సరదాగా అమ్మాయితో
సరదాగా అమ్మాయితో 2013 జూన్ 14 న విడుదలైన తెలుగు చిత్రం.
సరదాగా అమ్మాయితో | |
---|---|
దర్శకత్వం | భానుశంకర్ |
నిర్మాత | పత్తికొండ కుమారస్వామి |
తారాగణం | వరుణ్ సందేశ్ నిషా అగర్వాల్ సుమన్ తల్వార్ |
సంగీతం | రవివర్మ |
పంపిణీదార్లు | శ్రీకుమారస్వామి ప్రొడక్షన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసంతోష్ (వరుణ్ సందేశ్) ఒక సరదా కుర్రాడు. జల్సా జీవితానికి అలవాటుపడి అనేకమంది అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అతనికి గీత (నిషా అగర్వాల్) తో పరిచయమయ్యాక ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు కానీ గీత ధ్యాస అతడిపై పడదు. అతని ప్రయత్నాల వలన విసిగి వేసారిన గీత అతనికి ఒక సవాల్ విసురుతుంది. పదిరోజులపాటు మహిళల వసతి గృహంలో గడపాలని, ఏ మహిళనూ లోబర్చుకోరాదనేదే ఆ సవాల్. ఆమె సవాల్ స్వీకరించిన అతడు ఒక మహిళా వసతి గృహంలో వాచ్‌మన్ గా స్థానం సంపాదిస్తాడు. అక్కడ కొంతమంది యువతులు సంతోష్ ను రెచ్చగొట్టినా అతడు సహనం కోల్పోకుండా పది రోజులు గడుపుతాడు. ఈ క్రమంలో నిజమైన ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకొంటాడు. గీత దగ్గరికి వెళ్ళి ఆమెను ఒప్పించాలనుకొనే అతడికి , గీత గురించి కొన్ని చేదు నిజాలు తెలుస్తాయి. అసలు గీత ఎవరు?ఆమె నేపథ్యం ఏమిటి? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగిలిన కథ.
నటవర్గం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు - భానుశంకర్
- సంగీతం - రవివర్మ
- నిర్మాత - పత్తికొండ కుమారస్వామి