సయ్యద్ రహమతుల్లా
సయ్యద్ రహమతుల్లా వర్తమాన తరంగిణి పత్రికా వ్యవస్థాపకుడు. 1842లో ప్రారంభమైన ఈ పత్రిక తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటి.[1] ఇది మద్రాసు నుండి వెలువడేది.
విశేషాలు
మార్చుఅతను తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం. 1842 జూన్ 8 న మద్రాసులో "వర్తమాన తరంగిణి " అనే పత్రిక స్థాపించాడు[2]. వర్తమాన తరంగిణి మాసపత్రిక సాహిత్యానికి, వార్తలకు సమప్రాధాన్యాన్నిస్తూ వెలువడింది. [3] చిన్నయసూరి రచనా ప్రారంభ దశలో "వర్తమాన తరంగిణి" అను పత్రికకు వ్రాయుచుండెడివాఁడు. ఆ వెనుక "సుజన రంజని"* అను మాస పత్రిక నాతఁడు నడిపాడు.[4]
తర్వాతి రోజుల్లో ఆ పత్రికను పువ్వాడ శేషగిరిరావు జయప్రదంగా నిర్వహించాడు.[5]
ప్రారంభ పత్రికలో వ్యాఖ్య
మార్చుమొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
మూలాలు
మార్చు- ↑ "'ఉమ్రాలిషా కవి' యనగ నేను!". www.teluguvelugu.in. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
- ↑ "పత్రిక అంటే ఇదీ అదీ". www.teluguvelugu.in. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
- ↑ "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/122 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-25.
- ↑ "చిన్నయసూరి జీవితము/సాహిత్య విద్యాప్రచారము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-25.
- ↑ "కాల్పనికం కాదు కానీ, సృజనాత్మకతమే! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.