నిజం

(సత్యము నుండి దారిమార్పు చెందింది)

నిజం లేదా సత్యం (Truth) అనేది ఒక విషయం. ఇది నిజాయితీ, త్యాగం మొదలైన విషయాల వలె మనం పాటించవలసిన సంగతి.

సత్యం వద అని వేదం చెబుతుంది. అంటే సత్యమునే చెప్పుము అని అర్ధం. సత్యవాక్పరిపాలన కోసం శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యాబిడ్డలను సైతం అమ్ముకున్నాడు. ఆధునిక యుగంలో కూడా సత్యానిని ఉన్న ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ. వీరు నేటికీ మనకు ఆదర్శప్రాయులు.


సత్యం పలకడం వల్ల తాత్కాలిక కష్టాలు ఎదురైనా చివరికి విజయం మాత్రం తధ్యం. అసత్యవాది క్షణిక సుఖాలను, భోగాలను అనుభవించవచ్చును. అది కొన్నాల్లు మాత్రమే. చివరకు వారు కష్టాలపాలు పడక తప్పదు.

మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలో సత్యాన్ని గురించి నన్నయ ఒక మంచి పద్యం చెప్పాడు. దాని సారాంశం:

మంచి నీటితో నిండిన నూతులు వంద కంటే ఒక బావి మంచిది. అలాంటి వంద బావుల కంటే ఒక మంచి క్రతువు మేలు. అలాంటి వంద క్రతువుల కంటే ఒక మంచి కొడుకు చాలు. అలాంటి వందమంది కొడుకుల కంటే ఒక సత్య వాక్యం మేలు అని నిజానికి ఉన్న గొప్పదనాన్ని వివరించాడు. అని శకుంతల దుష్యంతునికి సత్యవాక్పరిపాలన గురించి వివరిస్తుంది.

నిజం మాట్లాడడానికి మించిన దైవత్వం లేదు. నిజం పలకడానికి ధైర్యం కావాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=నిజం&oldid=3231670" నుండి వెలికితీశారు