సర్దార్ బహదూర్ భారతదేశంలో బ్రిటిష్ పాలనలో స్థానిక భారతీయ పౌరులకు, వైస్రాయ్ నియమించిన అధికారులకూ ఇచ్చే గౌరవ బిరుదు. [1] ఇది సిక్కులకు ప్రదానం చేసేవారు. [2] నమ్మకమైన సేవ లేదా ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినవారికీ ప్రదానం చేసేవారు. ఈ బిరుదును వ్యక్తి పేరుకు ముందు, సైనిక హోదాలకు తరువాత ఉపయోగించేవారు. [3] 1911 నుండి బిరుదు గ్రహీతలకు ప్రత్యేకంగా బిరుదు పతకాన్ని కూడా ఇచ్చారు. [1]

ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మొదటి తరగతి పొందిన వ్యక్తులు సర్దార్ బహదూర్ బిరుదును కూడా ఉపయోగించవచ్చు. అలాగే రెండవ తరగతి సభ్యులు బహదూర్‌ను ఉపయోగించవచ్చు. సర్దార్ బహదూర్ బిరుదు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విస్తృతమైన పురస్కార వ్యవస్థలో భాగం: [3] [2]

మొదటి తరగతి

  • హిందువులకు దివాన్ బహదూర్;
  • ముస్లింలకు నవాబ్ బహదూర్, ;
  • సిక్కులకు సర్దార్ బహదూర్;

రెండవ తరగతి

  • హిందువులకు రాయ్ బహదూర్, (ఉత్తర భారతదేశం), రావు బహదూర్ (దక్షిణ భారతదేశం),
  • ముస్లింలకు ఖాన్ బహదూర్, ;

మూడవ తరగతి

  • హిందువులకు రాయ్ సాహిబ్, (ఉత్తర భారతదేశం), రావు సాహిబ్ (దక్షిణ భారతదేశం)
  • ముస్లింలకు ఖాన్ సాహిబ్

ఇతర మతాల వారు తమకు అత్యంత సముచితమైనదిగా భావించే బిరుదును అందుకునేవారు, ఉదాహరణకు హిందూ పేరుగా ధ్వనించే భారతీయ క్రైస్తవులు హిందూ బిరుదును తీసుకునేవారు. [2]

చాలా సందర్భాలలో గ్రహీత తక్కువ స్థాయి తరగతి నుండి ఉన్నత తరగతికి వెళ్తారు. అలా ఒకటి కంటే ఎక్కువ పురస్కారాలు పొందిన వ్యక్తులు అత్యున్నత స్థాయి బిరుదును మాత్రమే ఉపయోగించాలి. [1] పురస్కారాలన్నీ నైట్ హుడ్ కంటే తక్కువ స్థాయికి చెందినవే. ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా లేదా ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ వంటి బ్రిటిషు నైట్ హుడ్ పొందినవారు పై బిరుదులను తొలగించుకుంటారు, . [3]

1947 లో స్వాతంత్య్రం వచ్చాక, బ్రిటిష్ రాజ్ సమయంలో జారీ చేసిన సర్దార్ బహదూర్ తదితర బిరుదులను నిలిపివేసారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Mussell" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 Tagore, Abanindranath; Tagore, Gaganendranath (2018). Fantasy Fictions from the Bengal Renaissance: Abanindranath Tagore's The Make-Believe Prince (Kheerer Putul); Gaganendranath Tagore's Toddy-Cat the Bold (Bhondaṛ Bahadur) (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 978-0-19-909217-8. Retrieved 6 August 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Tagore" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Dorling" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు