క్రతువు
'క్రతువు (సంస్కృతం: क्रतु) (సంస్కృతంలో "బలం" ) రెండు వేర్వేరు యుగాలలో కనిపించిన ఋషి. స్వాయంభువ మన్వంతరంలో, క్రతువు ఒక ప్రజాపతి, బ్రహ్మ దేవుడుకు చాలా ప్రియమైన కుమారుడు. క్రతువుకు కూడా పుణ్య, సత్యవతి అను ఇద్దరు (2) సోదరీమణులు ఉన్నారు.
క్రతువు | |
---|---|
సమాచారం | |
కుటుంబం | బ్రహ్మ (తండ్రి) |
సప్త ఋషులు
మార్చుఇతను ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరిగా పరిగణించబడ్డాడు, ఈ సప్త ఋషులు బ్రహ్మ యొక్క మనస్సు నుండి ఉద్భవించినారని హిందువులు నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం, క్రతువు తన తండ్రి బ్రహ్మ ఎడమ కన్ను నుండి జన్మించాడని నమ్ముతారు. ఇతను సన్నతిని పెళ్లి చేసుకున్నాడు, ఈ జంటకు వాలఖిల్యులు అని పిలవబడే అరవై వేల మంది పిల్లలు కలిగి ఉన్నారు, వారు బొటనవేలు యొక్క పరిమాణం, నదుల ఒడ్డున నివసిస్తారు. ఒకసారి దేవతల రాజు అయిన ఇంద్రుడు వీరిని అవమానించాడు. దానితో వాలఖిల్యులు వారి తపస్సు యొక్క శక్తి ద్వారా, వారు శివుడిని ఆనందింప చేయగలిగారు. శివుడు నుండి పొందిన వరం వలన వారు ఇంద్రుడు నుండి అమృతము భాండం బయటకు తీసే పక్షిని తయారు చేయగలరు.[1]
పశుపతి
మార్చువివాహం ముందు, క్రతువు రుద్ర (లార్డ్ శివ) దేవుడుకు ఒక మంచి స్నేహితుడు. రుద్ర నిజానికి తొలుత పశుపతి అని పిలువబడుతూ ఉండేవాడు. అయినప్పటికీ, రుద్ర తండ్రి బ్రహ్మ, తన పాపాత్మకమైన చర్యలకు శిక్షను అనుభవించినప్పుడు, రుద్రుడు తన పశుపతి అధికారాన్ని క్రతుకు ఇచ్చాడు. తరువాత, రుద్ర మొదటగా ఆర్యుడు కాని దేవుడుగా పరిగణించబడ్డాడు కనుక, రుద్రను పరిగణనలోకి తీసుకోకుండా, దైవదూతలు రుద్రాకు ఎలాంటి వాటా ఇవ్వకుండా తమలో ఉన్న అన్ని జంతువులను తామే విభజించారు. దానితో రుద్ర ప్రజాపతి దగ్గరకి వెళ్లి అన్ని దైవాంశాలను చంపుతానని చెప్పాడు. ప్రజాపతి అతనిని వేచి ఉండాల్సిందిగా కోరాడు, త్వరలో తను రుద్రకు పశుపతి నామాన్ని పునరుద్ధరించుతానని వాగ్దానం చేశాడు. దైవాక్షులు అప్పుడు రుద్రను ఆహ్వానించకుండా ఒక యజ్ఞ్నాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞ్నానికి ముఖ్య నిర్వాహకుడు దక్ష ప్రజాపతి. దక్షుడి చిన్న కూతురు సతీదేవి/దాక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా బూడిద పూసుకుని, శ్మశానాల వెంట తిరిగే వాడని దూషించేవాడు. అప్పటి నుంచే తన అల్లుడుకీ, కూతురుకి కూడా దూరమయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ వివాదం మరింత ముదిరింది. దక్షుడు యజ్ఞం రుద్రునికి వ్యతిరేకంగా, అల్లుడు అయిననూ పిలవకుండా తన పగ తీర్చుకోవడం జరిగింది. కూతురు అయిన సతిని కూడా ఆహ్వానింపబడలేదు, అయిననూ యజ్ఞ్నానికి ముఖ్య నిర్వాహకుడు తన తండ్రి అని తలచి అక్కడకు వెళ్ళడం జరిగింది. సతిని యజ్ఞం జరుగుతున్న ప్రాంగణంలోనే, వివాహం కోసం ఒక బిచ్చగాడును చేసుకున్నావని అనేక విధములుగా భయంకరమైన మాటలతో తండ్రి అవమానించాడు. ఆమె తన తండ్రి, ఆమె సోదరీమణులు ఆమె వద్ద విసరిన అవమానాలను వినలేకపోయింది. ఆమె త్యాగపూరిత అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మరణవార్త విని, శివుడు కోపంతో పిచ్చిగా మారాడు. శివుడు తన తల నుండి కొద్దిగా జుట్టును పెరికి ముడిచేసి దాన్ని వీరభద్ర లేదా భైరవ ఆత్మను ప్రేరేపించడం ద్వారా విసిరి వేశాడు. వీరభద్రను తన అనుచరులతో కలిసి వెళ్లి ప్రజాపతి దక్షుడుతో సహా యజ్ఞకు హాజరైన ప్రతి ఒక్కరినీ నాశనం చేయాలని శివుడు ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు. ఆ ప్రకారంగానే దక్ష ప్రజాపతి యజ్ఞ్నానికి వెళ్ళటం జరిగింది. అక్కడ పవిత్ర యజ్ఞ్నానికి హాజరైన ప్రతి ఒక దైవాంశాలను (ప్రతి దేవుడును) వీరభద్రుడు తన అనుచరులు శిక్షించటం ప్రారంభించారు. వారు పూష దంతాలను పడగొట్టారు, భాగ కళ్ళను తీసుకున్నారు, క్రతువు యొక్క రెండు వృషణాలను వేరుచేశారు.
దేవతలు అందరూ శివుడు దగ్గరకుకి వెళ్లారు, అతని దయ కొరకు ప్రార్థించారు. శివుడు వారిని జంతువులవలె ఆయనకు కొంతకాలం వరకు సేవ చేయవలెనని, అప్పుడు మాత్రమే వారు వారి అసలు స్థితిని తిరిగి పొందుతారు అని శలవిచ్చాడు. అందరు దేవతలు దీనికి అంగీకరించారు. శివుడు వివిధ దేవతల పళ్ళు, కళ్ళు, వృషణాలను పునరుద్ధరించాడు. తన మెడ మీద ఒక మేక తలపై ఉంచడం ద్వారా దక్షుడు కూడా పునరుద్ధరించబడ్డాడు.
క్రతువు తన వృషణాలు పునరుద్ధరించబడిన తరువాత, దక్షుడు కుమార్తె అయిన సన్నతి (సంతతి) ను వివాహం చేసుకున్నాడు.
వివాహం
మార్చుక్రతువు ఋషికి దక్షుడు కుమార్తె అయిన సంతతితో వివాహం జరిగింది.
సంతానం
మార్చుఇతనికి 60,000 మంది పిల్లలు ఉన్నారని చెప్పబడింది. వారికి "వాలఖిల్యులు"గా పేరు పెట్టారు. వారు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరు. వీరు పవిత్రమైన మనసుతో, పవిత్రమైనవారుగా ఉందురు. అందరూ బ్రహ్మచారులు, వేదాలను అభ్యసించిన విద్యార్ధులు. (సూచనలు: మైత్రేయ సంహిత 4-2-12, బ్రహ్మాండ పురాణం)
మరుజన్మ
మార్చుశివుడు యొక్క వరం కారణంగా క్రతువు ఋషి మళ్లీ వైవస్వత మన్వంతరంలో జన్మించాడు. ఈ మన్వంతరంలో ఇతనికి కుటుంబం లేదు. క్రతువు బ్రహ్మ దేవుడు యొక్క చేతి నుండి జన్మించినట్లు తెలుస్తుంది, అలాగే ఇతర ఋషులు బ్రహ్మ శరీరం యొక్క ఇతర భాగాల నుండి జన్మించినట్లు వర్ణించబడింది. (రిఫరెన్స్-భగవద్గీత).
సంతానం
మార్చుక్రతువుకు కుటుంబం, పిల్లలు లేనందున, తను అగస్త్యుడు కుమారుడైన ఇద్వావను స్వీకరించాడు.
మూలాలు
మార్చు- ↑ Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. pp. 26–28. ISBN 81-7505-356-9.