable Vipasarachaya Dr. S.N. goenka Archived 2009-01-06 at the Wayback Machine Millennium World Peace Summit.
  3. "Padma Awards Announced". Ministry of Home Affairs, Press Information Bureau, Govt. of India. 25 January 2012. Retrieved 1 October 2013.