ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా

ది మోస్ట్ ఎక్సాల్టెడ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనేది 1861 లో విక్టోరియా మహారాణి స్థాపించిన ధైర్యసాహసాల ఆర్డరు. ఆర్డర్లో మూడు తరగతులున్నాయి:

 • నైట్ గ్రాండ్ కమాండర్ (GCSI)
 • నైట్ కమాండర్ (KCSI)
 • కంపానియన్ (CSI)
అర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా
నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా
Awarded by

Sovereign of the United Kingdom
Typeఆర్డర్ ఆఫ్ చివల్రీ
Established1861
MottoHeaven's Light Our Guide
Awarded forరాజు కృప మేరకు
Statusచివరిగా ఇచ్చినది: 1947
Dormant order since 2009
Founderవిక్టోరియా రాణి
సార్వభౌమఎలిజబెత్ 2
Grades
 • Knight Grand Commander (GCSI)
 • Knight Commander (KCSI)
 • Companion (CSI)
Former gradesనైట్ కంపానియన్
Precedence
Next (higher)ఆర్డర్ ఆఫ్ ది బాత్
Next (lower)ఆర్డర్ ఆఫ్ సెంట్ మైకెల్ అండ్ సెంట్ జార్జ్

స్టార్ ఆఫ్ ఇండియా రిబ్బను పట్టీ

1947 లో భారతదేశ విభజన తర్వాత 1948 కొత్త సంవత్సర పురస్కారాల తర్వాత ఎటువంటి నియామకాలు జరగలేదు. చిట్త చివరి నైట్, ఆళ్వార్ మహారాజా, 2009 లో మరణించడంతో, ఆర్డర్ నిద్రాణమైపోయింది. ఆర్డరు నినాదం "స్వర్గపు వెలుగే మాకు మార్గదర్శి" (హెవెన్స్ లైట్ అవర్ గైడ్). స్టార్ ఆఫ్ ఇండియా చిహ్నం, భారతీయ సామ్రాజ్యాన్ని సూచించే జెండాలశ్రేణికి ఆధారంగా కూడా ఉపయోగించబడింది.

ఈ ఆర్డరు బ్రిటిషు వారు ఇచ్చిన ధైర్యసాహసాల సీనియర్ అర్డర్ల క్రమంలో ఐదవది. మొదటి నాలుగు - ఆర్డర్ ఆఫ్ ది గార్టర్, ఆర్డర్ ఆఫ్ ది థిస్టిల్, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్, ఆర్డర్ ఆఫ్ ది బాత్‌. ఇవి బ్రిటిష్ రాజ్‌ ఇచ్చిన ఆర్డర్లలో సీనియర్ ఆర్డర్లు; వాటి కంటే జూనియర్ ఆర్డర్లు - "ఎమినెంట్ ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్", స్త్రీలకు ప్రత్యేకించిన "ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది క్రౌన్ ఆఫ్ ఇండియా" లు ఉన్నాయి

చరిత్ర మార్చు

1875 భారత తిరుగుబాటు ముగిసి, గ్రేట్ బ్రిటన్ భారతదేశంలో తన అధికారాన్ని సుస్థిరపరచుకున్న చాలా సంవత్సరాల తరువాత, బ్రిటిషు రాచరికం భారతీయ యువరాజులు, సంస్థానాధీశులు, అలాగే భారతదేశంలో పనిచేసిన బ్రిటిషు అధికారులు, నిర్వాహకులను గౌరవించడానికి కొత్త నైట్ హుడ్ ఆర్డర్‌ను రూపొందించాలని నిర్ణయించారు. 1861 జూన్ 25 న, విక్టోరియా రాణి ప్రకటనను జారీ చేసింది.

 
భారత వైస్రాయ్ జెండాలో ట్యూడర్ క్రౌన్ క్రింద స్టార్ ఆఫ్ ది ఆర్డర్‌ను ప్రదర్శించింది.

గ్రహీతలు మార్చు

 
ఒక భారత సంస్థానాధీశునికి ది స్టార్ ఆఫ్ ఇండియాను బహూకరిస్తున్న జార్జ్ V -1911 డిసెంబర్, 14 విలియం బార్న్స్ వోలెన్ ద్వారా

మొదటి నియమితులు:

 • ప్రిన్స్ కన్సార్ట్
 • వేల్స్ యువరాజు
 • ఎర్ల్ క్యానింగ్, GCB, గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలైటెడ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా
 • కొల్లాపూర్ షాహు, ఖోలాపూర్ మహారాజు
 • అఫ్జల్ అడ్-దవ్లా, అసఫ్ జా V , హైదరాబాద్ 5 వ నిజాము
 • జయజీరావు సింధియా, గ్వాలియర్ మహారాజా
 • మహారాజా దులీప్ సింగ్ , సిక్కు సామ్రాజ్యపు మాజీ మహారాజా
 • రణ్‌బీర్ సింగ్ డోగ్రా, జమ్మూ కాశ్మీర్ మహారాజా
 • తుకోజీరావు హోల్కర్, ఇండోర్ మహారాజా
 • నరేంద్ర సింగ్, మహారాజా ఆఫ్ పాటియాలా
 • ఖందర్‌రావు గైక్వాడ్, మహారాజా ఆఫ్ బరోడా
 • నేపాల్‌కు చెందిన మహారాజా బీర్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా
 • నవాబ్ సికందర్ బేగం, భోపాల్ నవాబ్ బేగం
 • యూసఫ్ అలీ ఖాన్ బహదూర్, రాంపూర్ నవాబ్
 • విస్కౌంట్ గౌ, భారత సైన్యం కమాండర్-ఇన్-చీఫ్
 • లార్డ్ హారిస్, మద్రాస్ గవర్నర్
 • లార్డ్ క్లైడ్, భారత సైన్యం కమాండర్-ఇన్-చీఫ్
 • సర్ జార్జ్ రస్సెల్ క్లర్క్, బొంబాయి గవర్నర్
 • సర్ జాన్ లైర్డ్ మైర్ లారెన్స్, Bt, GCB, లెఫ్టినెంట్-గవర్నర్ పంజాబ్
 • సర్ జేమ్స్ అవుట్రమ్, Bt, GCB, వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు
 • సర్ హ్యూ హెన్రీ రోస్, GCB, భారత సైన్యం యొక్క కమాండర్-ఇన్-చీఫ్
 • మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సిద్ధిఖీ బయాఫండి - అసఫ్ జా VII - హైదరాబాద్ 7 వ నిజాం
 • మహారాజ్ భీమ్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా 

1877 లో స్థాపించబడిన ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా యొక్క తక్కువ స్థాయి పురస్కారంగా ఉద్దేశించారు; పర్యవసానంగా, మునుపటి కంటే చాలా ఎక్కువ ప్రదానాలు ఈ అర్డరుకు జరిగాయి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్డర్ల చివరి ప్రదానాలు 1947 ఆగస్టులో భారతదేశ విభజన జరిగిన కొన్ని నెలల తర్వాత, 1948 కొత్త సంవత్సర పురస్కారాల్లో జరిగాయి. చివరి గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఆర్డర్‌, ఎర్ల్ మౌంట్‌బాటెన్. 1977 లో రాణి సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా, రెండు ఆర్డర్‌ల నైట్ గ్రాండ్ కమాండర్ నక్షత్రాలను బహిరంగంగా ధరించిన చివరి వ్యక్తి కూడా అతడే. [1]

ఆ ఆర్డర్లను అధికారికంగా ఎన్నడూ రద్దు చేయలేదు. ఎలిజబెత్ II తన తండ్రి జార్జ్ VI తరువాత 1952 లో సింహాసనాన్ని అధిష్టించినప్పుడు ఆమె ఆర్డర్‌ల సార్వభౌమ బాధ్యతలు చేపట్టింది. ఈ రోజు వరకు ఆమెయే సార్వభౌమాధికారిగా కొనసాగుతోంది. అయితే, ఆర్డర్‌ పొందిన వారిలో ఇప్పుడు ఎవరూ జీవించి లేరు.

 • ఆర్డర్‌ పొందినవారిలో మహిళలు ముగ్గురు మాత్రమే: సుల్తాన్ షాజహాన్, భోపాల్ బేగం, ఆమె కుమార్తె, హజ్జా నవాబ్ బేగం డామే సుల్తాన్ జహాన్, మేరీ ఆఫ్ టెక్ .
 • చివరి గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది ఆర్డర్, అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ ది ఎర్ల్ మౌంట్ బాటెన్ ఆఫ్ బర్మా (1900-1979) ను, 1979 ఆగస్టు 27 న IRA హత్య చేసింది.
 • చిట్ట చివరిగా మరణించిన నైట్ గ్రాండ్ కమాండర్, మహారాజా శ్రీ పద్మనాభదాస సర్ చితిర తిరునాల్ బలరామ వర్మ GCSI, GCIE, మహారాజా ఆఫ్ ట్రావెన్‌కోర్ (1912-1991), 1991 జూలై 19 న త్రివేండ్రంలో మరణించాడు. [2]
 • చివరిగా బ్రతికి ఉన్న నైట్ కమాండర్, మహారాజా సర్ తేజ్ సింగ్ ప్రభాకర్ బహదూర్ KCSI (1911-2009), అల్వార్ మహారాజా, 2009 ఫిబ్రవరి 15 న న్యూఢిల్లీలో మరణించాడు.
 • చివరిగా బ్రతికి ఉన్న కంపానియన్, వైస్ అడ్మిరల్ సర్ రోనాల్డ్ బ్రోక్మన్ CSI (1909-1999), 1999 సెప్టెంబర్ 3 న లండన్‌లో మరణించాడు.

కూర్పు మార్చు

 
స్టార్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ (వివరాలు) యొక్క పెట్టుబడి, జార్జ్ జాకోంబ్-హుడ్ ద్వారా. కింగ్ జార్జ్ V 1911 ఢిల్లీ దర్బార్‌లో బికనీర్ మహారాజా గంగా సింగ్‌కు GCSI ప్రదానం చేస్తున్నట్లు చిత్రీకరించబడింది

బ్రిటిష్ సార్వభౌముడు సార్వభౌమాధికారిగా ఉన్నాడు - ఇప్పటికీ. ఆ తర్వాత అత్యంత సీనియర్ సభ్యుడు గ్రాండ్ మాస్టర్, అధికార హోదాలో భారత వైస్రాయ్ ఉండే పదవి ఇది. 1861 లో ఆర్డర్‌ను స్థాపించినప్పుడు, KSI అనే పేరున్న నైట్స్ కంపానియన్ తరగతి ఒక్కటే ఉండేది. అయితే 1866 లో దీన్ని మూడు తరగతులుగా విస్తరించారు. ఆర్డర్‌లో నియమించబడిన క్రైస్తవేతర భారతీయుల మనోభావాలను కించపరచకుండా ఉండటానికి మొదటి తరగతిని "నైట్స్ గ్రాండ్ కమాండర్" (మామూలుగా ఉండే "నైట్స్ గ్రాండ్ క్రాస్" అని కాకుండా) అని అన్నారు. అప్పటికే నైట్స్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్‌గా ఉన్న సభ్యులందరినీ నైట్స్ గ్రాండ్ కమాండర్ అని పిలుపును మార్చారు.

మాజీ వైస్రాయ్‌లు, ఇతర ఉన్నతాధికారులు, అలాగే భారత దేశ కార్యదర్శి విభాగంలో కనీసం ముప్పై సంవత్సరాలు పనిచేసిన వారూ ఈ నియామకానికి అర్హులు. భారతీయ సంస్థానాల పాలకులు కూడా నియామకానికి అర్హులు. కొన్ని సంస్థానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాటి పాలకులకు దాదాపు ఎల్లప్పుడూ నైట్స్ గ్రాండ్ కమాండర్ నియామకం లభిస్తూండేది; అలాంటి పాలకులలో హైదరాబాద్ నిజాం, మైసూర్ మహారాజా, జమ్మూ కాశ్మీర్ మహారాజా, బరోడా మహారాజా, గ్వాలియర్ మహారాజులు, భోపాల్ నవాబు, ఇండోర్ మహారాజా , ఉదయ్పూర్ మహారాణా, ట్రావెన్‌కోర్ మహారాజా , మహారాజా ఆఫ్ జోధ్పూర్, కచ్ మహారావు ఉన్నారు.

కాశీ రాజు ప్రభు నారాయణ్ సింగ్ 1892 లోను, సర్ అజీజుల్ హక్ 1941 లోనూ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (KCIE) గా నియమితులయ్యారు. అలాగే కాశీ రాజు 1898 లో నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (GCIE) అయ్యాడు. అజీజుల్ హక్, మొదటి ప్రపంచ యుద్ధంలో చేసిన సేవలకు గాను, 1921 న్యూ ఇయర్ ఆనర్స్‌లో నైట్ గ్రాండ్‌ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (GCSI) అయ్యాడు.

ఆసియా, మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాల పాలకులు - కువైట్ ఎమిర్ , రాణా రాజవంశానికి చెందిన మహారాజులు, ఈజిప్ట్ఉకు చెందిన ఖేదీవ్, భూటాన్ రాజు, జాంజిబార్, బహ్రెయిన్, ఒమన్ పాలకులు - కూడా ఆర్డర్‌ పొందారు. కొంతమంది సంస్థానాధీశుల వలెనే, కొన్ని వంశాలకు చెందిన పాలకులు - ఉదాహరణకు రాణా రాజవంశంలోని మహారాజులు లేదా ఒమన్ సుల్తానులు - సాధారణంగా నైట్స్ గ్రాండ్ కమాండర్లుగా నియమించబడేవారు.

మహిళలు - సంస్థాన పాలకులు మినహాయింపు - ఆర్డర్‌ నియామకానికి అనర్హులు. అనేక ఇతర ఆర్డర్‌ల లాగా వారిని "డేమ్స్" అని లేదా "లేడీస్" అనీ కాకుండా, ఈ ఆర్డర్లో "నైట్స్" అని అంటారు. ఈ ఆర్డరు పొందిన తొలి మహిళ నవాబ్ సికందర్ బేగం సాహిబా, భోపాల్‌కు చెందిన నవాబ్ బేగం; 1861 లో ఆమె నైట్ కంపానియన్‌ అయింది. 1911 లో క్వీన్ మేరీని నైట్ గ్రాండ్ కమాండర్‌గా అనుమతించడానికి ఆర్డర్ శాసనాలను ప్రత్యేకంగా సవరించారు.

ప్రాధాన్యత, విశిష్టత మార్చు

ఆర్డర్‌లోని అన్ని తరగతుల సభ్యులకు ప్రాధాన్యత క్రమంలో స్థానాలు కేటాయించబడ్డాయి. అన్ని తరగతుల సభ్యుల భార్యలకు కూడా ప్రాధాన్యత క్రమం ఉంది. సభ్యుల కుమారులు, కుమార్తెలు, కోడళ్ళకు కూడా ప్రాధాన్యతా క్రమం ఉంది.

నైట్స్ గ్రాండ్ కమాండర్లు తమ పేరు తరువాత "GCSI" అనే పొడిపదాలను వడేవారు. నైట్స్ కమాండర్లు "KCSI" అని, కంపానియన్లు "CSI" అనీ వాడేవారు. నైట్స్ గ్రాండ్ కమాండర్లు, నైట్స్ కమాండర్లు వారి పేర్లకు ముందు "సర్" అని పెట్టుకుంటారు. నైట్స్ గ్రాండ్ కమాండర్లు, నైట్స్ కమాండర్ల భార్యలు వారి ఇంటిపేర్లకు ముందు "లేడీ" అని చేర్చుకుంటారు. అలాంటి రూపాలను సహచరులు, భారతీయ యువరాజులు ఉపయోగించరు -పేర్లను వాటి పూర్తి రూపాల్లో రాసినపుడు తప్ప.

మూలాలు మార్చు

 1. Vickers, Hugo (1994). Royal Orders. Great Britain: Boxtree Limited. p. 140. ISBN 1852835109.
 2. Vickers, Hugo (1994). Royal Orders. Great Britain: Boxtree Limited. p. 140. ISBN 1852835109.