సరళహరాత్మక చలనం
మనం మన నిత్యజీవితం లో ఈ డోలాయమాన చలనాన్ని చూస్తుంటాము.కొన్ని ఉదాహరణలను చూద్దాము.
- గోడ గడియారానికి ఉండే లోలకం చేసే చలనం.[1]
- చేతి గడియారంలో ఉన్న సంతులన చక్రం చేసే చలనం
- గిటారు, వయోలిన్ వంటి సంగీత వాయిద్యాలు, తీగలు చేసే చలనం.
- ధ్వని గాలిలో ప్రయాణం చేసేటప్పుడు అణువులు చేసే చలనం
- ఘన పదార్దాలలోని పరమాణువులు చేసే చలనం
ఒక వస్తువు ఒకసారి డోలనం చేయడాన్ని పట్టిన కాలం(డోలనావర్తన కాలం అంటారు) స్థిరంగా ఉంటుంది.ఇలాంటి చలనాన్ని ఆవర్తన చలనం అంటారు.
ఆవర్తన చలనం
మార్చుసమాన కాల వ్యవధిలో ఒకే పథాన్ని పునఃశ్చరించే ఏ చలనాన్ని అయినా అవర్తన చలనం అంటారు.
కంపన చలనం
మార్చుఆవర్తన చలనంలో ఉన్న వస్తువు, ముందుకి, వెనుకకు ఒకే పథంలో చలిస్తూ ఉంటే దాని చలనాన్ని డోలయామాన చలనం లేదా కంపన చలనం అంటారు.
సరళ హరాత్మక చలనం
మార్చుఒక వస్తువు స్థిర బిందువులో వుంటూ దాని త్వరణం దాని స్థానభ్రంశానికి అనులోనుమానుపాతం లోనూ, విరామస్థానం వైపుగా ఉండేటట్లుగా, ముందుకి-వెనకకి ఉంటే, ఆ వస్తువు సరళ హరాత్మక చలనం (స.హ.చ) చేస్తుంది అంటాం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ భౌతిక రసాయనశాస్త్ర పదవ తరగతి పుస్తకం (2010)
బాహ్యలింకులు
మార్చు- Simple Harmonic Motion from HyperPhysics
- Java simulation of spring-mass oscillator