సుమన్ (నటుడు)
సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ (1959, ఆగష్టు 28) దక్షిణ భారత సినీ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషలలో 700కి పైగా సినిమాలలో నటించాడు.
సుమన్ | |
---|---|
జననం | సుమన్ తల్వార్ 1959 ఆగస్టు 28 |
వృత్తి | నటుడు |
ఎత్తు | 5"7 |
జీవిత భాగస్వామి | శిరీష |
వెబ్‌సైటు | http://www.mysuman.com/ |
కరాటే (షాట్‌కన్ శైలి)లో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయ్యాడు. ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రములో పోషించిన రాముని పాత్ర మరపురానివి. రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన శివాజీ సినిమాతో ప్రతినాయకుడిగా నటించాడు.ఆయన 2021లో ‘లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు.[1][2] 1993 లో బావ బావమరిది చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నాడు.[ఆధారం చూపాలి]
జీవిత విశేషాలు
మార్చుసుమన్ 1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన తల్లి కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేసింది. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. వీరి స్వస్థలము మంగుళూరు. మాతృభాష తుళు. సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్‌పార్క్ కాన్వెంటు కిండర్ గార్డెన్ లో చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు. ఈయన తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ, హిందీ భాషలలో ధారాళంగా మాట్లాడగలడు. సుమన్ హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతము అభ్యసించాడు. ఇవేకాక ఈయన వీణ, గిటార్ లను వాయించగలడు. ఈయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాక ఈయన గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు అభ్యసించాడు.
సుమన్ వృత్తి జీవితాన్ని సెన్సే (కరాటే మాస్టారు) గా ప్రారంభించాడు. ఈయన కుటుంబ స్నేహితుడు కిట్టూ సుమన్ను ఆఒక తమిళ నిర్మాతకు పరిచయం చేశాడు. ఆ విధంగా 1977లో టి.ఆర్.రామన్న నిర్మించిన తమిళ సినిమా నీచల్ కులంతో సినీరంగంలో ప్రవేశించాడు. తొలి సినిమాలో సుమన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు.1985 లో నీలిచిత్రాల ( బ్లూఫిల్మ్స్ ) నిర్మాణం స్కాంలో చిక్కుకొని కొన్నాళ్ళు నానా ఇబ్బందులు పడ్డాడు. కానీ చివరకు దాన్నుండి విజయవంతంగా బయటపడ్డాడు.
షోటోకన్ కరాటే సంస్థనుండి కరాటేలో బ్లాక్ బెల్ట్ 1 డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. హైదరాబాదులో స్థిరపడిన సుమన్ తెలుగు సినీ , నాటక రచయిత, దర్శకుడు డి.వి.నరసరాజు మనుమరాలు శిరీషను వివాహము చేసుకొన్నాడు. వీరికి ఒక కూతురు (అఖిలజ ప్రత్యూష)[3]
సుమన్ నటించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చుతెలుగు
మార్చు- సముద్రుడు (2024)
- మాధవే మధుసూదనా (2023)
- ఆదికేశవ (2023)
- సరైనోడు (2016)
- ఐక్యూ (2023)
- పరారీ (2023)
- నువ్వే నా ప్రాణం (2022)[4]
- సీతారామపురంలో ఒక ప్రేమ జంట (2022)
- నచ్చింది గర్ల్ ఫ్రెండూ (2022)
- మీలో ఒకడు (2022)
- నిన్నే చూస్తు (2022)
- అల్లూరి (2022)
- మాతృదేవోభవ (2022 సినిమా) (2022)
- సేవాదాస్ (2022)
- పల్లె గూటికి పండగొచ్చింది
- రామ్ అసుర్ (2021)
- ఓ మనిషి నీవెవరు (2021)
- తెలంగాణ దేవుడు (2021)
- ప్రేమ పిపాసి (2020)
- మార్షల్ (2019)
- బిచ్చగాడా మజాకా (2019)[5]
- సకల కళా వల్లభుడు (2019)
- దేశదిమ్మరి (2018)
- మిస్టర్ హోమానంద్ (2018)
- సత్య గ్యాంగ్ (2018)
- సీతారాముల కళ్యాణం చూతము రారండి (2017)
- ఇంకేంటి నువ్వే చెప్పు (2017)
- ఏంజెల్ (2017)
- ఆకతాయి (2017)
- శమంతకమణి (2017)
- అప్పుడలా ఇప్పుడిలా (2016)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- ఒక లైలా కోసం (2014)
- శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర (2014)
- నువ్వే నా బంగారం (2014)
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- ఆడు మగాడ్రా బుజ్జీ (2013)
- నందీశ్వరుడు (2012)
- వీడు తేడా (2011)
- దాసన్నా (2010)
- జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా (2009)
- ఆదివిష్ణు (2008)
- శివాజీ (2007)
- సక్సెస్ (2006)
- సర్దార్ పాపన్న (2006)
- కొడుకు (2004)
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- నీలాంబరి (2002)
- దాదాగిరి (2001)
- అడవిచుక్క (2000)
- రాముడు కాదు రాక్షసుడు (1991)
- భార్గవ్ (1991)
- 20వ శతాబ్దం (1990)
- జయసింహ (1990)
- రావుగారింట్లో రౌడి (1990)
- మెరుపు దాడి (1984)
- డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
- అన్నమయ్య (1997)
- శ్రీరామదాసు (2006)
- కొండపల్లి రాజా (1993)
బయటి లింకులు
మార్చు- ↑ TV9 Telugu (11 July 2021). "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్ - Actor Suman receives Dada Saheb Phalke Award in mumbai". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (11 July 2021). "సుమన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - actor suman receives dada saheb phalke award". www.eenadu.net. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ Swatantra Tv (24 July 2023). "సుమన్‌కు 'నటకేసరి' బిరుదు ప్రదానం". Archived from the original on 24 July 2023. Retrieved 24 July 2023.
- ↑ Sakshi (26 December 2022). "అనుకోకుండా యాక్టర్ అయ్యా.. అతనే నా గాడ్ ఫాదర్: సుమన్". Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
- ↑ The Times of India (31 January 2019). "Bichagada Majaka, a different film for me: Suman" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.