సప్త సాగరాలు దాటి- సైడ్ బి

సప్త సాగరాలు దాటి- సైడ్ బి 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] కన్నడంలో 'సప్త సాగర దాచే ఎల్లో' - సైడ్ బి పేరుతో హేమంత్.ఎం.రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నవంబర్ 17న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.[2] రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితస్వా, చైత్ర ఆచార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 04న నటి సమంత విడుదల చేయగా [3], సినిమా నవంబర్ 17న విడుదలై, డిసెంబ‌ర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[4]

సప్త సాగరాలు దాటి- సైడ్ బి
దర్శకత్వంహేమంత్ ఎం. రావు
రచనగుండు శెట్టి
హేమంత్ ఎం. రావు
నిర్మాతరక్షిత్ శెట్టి
తారాగణంరక్షిత్ శెట్టి
రుక్మిణీ వసంత్
పవిత్రా లోకేష్
అచ్యుత్ కుమార్
శరత్ లోహితస్వా
ఛాయాగ్రహణంఅద్వైత గురుమూర్తి
కూర్పుసునీల్ ఎస్. భరద్వాజ్
సంగీతంచరణ్ రాజ్
నిర్మాణ
సంస్థ
పరమవా స్టూడియోస్
పంపిణీదార్లుకేవిఎన్ ప్రొడక్షన్స్ (కన్నడ)

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (తెలుగు) శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ (తమిళ్)

ప్రిథ్వీరాజ్ ప్రొడక్షన్స్ (మలయాళం)
విడుదల తేదీ
17 నవంబర్ 2023
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? జైలు నుండి తనని బయటకి తీసుకురాకుండా వదిలేసిన వాళ్ళని, జైలులో తనతో గొడవ పడ్డవాళ్ళు బయట కూడా టార్గెట్ చేయడంతో మను ఏం చేశాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. V6 Velugu (5 November 2023). "సప్త సాగరాలు సైడ్ బి". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (20 October 2023). "17న 'సప్త సాగరాలు దాటి - సైడ్‌ బి'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  3. Mana Telangana (4 November 2023). ""సప్త సాగరాలు దాటి సైడ్ బి" కోసం సమంత". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  4. Hindustantimes Telugu (6 December 2023). "ఓటీటీలోకి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ - స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్ బీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌!". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  5. Eenadu (17 November 2023). "రివ్యూ: స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ బి". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.

బయటి లింకులు

మార్చు