సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ
సయ్యద్ అజ్మతుల్లా హుసేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[1]
సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ | |||
చైర్మన్
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు | |||
పదవీ కాలం 2024 ఫిబ్రవరి 16 – ప్రస్తుతం | |||
ముందు | మహ్మద్ మసిఉల్లాఖాన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1977 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | మల్లేపల్లి, హైదరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తన రాజకీయ ప్రయాణాన్ని 1999లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ)తో ప్రారంభించాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 - 2000లో నిజాం కాలేజిలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, 2002 నుంచి 2006 వరకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2006 నుంచి 2009 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా , ఉపాధ్యక్షులుగా పని చేశాడు. 2009 నుంచి 2016 వరకూ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. 2016 నుంచి 2021 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ ఏప్రిల్ 2021లో పీసీసీ ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితుడయ్యాడు.[2] .[3]
తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ
మార్చు2023లో జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో తెలంగాణ వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించి అందులో భాగంగా అజ్మతుల్లా హుస్సేన్‌ను రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యునిగా తెలియజేస్తూ మైనారిటీ వ్యవహారాల శాఖ జీవో 4ను జారీ చేసింది. అనంతరం పాలకమండలి సభ్యులంతా సమావేశమై ఫిబ్రవరి 16న సహచర బోర్డు సభ్యులు ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.[4]
సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ నేతృత్వంలో ఫిబ్రవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన వక్ఫ్ బోర్డు సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (17 February 2024). "వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుసేని". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ THE HANS INDIA (18 June 2016). "City Congress leaders slam political defectors" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ Sakshi (26 June 2021). "టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ The Times of India (17 February 2024). "Azmatullah elected Waqf Board chairman". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ The New Indian Express (19 February 2024). "Telangana CM vows to protect Waqf properties in state" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ V6 Velugu (19 February 2024). "వక్ఫ్ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేస్తాం సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రేవంత్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)