సర్ హెన్రీ రస్సెల్, రెండవ బారోనెట్

సర్ హెన్రీ రస్సెల్, రెండవ బారోనెట్ (27 మే 1783-19 ఏప్రిల్ 1852) ఒక ఆంగ్ల దౌత్యవేత్త, భూస్వామి. 1810 నుండి 1820 వరకు హైదరాబాదు రాజ్యంలో బ్రిటీషు రెసిడెంటుగా పనిచేశాడు.

సర్ హెన్రీ రస్సెల్, బారొనెట్
జననంమూస:Birthdate
మరణం19 ఏప్రిల్ 1852(1852-04-19) (aged 68)
స్వాలోఫీల్డ్ పార్క్
వృత్తిదౌత్యవేత్త
భార్య / భర్త
జేన్ అమీలియా కాసమయోర్
(m. invalid year; మరణం 1808)
మరీ క్లొటిల్డె దె లాఫాంటేన్
(m. invalid year; మరణం 1852)
పిల్లలుసర్ చార్లెస్ రస్సెల్, మూడవ బారోనెట్, సర్ జార్జ్ రస్సెల్, నాలుగవ బారోనెట్ తో సహా ఏడుగురు
తల్లిదండ్రులుసర్ హెన్రీ రస్సెల్, మొదటి బారోనెట్
ఆన్న్ బార్బరా విట్‌వర్త్
బంధువులుసర్ చార్లెస్ విట్‌వర్త్ (తాత - అమ్మ వైపు నుండి)
చార్లెస్ విట్‌వర్త్, మొదటి అర్ల్ ఆఫ్ విట్‌వర్త్ (మేనమామ)

ప్రారంభ జీవితం

మార్చు

రస్సెల్, 1783 మే 27న జన్మించాడు. ఈయన సర్ హెన్రీ రస్సెల్, మొదటి బారోనెట్, ఆయన రెండవ భార్య ఆన్న్ బార్బరా విట్‌వర్త్ యొక్క పెద్ద కుమారుడు.[1] ఈయన తోబుట్టువులలో చార్లెస్ రస్సెల్ (రెడింగ్ స్థానానికి పార్లమెంటు సభ్యుడు), ఫ్రాన్సిస్ విట్‌వర్త్ రస్సెల్ (జేన్ ఆన్న్ కేథరీన్ బ్రోడీ పెళ్లి చేసుకున్నాడు), రెవరెండ్. విట్‌వర్త్ రస్సెల్ (ఫ్రాన్సిస్ కార్పెంటర్‌ను వివాహం చేసుకున్నాడు), జార్జ్ లేక్ రస్సెల్ (మొదటి అర్ల్ ఆఫ్ లిమరిక్ కూతురు, లేడీ కారోలైన్ పెరీని వివాహం చేసుకున్నాడు), హెన్రియెట్టా రస్సెల్ (విట్టింగ్‌టన్ హాల్‌కు చెందిన థామస్ గ్రీన్‌ను వివాహం చేసుకున్నది) ఉన్నారు.[2][3][3]

ఈయన తండ్రి యొక్క తల్లితండ్రులు డోవర్‌కు చెందిన మైఖేల్ రస్సెల్, హాన్నా హెన్షా (హెన్రీ హెన్షా కుమార్తె). ఈయన తల్లి సర్ చార్లెస్ విట్‌వర్త్ యొక్క ఐదవ కుమార్తె. హెన్రీ రస్సెల్ మేనమామ చార్లెస్ విట్‌వర్త్, విట్‌వర్త్ యొక్క మెదటి అర్ల్.[3]

వృత్తిజీవితం

మార్చు
 
హెన్రీ రస్సెల్ యొక్క ముద్ర రెండు భాగాలుగా తయారు చేయబడింది. ముద్రను 1804/5 లో హైదరాబాద్లో తయారుచేశారు, అయితే పట్టకాన్ని మాత్రం 19వ శతాబ్దపు మధ్య ప్రాంతంలో ఐరోపాలో, బహుశా బ్రిటన్లో తయారు చేశారు. హైదరాబాదులో ఉన్నప్పుడు రస్సెల్ పచ్చ మరకతపు ముద్రను అందుకున్నాడు. నస్తలిక్ లిపిలోని మూడు పంక్తుల శాసనం ఇలా సాగుతుంది: ఇంతిజామ్ అల్-ముల్క్ ఇ 'తిమాద్ అల్-దౌలా హెన్రీ రస్సెల్ నాయిబ్ జంగ్ బహదూర్ 1219 (' ది వాలియంట్, ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది కింగ్డమ్, ది పిల్లర్ ఆఫ్ ది స్టేట్, హెన్రీ రసెల్, డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్, హి.శ.1219 [క్రీ.శ. 1804-5]

1798 నుండి 1805లో మరణించే వరకు హైదరాబాదు, బేరార్ ను పాలించిన నిజాం ఆస్థానంలో బ్రిటిష్ రెసిడెంటు అయిన జేమ్స్ అఖిల్స్ కర్క్‌పాట్రిక్ వద్ద రస్సెల్ ఆంతరంగిక కార్యదర్శిగానూ, సహాయకుడిగానూ పనిచేశాడు. విలియం డాల్రింపుల్ రాసిన 2002 నాటి బ్రిటిష్ ఇండియా చరిత్ర, వైట్ మొఘల్స్ గ్రంథాలలో రస్సెల్ వృత్తి జీవితం గురించి కొంత వివరంగా చర్చించబడింది. అందులో ఈయన ప్రతిభావంతుడు కానీ బలహీనమైన దౌత్యవేత్తగా చిత్రీకరించబడ్డాడు. రస్సెల్ కర్క్‌పాట్రిక్ వితంతువు, హైదరాబాదీ కులీన మహిళ అయిన ఖైరున్నీసాను ఆకర్షించాడు, కానీ కొంతకాలం తర్వాత ఆమెను విడిచిపెట్టాడు.[4][5] ఆ తరువాత ఈయన 1809లో పూణేలోని పేష్వా ఆస్థానానికి స్వయానా రెసిడెంటుగా నియమించబడ్డాడు. ఆ తరువాత సంవత్సరం, ఇంతకు క్రితం కర్క్‌పాట్రిక్ పదవైన, హైదరాబాదులోని బ్రిటీషు రెసిడెంటుగా పదోన్నతి పొందాడు. 1810 నుండి 1820 వరకు ఆ హోదాలో పనిచేశాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు తలెత్తినపుడు, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిగి, అవమానకరంగా పదవినుండి తొలగించబడటాన్ని నివారించడానికి రస్సెల్ రాజీనామా చేశాడు. £3,400 వార్షిక జీతంతో, ఈయన 10 సంవత్సరాలలో £85,000 సంపదను కూడగట్టగలిగాడు.[4] పదవీ విరమణ తర్వాత ఈయన మొదట బెడ్‌ఫోర్డ్‌షైర్లోని సట్టన్ పార్కులో, ఆ తరువాత ఎక్సెటర్లోని నిర్మాణశైలిపరంగా గుర్తించదగిన జాబితాలో నమోదు చేయబడిన భవనం అయిన సదరన్‌హే హౌస్లో నివసించాడు. ఇది స్తంభాలతో కూడిన వైభవంతో, కొత్తగా నిర్మించిన, స్వతంత్రంగా ఉన్న, సాంప్రదాయక భవనం. [4]

1820లో రస్సెల్ కుటుంబం, ఆయన తండ్రి మొదటి బారోనెట్‌తో పాటు, ఆయన ఇద్దరు అత్యంత సంపన్నవంతమైన కుమారులు, చార్లెస్, సర్ హెన్రీ (తరువాత రెండవ బారోనెట్) వారి వనరులను సమీకరించి, బర్క్‌షైర్లోని రెడింగ్‌కు సమీపంలో ఉన్న స్వాలోఫీల్డ్ పార్కును కొనుగోలు చేశారు. అక్కడ వారు, వారి వారసులు 150 సంవత్సరాలకు పైగా నివసించారు.[6]

అవినీతి వివాదం

మార్చు

హైదరాబాద్ బ్యాంకింగ్ సంస్థ అయిన పామర్ అండ్ కంపెనీ తరపున భారత గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పాక్షికంగా వ్యవహరించారని ఆరోపించిన అవినీతి కుంభకోణంలో, హెన్రీ రస్సెల్, ఆయన సోదరుడు చార్లెస్ రస్సెల్ (1786-1856) చిక్కుకున్నారు. స్థానిక యువరాజులకు రుణాలు ఇవ్వడంపై నిషేధం నుండి ఈ సంస్థను మినహాయించాలని 1816లో హేస్టింగ్స్ తీసుకున్న నిర్ణయం ద్వారా, ఈ సంస్థ నేరుగా హైదరాబాద్ నిజాం మీర్ అక్బరు అలీ ఖాన్ తో జరిపిన లావాదేవీలలో రస్సెల్స్ సోదరుల ప్రమేయం ఉండి, లాభం పొందారని కనుగొనబడింది. హెన్రీ రస్సెల్‌ తర్వాత ఆయన పదవిని చేపట్టిన సర్ చార్లెస్ మెట్‌కాఫ్ 1820లో మోసపూరితంగా కల్పించిన రుణాన్ని కనుగొన్నాడు.[7][8][9]

వ్యక్తిగత జీవితం

మార్చు
 
సర్ థామస్ లారెన్స్ గీసిన హెన్రీ రస్సెల్ యొక్క రెండవ భార్య మేరీ క్లొటిల్డే మోట్టె దె లా ఫాంటేన్, చిత్రం

1808 అక్టోబరులో రస్సెల్ మద్రాసులో జాన్ కాసమజోర్ కుమార్తె జేన్ అమీలియా కాసమజోర్‌ను వివాహం చేసుకున్నాడు. వారు వివాహం చేసుకున్న రెండు నెలలకే జేన్ అకస్మాత్తుగా మరణించింది.

1816 నవంబరు 13న, ఈయన ఫ్రెంచి కాథలిక్ అయిన మేరీ క్లొటిల్డే మోట్టె దె లాఫాంటేన్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె బెన్వా మోట్టె దె లాఫాంటేన్, బారన్ ఫీఫ్ దె సెయింట్ కార్నెయిల్, పాండిచ్చేరి చివరి ఫ్రెంచి గవర్నర్ కుమార్తె. ఫ్రెంచి రాజరిక బాలబాలికల అధికారిక నర్సు, ముఖ్యంగా 1785 నుండి 1792 వరకు <i id="mwTw">డాఫిన్</i> బాధ్యత వహించిన, అగాథే దే రాంబౌద్, ఈమెకు సమీప బంధువు.[10] మేరీ క్లొటిల్డేతో హెన్రీ రస్సెల్ ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారు:

  • హెన్రీ రస్సెల్ (1819-1847), కైరోలో అవివాహితుడిగా మరణించాడు.[3]
  • అన్నే రస్సెల్ (1820-1902), స్వాలోఫీల్డ్ పార్కులో అవివాహితగా మరణించింది.[3]
  • మేరీ రస్సెల్ (1822-1894), ఆమె బంధువు, 1856లో విట్టింగ్టన్ హాల్ యొక్క పార్లమెంటు సభ్యుడు థామస్ గ్రీన్ కుమారుడైన డాసన్ కార్నెలియస్ గ్రీన్‌ను వివాహం చేసుకున్నారు.[3]
  • సర్ చార్లెస్ రస్సెల్, మూడవ బారోనెట్ (1826-1883), రాజకీయవేత్త, విక్టోరియా క్రాస్ యొక్క ప్రారంభ గ్రహీత. ఈయన ఎన్నడూ వివాహం చేసుకోలేదు.[3]
  • సర్ జార్జ్ రస్సెల్, నాలుగవ బారోనెట్ (1828 -1898) - న్యాయవాది, రికార్డర్ అయిన ఈయన [ID1] లార్డ్ ఆర్థర్ లెనాక్స్ (1867లో 4వ డ్యూక్ ఆఫ్ రిచ్మండ్ కుమారుడు) [3] కుమార్తె కాన్స్టాన్స్ లెనాక్స్‌ను వివాహం చేసుకున్నాడు.[11]
  • ప్రిస్సిల్లా రస్సెల్ (1830-1924), 1865లో రెవరెండ్. జోసెఫ్ బ్రాకెన్‌బరీ కుమారుడు, లిస్బన్ రాయబారి అయిన జార్జ్ బ్రాకెన్‌బరీని వివాహం చేసుకున్నది.[3]

సర్ హెన్రీ 1852 ఏప్రిల్ 19న స్వాలోఫీల్డ్లో మరణించాడు. ఈయన తరువాత ఈయన పెద్ద కుమారుడు, చార్లెస్, అధికార బాధ్యతలు స్వీకరించాడు.[12] 1883లో చార్లెస్ అవివాహితుడిగా మరణించిన తరువాత, వంశానుగుణంగా సంక్రమించే బారోనెట్ పదవి, సర్ హెన్రీ యొక్క జీవించి ఉన్న కుమారుల్లో ప్జార్జ్ కు బదిలీ చేయబడింది.

చట్టవిరుద్ధమైన కుమార్తె

మార్చు

తన మొదటి భార్య మరణించిన తరువాత, తన రెండవ భార్యతో వివాహానికి ముందు, రస్సెల్ ఒక స్థానిక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు, దీని ఫలితంగా ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు 1815లో మేరీ విల్సన్ అని పేరు పెట్టాడు. హెన్రీ రస్సెల్ పదవీ విరమణ పొందిన తర్వాత, ఈ అమ్మాయిని ఇంగ్లాండుకు తీసుకుని వచ్చి, చాలా గోప్యంగా పెచ్చి పెద్దచేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సర్ హెన్రీ స్నేహితుడు మేజర్ రాబర్ట్ పిట్మన్ మధ్యవర్తిగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించాడు. హెన్రీ రస్సెల్ ఆమెకు క్రమం తప్పకుండా భత్యం అందేలా చూశాడు, కానీ మేజర్ పిట్మన్‌కు, ఆమె తండ్రి గుర్తింపును ఆమెకు చెప్పడానికి నిరాకరించాడు. మేరీ 1839లో రెవరెండ్ విలియం లాంగ్స్టన్ కాక్స్‌హెడ్‌ను వివాహం చేసుకున్నది. ఆయన ఎసెక్స్‌లోని కిర్బీ లే సోకెన్‌కు అధిపతిగా ఉన్నాడు.[13]

మూలాలు

మార్చు
  1. "Lady Russell and son c.. 1786 by George Romney. Oil on canvas. George Romney b. 1734 d.1802, was now… | 18th century fashion, Rococo fashion, 18th century portraits".
  2. Fisher, David R. "RUSSELL, Charles (1786-1856), of 27 Charles Street, St. James's Square, Mdx". www.historyofparliamentonline.org. History of Parliament Online. Retrieved 21 February 2024.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Mosley, Charles, editor. Burke's Peerage, Baronetage & Knightage, 107th edition, 3 volumes. Wilmington, Delaware: Burke's Peerage (Genealogical Books) Ltd, 2003, volume 3, pp. 3442-3443.
  4. 4.0 4.1 4.2 Dalrymple, William (2002). White Mughals: love and betrayal in eighteenth-century India. Penguin Books. ISBN 0-14-200412-X.
  5. Chatterjee, Indrani (2004). Unfamiliar Relations: Family and History in South Asia. Rutgers University Press. p. 147. ISBN 0813533805.
  6. Finn, Margot; Smith, Kate (2018). The East India Company at Home, 1757-1857. London: UCL Press. ISBN 978-1-78735-029-8.
  7. "The Nizam-era banking scandal which shocked Hyderabad - Suno India". 15 February 2020.[permanent dead link]
  8. "The Gazetteers Department - Wardha". Cultural.maharashtra.gov.in. Retrieved 2022-05-14.
  9. Fisher, David R. (2009). "RUSSELL, Charles (1786–1856), of 27 Charles Street, St. James's Square, Mdx". The History of Parliament. Retrieved 29 November 2018.
  10. Titled berceuse des enfants de France.
  11. published three books, "Three Generations of Fascinating Women and other Sketches from Family History" published by Longmans, Green and Co. 1905; "Swallowfield and Its Owners" 1901; "The Rose Goddess and other sketches of Mystery and Romance" 1910
  12. "READING". Jackson's Oxford Journal (in ఇంగ్లీష్). 24 Apr 1852. p. 3. Retrieved 21 February 2024.
  13. "Correspondence between Sir Henry Russell (1783-1852), Major Robert Pitman and Mary Wilson" (PDF). www.ourmigrationstory.org.uk. Manuscripts division of the Bodleian Library, Oxford. Retrieved 21 February 2024.