సర్వదమన్ బెనర్జీ
సర్వదమన్ బెనర్జీ తెలుగు వారికి సిరివెన్నెల సినిమాతో పరిచయమైన భారతీయ సినిమా నటుడు. జన్మతః బెంగాలీ. కలకత్తా వాసి. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న సిరివెన్నెల సినిమాలో అంధ వేణు విద్వాంసుడైన హరిప్రసాద్గా బెనర్జీ నటన పలువురి మన్ననలు పొందినది. ఈయన ప్రముఖ కన్నడ దర్శకుడు జీ.వీ.అయ్యర్ తీసిన ప్రప్రధమ సంస్కృత చిత్రము ఆది శంకరాచార్యతో సినీ రంగములో ప్రవేశించాడు. బుల్లితెరపై కృష్ణ ధారావాహికలో కృష్ణగా నటించాడు.
సర్వదమన్ బెనర్జీ | |
రామానంద్‌సాగర్ తీసిన శ్రీకృష్ణ ధారావాహికలో శ్రీకృష్ణ పాత్రలో సర్వదమన్ బెనర్జీ | |
జన్మ నామం | సర్వదమన్ బెనర్జీ |
జననం | |
ప్రముఖ పాత్రలు | సిరివెన్నెల |
రామానంద్‌సాగర్ సృష్టించిన శ్రీకృష్ణతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన బెనర్జీ. ఓం నమశ్శి వాయ, జై గంగామాయ, అర్జున, ఓ ప్రేమ కథ తదితర చిత్రాల్లోనూ నటించారు. తొలి తెలుగు సినిమాతోనే నంది అవార్డును అందుకున్న ఈ విలక్షణ నటుడు, సంస్కృతంతో సహా పలు భాషల సినిమాల్లో తనదైన అభినయముద్ర వేసిన అరుదైన సినీ కళాకారుడు.
36 ఏళ్ల వయసులో సినిమాల నుంచి నిష్ర్క మించిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక కేంద్రమైన హృషికేష్‌కు తన మకాం మార్చాడు. కుటుంబ సమేతంగా హృషికేష్లో నివసిస్తూ అక్కడ ఉన్న రాజాజీ నేషనల్ పార్క్‌లో యోగా, ధ్యానం నేర్పించే పనిచేపట్టాడు. ‘‘ప్రపంచానికి ప్రేమను, వెలుగును పంచడమే నా లక్ష్యం’’ అంటూ ఫేస్‌బుక్ పేజీలో చెప్పుకున్నాడు.[1]
సినిమాలు
మార్చు- ఆది శంకరాచార్య (1983) - (ఆది శంకరాచార్య)
- శ్రీదత్త దర్శనం (1986) - (శ్రీదత్త)
- సిరివెన్నెల (1986) - (పండిత్ హరిప్రసాద్)
- స్వయంకృషి (1987) - (భాస్కర్)
- ఓ ప్రేమ కథ (1987)
- వివేకానంద (1994) - (వివేకానంద)
- గాడ్ ఫాదర్ (2022) సీఎం పద్మకాంత్ రెడ్డి "PKR"
- లక్కీ భాస్కర్ (2024)