చైత్ర జె. ఆచార్ భారతీయ సినిమా నటి, గాయని. బెంగళూరులో పుట్టిన ఆమె ప్రధానంగా కన్నడ సినిమారంగానికి చెందినది. మహీరా (2019)లో ఆమె తొలిసారిగా నటించింది.

చైత్ర జె ఆచార్
జననం
వృత్తి
  • నటి
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం

2022లో, ఆమెకు గరుడ గమన వృషభ వాహన చిత్రంలో "సోజుగడ సూజుమల్లిగే" పాటకుగాను 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం దక్కింది.[1]

ప్రారంభ జీవితం

మార్చు

చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి పాడేటప్పుడు ఇంట్లో సంగీతం వింటూ పెరిగింది, అలా ఆమె పాడటంపై ఆసక్తిని పెంచుకని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. చిన్నప్పటి నుండి ఆమె అనేక థియేటర్ ప్రొడక్షన్స్‌లలో భాగమైంది. పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంది. ఆమె పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్‌లో చదువుకుంది, అక్కడ ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. తరువాత, ఆమె ఇంజినీరింగ్ చదవడానికి బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరింది. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR)లో కొంతకాలం ఇంటర్న్‌గా పనిచేసింది.[2]

కెరీర్

మార్చు

నటిగా

మార్చు

కళాశాలలో ఉండగానే, నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి, నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది.[3] ఆమె 2019లో మహేష్ గౌడ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మహిరాతో కన్నడ చలనచిత్ర రంగప్రవేశం చేసింది. గిల్కీ, తలేదండ, ఆ దృశ్య వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు అద్భుతమైన నటనతో పోషించిన ఆమె ప్రసిద్ధి చెందింది.[4][5]

రక్షిత్ శెట్టి స్టూడియో స్ట్రాబెర్రీ[6], శ్రీనిధి బెంగళూరు బ్లింక్, రాకేష్ కద్రి హ్యాపీ బర్త్‌డే టు మి, శివ గణేశన్ యారిగు హెల్బేడి.. ఇలా మరి కొన్ని సినిమాలలో ఆమె నటించింది. ఆమె ప్రస్తుతం హేమంత్ ఎం రావ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన సప్త సాగరదాచే ఎల్లో చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులో సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ గా విడుదలై వజయం సాధించింది.[7] అలాగే, సప్త సాగరాలు దాటి- సైడ్ బిలో కూడా ఆమె నటించింది.[8]

గాయనిగా

మార్చు

నటిగా యాదృచ్ఛికంగా వచ్చిన ఆమె ఎప్పుడూ సంగీతాన్ని ఆస్వాదించేది. ఈ క్రమంలో ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా ఎదగాలని ఆమె భావించింది. ఆమె 2019-20లో అనేక చలన చిత్రాలలో కోరస్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత, ప్లేబ్యాక్ సింగింగ్‌లోకి ప్రవేశించి సినీ పరిశ్రమలో ప్రముఖ గాయకులలో ఒకరిగా ఆమె మారింది. గరుడ గమన వృషభ వాహనం చిత్రానికి ఆమె పాడిన సోజుగడా సూజు మల్లిగే అనే పాట ఇంటర్నెట్ లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది.[9]దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "SIIMA 2022 winner's list: Allu Arjun's Pushpa wins big in several categories". India Today (in ఇంగ్లీష్). Retrieved 26 August 2023.
  2. "The down to earth debutante". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2019-08-07.
  3. "Home Party is". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2017-12-28.
  4. "Exclusive Iam doing varied content driven films to show people my range as an artiste chaitra J achar". Ott Play (in ఇంగ్లీష్). Retrieved 2022-03-30.
  5. "Chaitra Achar joins the cast of Sapta Sagaradaache Yello". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2022-11-15.
  6. "Mangaluru: Arjun Lewis directorial Kannada movie 'Strawberry' poster released". Daiji World (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.
  7. TV9 Telugu (29 September 2023). "వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 29 September 2023. Retrieved 29 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Mana Telangana (4 November 2023). ""సప్త సాగరాలు దాటి సైడ్ బి" కోసం సమంత". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  9. "Garuda GamanaVrishabha Vahana Movie Song SojugadaSoojumallige inches towards one million views". Tv 9 Kannada (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.