డాక్టర్‌ సమీర్ షా (జననం జనవరి 1952) భారత్‌లో జన్మించిన ఆయన బ్రిటిష్ టెలివిజన్, రేడియో ఎగ్జిక్యూటివ్. ఆయన లండన్ వీకెండ్ టెలివిజన్(LWT), బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ)లలో వివిధ హోదాల్లో పనిచేశాడు. బ్రిటీష్ కంపెనీ అయిన జునిపెర్ టీవీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కూడా వ్యవహరించాడు.

సమీర్ షా

జననంజనవరి 1952 (age 72)
ఔరంగాబాద్, భారతదేశం
వృత్తి
  • సీఈఓ జునిపెర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక పాత్ర

2021లో, ఆయన జాతి, జాతి అసమానతలపై ప్రభుత్వ కమిషన్(Commission on Race and Ethnic Disparities) నివేదికకు సహ రచయితగా పనిచేశాడు. 2023 డిసెంబరు 6న, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఆయనను బిబిసి ఛైర్మన్‌గా అభ్యర్థిగా ప్రకటించింది.[1][2] బీబీసీ స్వతంత్ర సంస్థ అయినా, దాని ఛైర్మన్‌ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

ఆయన బీబీసీ చైర్మన్‌గా ఫిబ్రవరి 2024లో ఎంపికయ్యాడు. ఈ మేరకు ఫిబ్రవరి 22న బ్రిటన్‌ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్‌ ప్రకటించాడు. దీంతో తొలిసారిగా భారతీయ మూలాలున్న వ్యక్తిని ఎన్నుకున్నట్టయింది.[3]

ప్రారంభ జీవితం మార్చు

సమీర్ షా జనవరి 1952లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అమృత్ షా, ఉమా బకయా దంపతులకు జన్మించాడు. ఆయన 1960లో ఇంగ్లాండుకు వెళ్లి వెస్ట్ లండన్‌లోని లాటిమర్ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆయన హల్ విశ్వవిద్యాలయం(University of Hull) నుండి భౌగోళిక శాస్త్రం డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆంత్రోపాలజీ అండ్ జియోగ్రఫీ ఫ్యాకల్టీలో చదివాడు. సెయింట్ కేథరీన్స్ కాలేజీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (DPhil) చేసాడు. దీనికోసం, ఆయన 1979లో లండన్‌లోని ఆసియా వలసదారుల భౌగోళిక విశ్లేషణ(Aspects of the geographic analysis of Asian immigrants in London) అనే థీసిస్‌ పూర్తి చేశాడు.[4]

ఉద్యోగ ప్రస్థానం మార్చు

  • 1979 - ఆయన లండన్ వీకెండ్ టెలివిజన్‌లో చేరాడు.
  • 1987 - బీబీసి టెలివిజన్ కరెంట్ అఫైర్స్ హెడ్‌గా ఆయన నియమితుడయ్యాడు.
  • 1994-1998 ఆయన బీబీసిలో రాజకీయ జర్నలిజం కార్యక్రమాలకు అధిపతిగా ఉన్నాడు.
  • 1998 - జునిపెర్ టీవీని ఆయన కొనుగోలు చేసి, దానికి సీఈఓ అండ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
  • 1999-2009 రన్నిమీడ్ ట్రస్ట్ చైర్ కమిషనర్
  • 2007-2010 బీబీసిలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా ఆయన నియామకం.
  • 2012-2014 ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ డిప్యూటీ చైర్ పదవి ఆయనకు వరించింది.
  • 2014-2015 పీఎం హోలోకాస్ట్ కమిషన్ సభ్యుడు
  • 2020 - హెరిటేజ్ అడ్వైజరీ బోర్డు సభ్యుడుగా ఆయన నియమితుడయ్యాడు.
  • 2020 - వన్ వరల్డ్ మీడియా చైర్ BAFTA బోర్డు సభ్యుడుగా ఉన్నాడు.
  • 2021 - ఫ్యూచర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్ సభ్యుడుగా ఆయన వ్యవహరించాడు.

తన కెరీర్ లో, ఇలా పలు బాధ్యతలు నిర్వహించిన సమీర్ షా 2006 నుండి 2017 వరకు స్పెషల్ ప్రొఫెసర్ గా యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ లో చేసాడు. అలాగే, 2019 నుండి ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (ఇంగ్లీష్ ఫ్యాకల్టీ)లో విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ క్రియేటివ్ మీడియాగా కూడా ఉన్నాడు.

గుర్తింపు మార్చు

  • 1999లో, ఆయన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(OBE)గా నియమించబడ్డాడు.
  • 2002లో, ఆయన రాయల్ టెలివిజన్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యాడు.
  • 2019లో, హెరిటేజ్ అండ్ టెలీవిజన్ లో చేసి కృషికి సిబిగా ఆయనకు గౌరవం లభించింది.

ఫిబ్రవరి 2022లో, 40 సంవత్సరాలకు పైగా సేవలు, పైగా టెలివిజన్ జర్నలిజంలో సమీర్ షా నిబద్ధతకు గాను రాయల్ టెలివిజన్ సొసైటీ ఆయనను అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ అవార్డుతో సత్కరించింది.

మూలాలు మార్చు

  1. "బీబీసీ ఛైర్మన్‌గా సమీర్‌ షా |". web.archive.org. 2023-12-08. Archived from the original on 2023-12-08. Retrieved 2023-12-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Grierson, Jamie; Topping, Alexandra; Stacey, Kiran (2023-12-06). "Samir Shah to be appointed as next chair of BBC". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2023-12-06.
  3. "బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు | Dr Samir Shah Becomes First Indian-Origin Chairman Of BBC - Sakshi". web.archive.org. 2024-02-23. Archived from the original on 2024-02-23. Retrieved 2024-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Shah, Samir (1980). Aspects of the geographic analysis of Asian immigrants in London (DPhil thesis). Oxford University. Retrieved 6 December 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=సమీర్_షా&oldid=4152103" నుండి వెలికితీశారు