సమరసింహారెడ్డి

(సమరసింహా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

సమరసింహా రెడ్డి బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరీ, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా.

సమరసింహా రెడ్డి
(1999 తెలుగు సినిమా)
Samarasimha Reddy Cover.gif
దర్శకత్వం బి.గోపాల్‌
నిర్మాణం చెంగల వెంకట రావు
రచన విజయేంద్రప్రసాద్
తారాగణం నందమూరి బాలకృష్ణ,
సిమ్రాన్‌,
అంజలా జవేరి
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం మణిశర్మ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్
నిడివి నిమిషాలు
భాష తెలుగు

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు.[1] ఈ ప్రధానమైన ఇతివృత్తాన్ని స్వీకరించి చనిపోయిన పనివాడు కథానాయకుడి చేతిలోనే పొరబాటున చనిపోవడం, కథను ఫ్లాష్ బాక్ విధానంలో చెప్పడం వంటి మార్పులు చేర్పులు చేశారు.

థీమ్స్, ప్రభావాలుసవరించు

సమరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఐతే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు.
ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి, గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారు. ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారు.[1]

పాటలుసవరించు

  • అందాల ఆడ బొమ్మ
  • చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
  • అడ్డీస్ అబ్బబ్బా అల్లం మురబ్బా
  • రావయ్యా ముద్దుల మామ

మూలాలుసవరించు

  1. 1.0 1.1 సాక్షి, బృందం (8 డిసెంబర్ 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. {{cite web}}: Check date values in: |date= (help)