ఆదిలాబాద్

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు మండలం లోని పట్టణం
(అదిలాబాద్ నుండి దారిమార్పు చెందింది)

ఆదిలాబాద్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా,ఆదిలాబాద్ పట్టణ మండలానికి చెందిన పట్టణం.[3] ఇది ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా కేంధ్రం.[4] చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడింది.తెలుగు, మరాఠీ, ఉర్దూ,గోండి ఆదిలాబాద్ పట్టణ స్థానిక భాషలు.[5] పత్తి సాగుకు ఆదిలాబాద్ ప్రసిద్ధి చెందింది. అందువల్ల, ఆదిలాబాద్‌ను "వైట్ గోల్డ్ సిటీ" అని కూడా పిలుస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 304 కిలోమీటర్లు (189 మై.), నిజామాబాద్ నుండి 150 కిలోమీటర్లు (93 మై.), నాగ్‌పూర్ నుండి 196 కిలోమీటర్లు (122 మై.) దూరంలో ఉంది. ఆదిలాబాద్‌ను "దక్షిణ భారతదేశానికి గేట్‌వే" అని పిలుస్తారు.

ఆదిలాబాదు
ఆదిలాబాదు కోట ముందు దృశ్యచిత్రం
ఆదిలాబాదు కోట ముందు దృశ్యచిత్రం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఆదిలాబాద్ జిల్లా
సముద్రమట్టం నుండి ఎత్తు
264 మీ (866 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,17,167
 • ర్యాంకు1వది (జిల్లాలో) 9వది (తెలంగాణ రాష్ట్రంలో)
పిలువబడువిధం (ఏక)ఆదిలాబాదీ
భాషలు
 • అధికారికతెలుగు & ఉర్దూ
కాలమానంUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్‌కోడ్
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS-01[2]
లోక్‌సభ నియోజకవర్గంఆదిలాబాద్
శాసనసభ నియోజకవర్గంఆదిలాబాద్

పేరు వెనుక చరిత్రసవరించు

అదిలాబాదుకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది.[6] మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు.[7]

ఆదిలాబాద్‌ను కాకతీయులు, మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, అంతకుముందు ఉప జిల్లాలైన సిర్పూర్, చందా గోండ్ రాజులు వంటి అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఇది 1872లో పాలకులచే సృష్టించబడి, 1905లో ఇది ప్రముఖ ప్రధాన కార్యాలయంతో స్వతంత్ర జిల్లాగా ప్రకటించబడింది. తరువాత అనేక ప్రాంతాలు కలిపి వేరు చేయబడ్డాయి.[8]

చరిత్రసవరించు

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ పట్టణాన్ని సందర్శించి 1830లో పట్టణం పరిస్థితులు తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేశారు. పట్టణాన్ని యేదులాబాదుగా పేర్కొంటూ, ఇక్కడకు వచ్చే మార్గం ప్రమాదకరమైన అడవులతో నిండివుందన్నారు. పట్టణంలో అప్పటికే అన్ని పదార్థాలూ దొరికేవని, అన్ని పనులు చేసే పనివారూ ఉన్నారని కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది. ఊరివెలుపల ఒక బ్రహ్మచారులు, సన్యాసుల మఠం, ఊళ్ళో మరికొన్ని మఠాలు ఉండేవని వ్రాశారు. ఇచోడా మొదలుకొని వోణి అనే గ్రామం వరకూ ఆదిలాబాద్ సహా అప్పట్లో ముషోర్మల్క్ అనే దివాన్ పరిపాలనలో ఉండేది.[7]

భాషలుసవరించు

ఆదిలాబాద్‌లో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు (మాతృభాషగా 65%). మహారాష్ట్రతో భౌగోళిక సామీప్యత కారణంగా, మరాఠీ (10.5%)కూడా విస్తృతంగా మాట్లాడబడుతుంది. ఆదిలాబాద్‌లో మాట్లాడే ఇతర భాషలలో హిందీ, ఉర్దూ, గోండి లంబాడీ భాషలు ఉన్నాయి.[5]

భౌగోళికంసవరించు

ఆదిలాబాద్ సగటు ఎత్తు 264 మీటర్లుగా ఉంది. కుంటాల జలపాతం, గోదావరి, పెన్ గంగ మొదలైన నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన మావల సరస్సు ఆదిలాబాద్ నగరానికి దక్షిణం వైపు 6 కి.మీ.ల దూరంలో ఉంది. సరస్సు పక్కనే పార్క్ ఉంది. ఆదిలాబాద్‌లోని ఇతర జలపాతాలలో పొచ్చెర జలపాతాలు, గాయత్రి జలపాతం కూడా ఉన్నాయి. సప్త గుండాల జలపాతాలు, 7 చిన్న జలపాతాలను కలిగి ఉంటాయి.

జనాభా గణాంకాలుసవరించు

2011లో ఆదిలాబాద్ జనాభా 117,167 గా ఉంది. ఈ జనాభాలో పురుషులు 59,448 మంది, స్త్రీలు 57,719 మంది ఉన్నారు. జనాభాలో 12,993 మంది 0–6 ఏళ్లలోపు గలవారు ఉన్నారు. నగరం సగటు అక్షరాస్యత రేటు 43.45% గా ఉంది. నగరం పట్టణ సముదాయ జనాభా 139,383 వద్ద ఉంది.

రవాణాసవరించు

రైలు రవాణాసవరించు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగపు ముత్ఖేడ్ -అదిలాబాద్ మార్గముపై నున్నది. దీని స్టేషన్ కోడ్: ADB

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "District Census Handbook – Adilabad" (PDF). Census of India. p. 14,38. Retrieved 19 September 2015.
  2. "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
  3. "ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్". ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం. Archived from the original on 26 సెప్టెంబరు 2011. Retrieved 11 January 2015.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  5. 5.0 5.1 "Language and mother tongues:Town Level data". Census India.
  6. "ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర". Archived from the original on 2015-01-11. Retrieved 2015-01-11.
  7. 7.0 7.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  8. "History | Adilabad District | India".

వెలుపలి లింకులుసవరించు