సనా దువా (జననం 1993 జనవరి 4), ఒక భారతీయ న్యాయవాది, ప్రేరణాత్మక వక్త, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమెను 2019 లోక్సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2017 లో ఫెమినా మిస్ ఇండియన్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలుచుకుంది.[1] జమ్మూ కాశ్మీర్ నుండి మొదటి మిస్ ఇండియాగా పేరు తెచ్చుకుంది.[2][3]

సనా దువా
అందాల పోటీల విజేత
జననము (1993-01-04) 1993 జనవరి 4 (వయసు 31)
అస్సాం
విద్య
  • ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోయిడా
  • పంజాబ్ విశ్వవిద్యాలయం
వృత్తి
  • మోడల్
  • లాయర్
ఎత్తు177 cm
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా (జమ్మూ కాశ్మీర్ 2017)
ప్రధానమైన
పోటీ (లు)
  • ఫెమినా మిస్ ఇండియా 2017
    (ఫస్ట్ రన్నరప్)
  • మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ 2017
    (టాప్ 10)

ఆమె సెప్టెంబరు 2017లో ఈక్వెడార్ గ్వాయాక్విల్ లో జరిగిన మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ 2017 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి 10 స్థానాల్లో నిలిచింది.

ప్రారంభ జీవితం

మార్చు

సనా దువా భారతదేశంలోని అస్సాంలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది, ఆమె పూర్వీకుల మూలాలు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి.[4][5][6] ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశాడు. ఆమె అన్నయ్య వరుణ్ దువా ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైంది.

2015లో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టింది. ఆమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో ఒక సంవత్సరం పాటు న్యాయవాది వృత్తిలో కొనసాగింది. ఆ తరువాత, ఆమె ఫెమినా స్టైల్ మిస్ దివా నార్త్, 2016 అవార్డును గెలుచుకుంది. ఆమె జమ్మూలో సేవ్ వాటర్ క్యాంపెయిన్‌లో విస్తృతంగా పనిచేసింది.

మిస్ ఇండియా..

మార్చు

ఆమె 2019లో తన సొంత స్టార్టప్ 'ఇమేజ్ అండ్ బియాండ్ బై సనా దువా' ను ప్రారంభించింది, ఇది మోడలింగ్, ప్రదర్శనల పట్ల యువతులు తమ నిజమైన సామర్థ్యాన్ని కనుగొనడంలో సహాయపడడానికి ఉపకరిస్తుంది. ఆమె ఏప్రిల్ 2024లో మిస్ ఇండియా యూనివర్స్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమితులయింది.[7][8]

విదేశీ కార్యక్రమాల్లో..

మార్చు

ఆగస్టు 2022లో, విక్టోరియన్ ఎంపీ జాన్ బెర్గెర్, మాజీ విక్టోరియన్ ప్రీమియర్ గౌరవనీయ టెడ్ బెయిల్యూతో పాటు వారి 48వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనడానికి ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆల్బర్ట్ పార్కులోని ఇస్కాన్ ఆలయం ద్వారా ఆమె ఆహ్వానించబడింది. మెల్బోర్న్ పర్యటనలో, ఆమె విక్టోరియన్ ఎంపీ పౌలిన్ రిచర్డ్స్, ఏఎల్పీకి చెందిన మనోజ్ కుమార్ తో కలిసి క్రాన్బోర్న్ లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కూడా హాజరయ్యింది. [9]

మూలాలు

మార్చు
  1. "Letter from the Polls by Nitin Gupta (Former Ministerial Adviser)". The Indian Sun. 9 May 2019.
  2. "Sana puts J&K on Global Beauty Map". The Indian Sun. 15 March 2019. Archived from the original on 23 April 2019. Retrieved 23 May 2019.
  3. "With my win, J&K in news for right reason: Miss India runner-up Sana Dua". Hindustan Times. 2017-07-08. Archived from the original on 2017-09-24. Considering the constant political turmoil in the Kashmir Valley, she was asked about her feelings of coming from that state and winning the first runner-up crown in the beauty pageant.
  4. Divya Kaushik (2017-07-04). "Sana Dua: The discipline of Army schools prepares you for any competition in the world". Times of India. Archived from the original on 2017-09-28. After graduating in law from Panjab University, Sana started interning under a senior advocate at the J&K; High Court.
  5. Disha Roy Choudhury (2017-07-04). "Born to Sikh parents, given a Muslim name, the life of Miss India runner-up Sana Dua". India Today. Archived from the original on 2017-09-21. The biggest turning point of Sana's life was her graduation in law; she says it made her analyse and comprehend the violence perpetrated against women.
  6. Rohan Dual. "Out of the 22 districts in the state, only 4-5 districts are terror-torn". Times of India. Archived from the original on 2017-09-28. The first runner-up of fbb Colors Femina Miss India 2017 contest, Sana Dua, recently met Jammu and Kashmir governor NN Vohra, and told him about her intention to contribute towards promoting tourism in the conflict-hit region.
  7. "Sana Dua appointed as State Director for Miss Universe India - Jammu Links News".
  8. "Miss Universe India in Kashmir". The Indian Sun. 8 June 2024.
  9. "Sana joins ISKCON Janmasthmi at Melbourne". The Indian Sun. 25 Aug 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సనా_దువా&oldid=4352754" నుండి వెలికితీశారు