సత్యసాయి అవతార వైభవం
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(నవంబర్ 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారిని కోందరు దైవాంశ సంభూతునిగా, కొందరు మహాయోగిగాను, కోందరు శక్తులు కలిగిన అవతార పురుషునిగాను, మంచి మనిషిగాను మహాను భావునిగాను, తలచి పూజిస్తున్నారు, సేవిస్తూ వచ్చారు. ఎవరెన్ని విధాలుగా కొలిచినా భక్తులమైన మాకు ఆయన సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుడే!
భగవంతుడైనా సరే మానవాకారము ధరించిన పిమ్మట తాను సృష్టించిన ప్రకృతి ననుసరించి, సహజ మానవులవలె, ధర్మబద్దమైన జీవనము గడపక తప్పదు, అలాంటిదే శ్రీ సత్యసాయి బాబా వారి అవతారము ! దుర్మార్గులుగా వుండే మానవులను సన్మార్గుగా మార్చుటకు, రాముడు, కృష్ణుడు, మహావిష్ణు, మొదలైన అవతారములవలె ఆయుధాలు ధరింపకుండా ప్రేమ అనే దివ్యాయుధముతో మానవాళిని ఉద్దరింపగ వచ్చిన మహితోన్నత పరి పూర్ణ అవతారమే ఈ సత్యాసాయి బాబా.
స్వామి! తన దివ్యోపన్యాసాలలో కోట్లమందిని మార్చగలిగారు. ఈనాడు సత్యసాయి సంస్దలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అందే దానికి కారణం స్వామి ప్రేమతత్వము, సేవా తత్పరతే! చెపటమేగాక చేసి చూపించటము స్వామి వారి ప్రత్యేక లక్షణముగా విరాజిల్లింది, తద్వారా కోట్లాది భక్తులను జనులను స్వామి ఆకర్షించగలిగారు! [స్వామి చాలా సార్లు తన ప్రసంగాల్లో చెప్పారు: "ప్రపంచనలుమూలలా ఇన్ని కోట్ల మంది ప్రశాంతి నిలయానికి వస్తున్నారు, వారెవరికీ నేను ఎటువంటి ఇన్విటేషాన్ష్ పంపలేదు కేవలం ప్రేమ ద్వారా వారు వస్తున్నారు" అని తెలిపేవారు]
ప్రేమ సేవలతో ముక్తిని, భగవంతుని అనుగ్రహాన్ని పోందవచ్చును అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు: [మనము అందరినీ అన్నివేళలా, అన్నివిధాలుగా సంతృప్తి పరచలేము, ఆనందపరచలేము, కనీసం ఎదుటివ్యాక్తితో మాట్లాడేటప్పుడన్నా ప్రేమగా, మృదువుగా మాట్లాడు అని స్వామి చెప్పేవారు] ఈ ప్రేమ - సేవలు మాచేత ఆచరింపజేసిన సత్యసాయికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు, భక్తులమైన మాకు, మరెందరికో ప్రశాంతినిలయంలో ఎన్నోసార్లు శ్రీ సత్యసాయి సమక్షంలో సేవలు చేసే భాగ్యాన్ని కలిగించిన స్వమికి జన్మ జన్మలకు రుణపడి వుంటాము!
స్వామి నెలకొల్పిన సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్యశాల, ఉచిత విద్యా సంస్దలు, ఉచిత సంగీత కళాశాల/విశ్వవిధ్యాలయం, ఉచిత మంచినీటి సరఫరా ప్రాజెక్టులు, ఇవన్నీ స్వామి చేసిన సేవలకు తార్కాణాలు ! పపంచములోనే మేటి సంస్దలుగా ఇవి గౌరవ సత్కారాన్ని పొందాయి. ఒక రూపాయి పెట్టుబడికి వేల రూపాయలు ఆశించే ఈ కలియుగంలో ఉచిత సేవలు ఆందించిన ఘనత, గొప్పతనము, ధాతృత్వము, త్యాగశీలము సత్యయసాయికే దక్కుతుంది.
ఇక అద్భుతాల విషయానికొస్తే, ప్రశాంతి నిలయం అసంఖ్యాకమైన మహిమలకు పుట్టినిల్లు, అక్కడేగాక ప్రపంచంలోని సత్యసాయి సేవా సంస్దలలో, ఆయన్ని నమ్ముకున్న భక్తకోటి కుటుంబాలలో, ఆయన చూపిన మహిమలు, లీలలు, కోకొల్లల్లు. కళ్ళెదురుగా కొన్ని వేలమంది భక్తులు చూస్తుండగా మనుషుల రోగాల్ని నయంచేయడం, వికలాంగులను ఉద్దరించదడం, అనుకున్నది క్షణాలలో సృష్టించడం, బాధలను హరించడం, పరోక్షంగా కూడా భక్తులను భాధలనుండి, ఆపదలనుండి ఎప్పుడూ కాపాడటం ఆయనఖకు సర్వసాధారణం.
[స్వామి పలుకులు:- "బంగారూ మీ జీవితాలు నాముందు తెరచిన పుస్తకాలే."]
ఈనాడు స్వామి బాటలో సాయి మార్గంలో, సాయి వచనములను అనుసరింస్తూ భక్తులైతేనేమి, ప్రజలైతేనేమి, ఏకంగా ప్రపంచమే చలించి కొన్ని కోట్ల మంది భక్తులు తమ తమ జీవితాలను శ్రీ సత్యసేవా సంస్దల ద్వారా నైతే నేమి, వ్యక్తిగతంగా నైతేనేమి తమతమ జీవితాలను సన్మార్గంలో ప్రవేశపెట్టి, వారి వారి జన్మలను సార్థకత గావించే నిమిత్తం కృషి సల్పుతున్నారు, సఫలీకృతులవుతున్నారు ! ఇదంతా సత్యసాయి అవతార వైభవమే తప్ప మరొకటికాదు!
ప్రపంచంలో మూలమూలలా ఆధ్యాత్మిక విప్లవం తెప్పించి భక్తుల హృదయాలలో భక్తిరసం నింపిన సత్యసాయి సాక్షాత్తు మహితోన్నత చరితుడే! [స్వామి చాలా సార్లు ప్రబోధించారు "భగవంతునికి యేదీ అసాధ్యంకాదు, భూమిని ఆకాసశంగాను, ఆకాశాన్ని భూమిగానూ మార్చవచ్చును అని"]
అలా భక్తకోటి హృదయాలలో శ్వాశ్వత నివాసాన్ని యేతర్పరచుకొన్న శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు దేహాన్ని చాలించాల్సివచ్చి, అవతార సమాప్తం చేయడం జరిగింది. [స్వామి వచనం:- "దేహము కనులక లేప్పదెప్పుడునూ, కానీ దేహి సారామయుడు"] భగవంతుడైనా సరే మానవ ఆకారము ధరించిన పిమ్మట ఆ అవరతార లక్ష్యములు, ఉద్దేశము, నెరవేరిన తక్షణం దేహము వీడక తప్పదు, ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.
కృష్ణుడు, రాముడు, షిరిడీసాయిబాబా మొదలైన భగవంతుని అవతారాలన్నీ సమాప్తి గావించడం మనకు తెలుసును, అలాంటిదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విషయాల్లోనూ జరిగింది. 'మనము ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు' ఇంకా 11 ఏన్డ్లు స్వామి అవతారముంది అని నమ్మిన భక్తకోటికి భరించలేని దుఖ:మే. ఏది ఏమైనా భగవంతుని సంకల్పం ప్రకారం సర్వ కర్మలు, సర్వ ధర్మాలు, ఈ సృష్టి సైతం నడుస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ! దేహము వీడినా భగవంతుడు ఆత్మరీతిగా ఈ విశ్వమంతా వ్యాపించి వున్నాడు కనుక ఏ భగవన్నామము ఉచ్చరించినా ఆయనకి చేరిపోతుంది. ఈ భూమిపై మనుష్యులను ఉద్దరించడానికి భవంతుడు అనేక అవతారాలను ధరించాడు, ఎన్నో బోధనలు చేసారు, కాలక్రమంలో అవతారాన్ని చాలిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పూడు మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే భవాన్ బాబా వారి దివ్య సందేశాలను, ఉపన్యాసాలను మాటలను, అనుసరించడం! తద్వారా మన జీవితాలను సార్థకత చేసుకొని భక్తి ద్వారా ముక్తిని పొందడమే మన ధ్యేయంగా కావలెను. ఇదే జీవిత పరమావధి! [స్వామి వచనం:-My life is my message]
శ్రీ సత్యసాయి బాబా వారి బాల్యవిషేషములు
మార్చుభగవాన్ బాబా వారు చిన్నతనము నుండే ఎన్నో మహిమలను, లీలను చూపిస్తూ వుండేవారూ! కాని నారాయణుడే నరుడుగా భక్తకోటిని ఉద్దరించుటకు ప్రేమ స్వరూపుడై అవతరించాడని ప్రజలు, బంధువులు, కనుగొనలేక పోయారు.
ఒకసారి స్వామి తోటి పిల్లలతో కలసి కోండమీది చింతచెట్టు వద్దకు ఆడుకునేందుకు వెళ్ళారు, అప్పుడాయనకు తొమ్మిది సవత్సరములు మాత్రమే, అంతట భగవాన్ బాబా వారు ఆ చింతచెట్టు నుండి కోరిన ఫలములని పిల్లలకు అందించేవారు, కాని వారు పసిపిల్లలు గనుక స్వామి లీలలు అర్దచేసుకోలేక, కేవలం ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు! ఖాళీ సంచి నుండి ఎవరికి ఏమి కావాలంటే అది షృష్టించి ఇచ్చేవారు.
స్వామి అసలు పేరు "సత్యనారాయణరాజు" చిన్నతనంలో అందరూ రాజూ... రాజూ... అని స్వామివారిని సంబోధించేవారు స్వామి వారి తల్లి ఈశ్వరమ్మ గారు స్వామిని గర్బంతో వున్నప్పుడు ఆకాశంనుండి ఒక వెలుగు ఆమె కడుపులో ప్రవేశించటం చూసారు, స్వామి జన్మించే సమయానికి పక్క ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతూ వుంది, ఆ స్వామి ప్రసాదము ఈశ్వమ్మకు ఇచ్చిన పిదప స్వామి జన్మీచారు కనుక బాబాకి "శ్రీ సత్యనారాయణ రాజు" అని నామకరణంఅం చేశారు. స్వామి జన్మించక పూర్వమే వాళ్ళ గృహములో కొన్ని మహిమలను చూసి
స్వామి వారి ఇంటిలోనున్న సంగీత వాయిధ్య పరికరములు (తబలా, వీణ, మృదంగం) వాటంతట అవే మ్రోగేవి, ఇది గమనించిన సిద్దాంతి, ఈ ఇంటిలో దైవాంస సంభూతుడు జన్మీచబోతున్నాడు అని వారికి చెప్పాడు. స్వామి జన్మించిన వెంటనే ఒక నాగుపాము వచ్చి స్వామివారి శిరస్సు వద్ద పడగ విప్పివుండగా జనులన్తా చూసి ఆశ్చర్యపోయారు! అలా అంచలంచలుగా స్వామి తన దివ్య అవతార వైభవమును ప్రకటిస్తూ వచ్చారు!
శ్రీ భగవాన్ బాబా వారి అన్నగారి పేరు శ్రీ శేషమరాజు, ఇతనికి స్వామిని అప్పగించి విద్యాబుద్ధులు నేర్పించవలసిందిగా బాబా గారి తల్లి శ్రీమతి ఈశ్వరమ్మగారు చెప్పారు, తల్లి మాటలననుసరించి స్వామిని చదివించేందుకు శేషమరాజు గారు వాళ్ళ ఇంటికి తోడ్కొని పోయారు, ఈ విషయాన్ని బాబావారు స్వయంగా తానే ఇలా సెలవిచ్ఛారు, "మా అమ్మ గారు పాపం నన్ను మా అన్నయ్యకు అప్పగించి, 'నాయనా శేషమరాజూ.. 'రాజు' చిన్నవాడు ఇక్కాడ చదువుకొనే వసతి లేదు గనుక నీ దగ్గర చదివించి, వీన్ని ఒకదారిలో పెట్టు నాయనా అని చెప్పింది. అంతట మా అన్న గారు "అలాగే అమ్మ, 'రాజు'ని తప్పకుండా దారిలో పెడతాను అని మాటయిచ్చి చివరకు నన్ను చూడతటానికి వచ్చిన భక్తులను దారిలో పెదట్టసాగాడు" ఇలా తన బాల్య విషేషాలను చమత్కరించారు.
పాఠశాలలోని పిల్లలందరికీ చాలమంది ఉపాధ్యాయులకూ "రాజు.." అంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఒకసారి క్లాస్టీచరు స్వామి హోమ్ వర్క్ చేయలేదన్న కోపంతో స్వామిని బెంచీ మీద నిలబడవలసిందిగా ఆఘ్నాపించాడు, ఆ క్లాసు ముగిసి స్కూలు గంట మ్రోగినది, తరువాతి క్లాసు యొక్క మాస్టరుగారు కూడా వచ్చారు కానీ స్వామికి షిక్ష విధించిన మాస్టరు మాత్రం అలానే బెన్ఛికి అతుక్కొన్ని పోయారు, తిరిగి స్వామి వారు కూర్ఛున్నాక గాని ఆయనను తన కుర్జీ వదలలేదు. ఈ పాఠశాలలోని ఒక మహ్హమ్మదీయ మాష్టరు గారు స్వామికి భక్తునిగా మారి సేవించుకొన్నారు.
శ్రీ భగవాన్ బాబా వారు అహింసను బాల్యం నుండే ప్రబోధించారు, అమ్మవారికి బలిచ్చుటకు తీసుకునిపోయే మూగ ప్రాణులను బలిగావించకుండా అడ్డు పది జనులకు హితభోధలుచేసేవారు, జీవరాసుల యందుండే ఆత్మా ఒక్క్టే అని నిరూపించేవారు.
స్వామి తల్లిగారైన శ్రీమతి ఈశ్వరమ్మ గారు తన కుమారుడైన సత్యనారాయణరాజు గారిని భగవంతుని అవతారముగా గ్రహించి ఒరేయ్..., అని పిలవడం మానేసారు, కానీ స్వామివారి తండ్రిగారైన శ్రీ పెద్దవెంకమ్మరాజు గారు మాత్రం తన కుమారుని భగవంతునిగా నమ్మేవారు కాదు పైగా తన కుమారుడు వింతలు, విడ్డూరాలు చేస్తున్నాడు అని నమ్మి కదరిలోని నరసింహస్వామి గుడి వద్దకు బాబాగారిని పిలుచుకొని వెళ్ళి, ఒక భూత వైద్యుని పిలిపించారు. స్వామికి దెయ్యం పట్టివున్నదని దాన్ని వదిలింఛమని ఆ భూత వైద్యుని ప్రార్థించారు. భూత వైద్యుడు స్వామిని చిత్రహింశలకు గురిచేసాడు, స్వామి కురులనుకత్తరించి గుండు గీయించాడు, కత్తితో నాలుకపైన నాలుగు గాయాలు చేసి ఆ గాయంపై మిరపపొడిని జల్లి నిమ్మకాయ రసాన్నిపోసాడు (ఈ గాయాలు భక్తులకు కనపడనీయకుండా స్వామివారు తన ఉంగరాల కురులను అలాగే పెంచసాగారు) అంతట ఆ భూతవైద్యుడు నీవు ఎవరో చెప్పు అని స్వామిని నిలదీయగా అప్పుడు స్వామి "నేను సాయిబాబాను" అని కదిరి నరసింహస్వామి గుడి వద్ద ప్రకటించారు. ఆ భూరత వైద్యుడు రుజువు కోరగా బాబాగారు తన దగ్గరలో ఒక పల్లెంపై ఉన్న మల్లెపూలను తీసుకొని విసి పారేయగా అవి సాయిబాబా అని పిలిచాయి.
భగవాన్ బాబా వారు ఐదవతరగథి చదువుతున్నపుడు, ఒక రోజు పాఠశాలనుండి ఇంటికి వచ్చి తన వదిన గారితో నాకు ఇంక మీతో ఋణం తీరిపోయింది, నా భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, అని పుస్తకాలను పారవేసి ఇంటినుండి కట్టు బట్టలతో బయటకు వచ్చేశారు. అలా వచ్చిన స్వామి తన పదునాలుగవ సంవత్సరంలో గారి తోటలో ఒక బల్ల మీద కూర్చొని "మానస భజరే గురు చరణం దుస్తరభవసాగరతరణం" అనే పాటతో, నామ సంకీర్తనతో తన అవతార ప్రకటన గావించారు, శ్రీ సత్యసాయి సేవా సంస్దలు ఇప్పటికీ విశ్వవ్యాప్తంగాని జరుపుకొంట్టున్నారు చేసుకొంటున్నారు, అది న వస్తుంది.
పుటపర్తిలోని ఆంజనేయస్వామి ఆలయములో స్వామి వారి బాల్యమున తనమిత్రులతో కలసి అక్క్డ ఆడుకొనుటకు వెళ్తూ వుండేవారు, ఆక్రమంలో తోటి పిల్లలు ఆ హనుమంతుడి విగ్రహమునకు ప్రదక్షణ చేస్తూ స్వామి వారిని కూడా బలవంత పెట్టి ప్రదక్షిణ చేయించే సరికి వెంటానే అక్కడికి పెద్ద కోతి ఒకతటి వచ్చి స్వామి వారి పాదాలకు నమస్కరించి ఇలా అంది "స్వామి మీరేన్టి నాకు ప్రదక్షణ చేయదడమేమిటి అని ప్రార్దించి" అంతర్దానమైంది. ఇప్పటికీ మనము ఈ ప్రదేశాన్ని పుట్టపర్తిలో చూడవచ్చును.
స్వామి వారి తల్లి గారైన శ్రీమతి ఈశ్వరమ్మ గారు స్వామిని మూడు కోరికలు కోరారు, అవి:- 1. పుట్టపర్తి, అనంతపురం జిల్లా వాసులకు నీటి కొరతను తగ్గించడం. 2. ఒక మంచి ఆసుపత్రిని నిర్మించడం. 3. పిల్లలకు విద్యాబోధన నిమిత్తం ఒక పాఠశాలను నిర్మించటం. వీటికి వేయిరెత్లతో తన తల్లి కోర్కెను సాయి తీర్ఛి "మాతృదేవోభవ" అన్న వాక్కునకు అర్ధము చెప్పారు.
స్వామి ప్రభోదించిన సూక్తులు
మార్చుస్వమత సమన్వయమే సాయి మతము సత్యమే నా ప్రచారము ధర్మమే నా ఆచారము శాంతియే నా స్వరూపము ....బాబా
హృదయం | హృదయంలేని మాటకన్నా, మాటలేని హృదయం మిన్న |
లక్షణం | కృతఘ్నత క్రూర జంతువుల లక్షణం |
సేవ | నరుని సేవయే నారాయణుని సేవ
[స్వామి వారు ఒకసారి ఒక పిల్లవాని అన్నిటి కన్నా ఈ ప్రపంచంలో గొప్ప సిటీ ఏది బంగారు! అని ప్రశ్నించగా, ఆ పిల్లవాడు రకరకాల సిటీ ల పేర్లను విన్న వించాడు (జపాన్, లన్డన్, ఢిల్లీ.. మొదలైనవి) స్వామి "కాదు..కాదు! అన్ని సిటీలకన్నా ప్రపంచములో గోప్పది 'సిం ప్లిసిటీ' మాత్రమే" ఇలా చమత్కరించారు] |
నీతి-కోతి | నీతి యే నిజాయితీ, అది వదిలితివా నీవు కోతి |
ఆభరణం | నిరాడంబరమే మానవుని వెలలేని ఆభరణం |
కారాదు | విద్యార్థులు విషయార్దులు కారాదు |
విద్య | విద్య గుణార్జనకు గాని ధనార్జనకు కాదు |
చిల్లుల కుండ | శీలము లేని మనిషి, చిల్లుల కుండ వంటివాడు |
భగవంతుడు చిత్తచోరుడా? | భగవంతుడు విత్తచోరుడు కాదు, చిత్తచోరుడు |
భగవంతుడు యెవనికి ప్రియుడు | భగవంతుడు భావప్రియుడు, బాహ్య ప్రియుడు కాదు |
నావ | భగవణ్ణ మమే భవసారగరాన్ని దాటించే నావ |
త్యాగం | దేహభిమానాన్ని త్యజించడమే త్యాగం |
జీవితం | దివ్య జీవితాన్నికోరాలి, దీర్ఘ జీవితాన్ని కాదు |
దైవ మందిరము | దయగల హృదయమే దైవ మందిరము |
లాభం | జీవుడిని భాధించి, దేవుడిని పూజిస్తే లాభం లేదు |
మేలు-కీడు | చేసిన మేలు వ్యర్దం కాదు, చేసిన కీడు వృధా పోదు |
సన్యాసి | గుణాలతో సన్యాసి కావాలి గాని, గుడ్డలతో కాదు |
దాసులు | హరికి దాసులు కావాలి గాని సిరికి కాదు |
బలము | సైనిక బలకము కన్నా నైరతిక బలము మిన్న |
ఐక్యత-అనైక్యత | ఐక్యత సొఉభాగ్యము - అనైక్యత దౌర్భాగ్యము |
జీవించు | ఆశయాల కోసం జీవించు - ఆశల కోసంకాదు |
ప్రేమ-సేవ | ఇచ్చుకొనుము సేవ - పుచ్చుకొనుము ప్రేమ |
అతిహాయి | అతిభాష మతి హాని, మిత భాష అతిహాయి |
కావాలి-కారాదు | హృదయం క్షీరసాగరం కావాలి, కారసాగరం కారాదు |
పెంచుకోండి | గుణాలను పెంచుకోండి, కేవలం గుడులనే కాదు |
లాభం | జీవుడిని బాధించి, దేవుడిని పూజిస్తే లాభం లేదు |
వెంటవచ్చేది | వెంట వచ్చేది సంస్కారమే గాని, సంసారము కాదు |
కీర్తి | మానము, మౌనము మానవవునికి కీర్తినిస్తాయి |
మోక్షము | మోహ క్షయమే మోక్షము |
చూడు-చూడకు | రాతియందు దేవున్ని చూడు, దేవున్ని రాయిగా చూడకు |
సుఖము | రేండు దు:ఖముల విరామమే సుఖము |
ఎక్కువ-తక్కువ | లోకంలో విశషయగ్రస్తులు ఎక్కువ - విచారగ్రస్తులు తక్కువ |
వశం | లోకేశుని వశం చేసుకోంటే లోకమే వశమౌతుంది |
సాధన | వాదన సాధనకు పనికి రాదు |
అప్పజెప్పు | విత్తం సంసారమునకు, చిత్తం భగవంతునికి అప్పజెప్పు |
ఆర్జన | విద్య గుణార్జనకు గాని ధనార్జనకు కాదు |
బలము | గుణము కంటే మించిన బలము లేదు |
సేవ | గ్రామసేవయే రామసేవ |