స్వయంకృషి
స్వయంకృషి 1987లో విడుదలైన ఒక తెలుగు సినిమా. శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. సున్నితమైన పాత్రలో చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. కథలో ఇమిడేలాగా ప్రేమ పాటలు, ఫైట్లు కూడా చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.[1]
స్వయంకృషి (1987 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
నిర్మాణం | ఏడిద నాగేశ్వరరావు, ఏడిద రాజా |
కథ | కె.విశ్వనాథ్ |
చిత్రానువాదం | కె.విశ్వనాధ్ |
తారాగణం | చిరంజీవి, విజయశాంతి, సుమలత, మాస్టర్ అర్జున్, సర్వదమన్ బెనర్జీ, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, పి.ఎల్.నారాయణ |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
నిర్మాణ సంస్థ | పూర్ణోదయా మూవీ క్రియెషన్స్ |
విడుదల తేదీ | 1987 సెప్టెంబరు 3 |
నిడివి | 164 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంక్షిప్త కథ సవరించు
సాంబయ్య (చిరంజీవి) అనే చెప్పులు కుట్టుకొనే, చదువురాని వ్యక్తి కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. తన కృషిలో సహచరిణి అయిన గంగ (విజయశాంతి)ని పెళ్ళి చేసుకొంటాడు. శారద (సుమలత) అనే అమ్మాయిని చదివించి ప్రయోజకురాలిని చేస్తాడు. చని పోయిన తన చెల్లెలు కొడుకు చిన్నా (అర్జున్ / శిరీష్)ను తన స్వంత కొడుకులా పెంచుతాడు. చిన్నా పెంపకానికి అడ్డు రాకూడదని గంగ తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొంటుంది. చదువు విలువ తెలిసిన సాంబయ్య గంగను చదువుకోమని బలవంతం చేస్తుంటాడు.
తరువాత కథలో కొన్ని మలుపులు తిరుగుతాయి. ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్నా తనకు చెప్పులు తుడుచుకోవడం, స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయకష్టపు పనులంటే అసహ్యమని మొరాయిస్తుంటాడు. చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ (చరణ్ రాజ్), శారద భర్త (బెనర్జీ) కలిసి సాంబయ్య ఇంటిలో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. చివరికి చిన్నాను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్నా పేరుమీద వ్రాసి (ప్రత్యర్ధులకు అప్పగించి) సాంబయ్య, గంగ మళ్ళీ చెట్టుకింద చెప్పులు కుట్టుకొనే వృత్తి చేపడతారు. తన తప్పు తెలుసుకొన్న చిన్నా ఆ ఎదురు చెట్టు క్రింద చెప్పులు కుట్టడానికి గుడ్డ పరచుకొంటాడు.
తారాగణం సవరించు
- చిరంజీవి - సాంబయ్య
- విజయశాంతి - గంగ
- సుమలత - శారద
- మాస్టర్ అర్జున్ - చిన్న
- చరణ్రాజ్ - గోవింద్
- సర్వదమన్ బెనర్జీ - భాస్కర
- జె.వి. సోమయాజులు
- బ్రహ్మానందం
- పి.ఎల్. నారాయణ
- ఎస్.కె. మిశ్రో
- ఎం. వి. ఎస్. హరనాథ రావు - గంగ తండ్రి
- చంద్రమౌళి
సంగీతం సవరించు
అన్ని పాటల రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది రమేష్ నాయుడు.
క్రమసంఖ్య | పేరు | గానం | నిడివి |
---|---|---|---|
1. | "సిన్ని సిన్ని కోరికలడగ" | ఎస్.జానకి | |
2. | "పారాహుషార్" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | |
3. | "సిగ్గూ పూబంతి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ | |
4. | "హలో హలో డార్లింగ్" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
విశేషాలు సవరించు
- చిరంజీవికి అప్పటికి ఉన్న ఇమేజికి ఈ చిత్రం లో ని పాత్ర ఒక ప్రయోగం, సాహసం.
- అట్టా సూడమాకయ్యా అని విజయశాంతి బుంగమూతి పెట్టి శృంగార రసం ఒలికించటం ఈ చిత్రంలో ఒక విశేషం.
అవార్డులు సవరించు
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1987 | చిరంజీవి | నంది ఉత్తమ నటులు | Won |
ప్రభావం సవరించు
ఈ సినిమా ప్రభావంతో ఏలూరులో ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే కార్మికుడు తన దుకాణానికి "స్వయంకృషి" అని పేరు పెట్టుకొన్నాడు.
మూలాలు సవరించు
- ↑ "Swayam Krushi (1987)". Indiancine.ma. Retrieved 2021-06-10.