సయ్యద్ షెహజాదీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలిగా పని చేస్తుంది.

సయ్యద్ షెహజాదీ

పదవీ కాలం
18 డిసెంబరు 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1992
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
వృత్తి రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం

మార్చు

సయ్యద్ షెహజాదీ తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పట్టణంలో జన్మించింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

సయ్యద్ షెహజాదీ విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో ఉంటూ చురుగ్గా పాల్గొనేంది. ఆమె ఆదిలాబాద్ ఏబీవీపీలో కీలకంగా పని చేసి, అదిలాబాద్ మహిళా కళాశాల ఏబీవీపీ అధ్యక్షురాలిగా, పట్టణ సంయుక్త కార్యదర్శిగా, జిల్లా ఏబీవీపీ మహిళా సెల్ కన్వీనర్‌గా, రెండుసార్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసింది.

షెహజాదీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పొలిటికల్ సైన్స్ కోర్స్ చేస్తూనే యూనివర్సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేసింది. ఆమె 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది.[1][2] సయ్యద్ షెహజాదీ 2021లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా నియమితురాలైంది.[3] ఆమె 18 డిసెంబరు 2021న జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైంది.[4]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (26 November 2018). "సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?". BBC News తెలుగు. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  2. HMTV (8 November 2018). "తారాజువ్వపై లక్ష్మీబాంబ్‌... ఆదిలాబాద్‌లో రాజకీయ హైడ్రామాలు". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
  3. TV9 Telugu (14 July 2021). "బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత.. రెండు కీలక పోస్టుల కేటాయింపు." Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. V6 Velugu (20 January 2022). "సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతుళ్లను చదివించింది" (in ఇంగ్లీష్). Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)