సపోటేసి (Sapotaceae) కుటుంబంలో40 ప్రజాతులు, 800 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి.

సపోటేసి
Pouteria sapota
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
సపోటేసి
ప్రజాతులు

See text

కుటుంబ లక్షణాలు

మార్చు
  • మొక్కలు ఎక్కువగా వృక్షాలు.
  • పాలవంటి లేటెక్స్ ఉంటుంది.
  • పుష్పభాగాలు కేశాలతో కప్పి ఉంటాయి.
  • ద్విలింగ పుష్పాలు, సంపూర్ణము, అండకోశాధస్థితము.
  • ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల సంఖ్యకు సమానం లేదా రెట్టింపుగా ఉంటాయి.
  • బాహ్యోన్ముఖ పరాగకోశాలు.
  • ఫలదళాలు 2-8, సంయుక్తము.
  • ప్రతి బిలములో ఒకే అండము, స్తంభ అండన్యాసము.
  • మృదుఫలము.

ఆర్థిక ప్రాముఖ్యత

మార్చు
  • సపోటా, పాలపండ్లు తింటారు.
  • పొగడ పూల నుండి పరిమళమైన తైలం లభిస్తుంది.
  • ఇప్ప పువ్వులలోని ఆకర్షణ పత్రాలు చక్కెర పదార్ధాలతో ఉంటాయి. వీటి నుండి ఇప్పసారా తయారుచేస్తారు.
  • సపోటా లేటెక్స్ నుండి చూయింగ్ గమ్ ను తయారుచేస్తారు.
  • పాక్వియం గట్ట లేటెక్స్ నుండి గట్టాపర్కా అనే రబ్బరును తయారుచేస్తారు.
  • సిడరోక్సైలాన్ నుండి ధృఢమయిన కలప లభిస్తుంది.

ముఖ్యమైన మొక్కలు

మార్చు

మూలాలు

మార్చు
  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=సపోటేసి&oldid=4336693" నుండి వెలికితీశారు