సర్సోం దా సాగ్ (హిందీ, ఉర్దూ భాషలలో "సర్సోం కా సాగ్") భారత దేశంలోని పంజాబ్ ప్రాంతంలోని శాకాహార వంటకం. ఇది పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధమైనది. దీనిని ఆవాల ఆకుల నుండి తయారుచేస్తారు.

సర్సోం దా సాగ్
మక్ఖీ దీ రోటీ తో సర్సోం దా సాగ్
మూలము
ప్రదేశం లేదా రాష్ట్రంభారత ఉపఖండంలోని పంజాబీ ప్రాంతం
వంటకం వివరాలు
వడ్డించే విధానంముఖ్యాహారం
ప్రధానపదార్థాలు ఆవాల ఆకులు

ఈ వంటకాన్ని సాంప్రదాయకంగా "మఖీ ది రోటీ" తో పాటు తింటారు.[1] దీనిపై బట్టరును గానీ, సాంప్రదాయకంగా నెయ్యిని గానీ రాసుకుని తింటారు.[2]

కావలసిన పదార్థాలు మార్చు

తయారీ విధానము మార్చు

ఆవ ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, చల్లార్చి... మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి. అల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేయించాలి. తరువాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న ఆవకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. చివర్లో పైన చెప్పుకున్న పోపు సామానులతో పోపుపెట్టి ఆవకూరకు కలపాలి. అంతే రుచికరమైన సర్సోం కా సాగ్ తయారైనట్లే...! ఇది రోటీలలోకి చాలా రుచిగా ఉంటుంది.[3]

మూలాలు మార్చు

  1. Laveesh Bhandari, Sumita Kale, "Indian states at a glance, 2008-09: Punjab : performance, facts and figures", Pearson Education India, 2009, ISBN 81-317-2345-3, section 4.7.2
  2. Jiggs Kalra, Pushpesh Pant, "Classic Cooking Of Punjab",tumhari aisi kitasi Allied Publishers, 2004, ISBN 81-7764-566-8, page 42.
  3. సార్సన్ కా సాగ్[permanent dead link]