సమరసింహారెడ్డి

(సమర సింహా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

సమరసింహా రెడ్డి బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరీ, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా.

సమరసింహా రెడ్డి
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్‌
నిర్మాణం చెంగల వెంకట రావు
రచన విజయేంద్రప్రసాద్
తారాగణం నందమూరి బాలకృష్ణ,
సిమ్రాన్,
అంజలా జవేరి
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం మణిశర్మ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్
నిడివి నిమిషాలు
భాష తెలుగు

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు.[1] ఈ ప్రధానమైన ఇతివృత్తాన్ని స్వీకరించి చనిపోయిన పనివాడు కథానాయకుడి చేతిలోనే పొరబాటున చనిపోవడం, కథను ఫ్లాష్ బాక్ విధానంలో చెప్పడం వంటి మార్పులు చేర్పులు చేశారు.

థీమ్స్, ప్రభావాలు

మార్చు

సమరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఐతే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు.
ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి, గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారు. ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారు.[1]

పాటలు

మార్చు
  • అందాల ఆడ బొమ్మ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఉదిత్ నారాయణ్ , సుజాత
  • చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, రచన:భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అడ్డీస్ అబ్బబ్బా అల్లం మురబ్బా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. మనో, రాధిక
  • రావయ్యా ముద్దుల మామ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నందమూరి , రచన: భువన చంద్ర, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • లేడీ లేడీ , రచన:భువన చంద్ర గానం. మనో, సుజాత.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 సాక్షి, బృందం (8 డిసెంబరు 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.