బ్రిటీషు రెసిడెన్సీ, హైదరాబాదు

బ్రిటీషు రెసిడెన్సీ (హైదరాబాదు రెసిడెన్సీ, కోఠి రెసిడెన్సీ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న భవనం. 1798లో నిర్మించబడిన ఈ భవనం, ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

బ్రిటీషు రెసిడెన్సీ
సాధారణ సమాచారం
రకంఅంబాసిడర్ రెసిడెన్స్
నిర్మాణ శైలిజార్జియన్ పల్లాడియన్
ప్రదేశంకోఠి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°23′01″N 78°29′05″E / 17.3837248°N 78.4847522°E / 17.3837248; 78.4847522
పూర్తి చేయబడినదిసిర్కా 1798
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిశామ్యూల్ రస్సెల్

చరిత్ర

మార్చు

తొలినాళ్ళలో బ్రిటీషు వారు నిజాం ప్రభువులు ఇచ్చిన భవనాల్లో ఉండేవారు. 1798-1805 మధ్యకాలంలో హైదరాబాదులో 5వ బ్రిటీషు రెసిడెంట్ గా ఉన్న జేమ్స్ ఆచిల్లెస్ కిర్క్ పాట్రిక్ తన హోదాకు సరిపడ భవన నిర్మాణంకోసం మూసీ నది సమీపంలో 60 ఎకరాల స్థలం కావాలని నిజాంను కొరాడు. ఆ కోరికను మన్నించి నిజాం ప్రభువు, తన సొంత ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించాడు. బ్రిటీషు రాయల్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శామ్యూల్ రసెల్ రూపకల్పనలో 1803లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది.[2][3]

నిర్మాణం

మార్చు
 
1880లో లాలా దీన్ దయాళ్ తీసిన బ్రిటీషు రెసిడెన్సీ ఛాయాచిత్రం
 
బ్రిటీషు రెసిడెన్సీ యొక్క అర్చి వీధి ద్వారం, 1908 మూసీ వరదల్లో సగందాకా నీటిలో మునిగి ఉన్న దృశ్యం

క్లాసికల్ పోర్టికోతో ఉన్న ఈ భవనం జార్జియన్ పల్లాడియన్ విల్లా శైలిలో, యునైటెడ్ స్టేట్స్ లోని వైట్ హౌజ్ ను పోలి ఉంది. రెసిడెన్సీలోని ప్రధాన హాలుకు ముందు సుమారు 60 అడుగుల పొడవు గల 22 పాలరాతి మెట్లు ఉన్నాయి. రెసిడెన్సీ పోర్టికో ముందుభాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనమిది పిల్లర్లు నిర్మించబడ్డాయి. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపులా సింహాల విగ్రహాలు, దర్బార్ హాల్లో శిల్పాలు, 60 అడుగుల ఎత్తైన పైకప్పుపై చిత్రించిన తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి.

రెసిడెన్సీ భవనం ప్రక్కన బ్రిటీషు అధికారులకోసం ఆఫీసు గదులు, నివాస గృహాలు ఉన్నాయి. భారత స్వాతంత్ర్యోద్యమములో 1857 తిరుగుబాటు సందర్భంగా ఉద్యమకారులు రెసిడెన్సీపై దాడిచేయడంతో రెసిడెన్సీ చుట్టూ ఎత్తైన రాతిగోడను నిర్మించారు.

బ్రిటీషు రెసిడెంట్ల జాబితా

మార్చు
 
Photos and names (Telugu and English) of British Residents of Hyderabad

1786 నుండి 1947 వరకు హైదరాబాదు రాజ్యంలో 34 మంది బ్రిటీషు రెసిడెంట్లుగా ఉన్నారు.[4]

  1. జాన్ కెన్నవే (1788 - 1794)
  2. మేజర్ జనరల్ విలియం కిర్క్‌పాట్రిక్ (1794–1797)
  3. మేజర్ జేమ్స్ అఖిల్స్ కిర్క్‌పాట్రిక్ (1797–1805) (రెసిడెన్సీ ఈయన సమయంలో కట్టబడింది)
  4. కాప్టెన్ థామస్ సైడెన్‌హామ్ (1806–1810)
  5. సర్ హెన్రీ రస్సెల్ (1811–1820)
  6. కల్నల్ మార్టిన్ (1825 - 1830)
  7. కల్నల్ స్టూవర్ట్ (1830 - 1838)
  8. జనరల్ జె.ఎస్.ఫ్రేజర్ (1838 - 1852)
  9. కల్నల్ కుత్బర్ట్ డేవిడ్‌సన్ (1852 - 1853, 1853, 1825 - 1835)
  10. జనరల్ సర్ జాన్ లో (1853)
  11. జి.ఏ.బుష్‌బీ (1853 - 1856)
  12. కల్నల్ విలియం థార్న్‌హిల్ (1856 - 1857)
  13. సర్ జార్జ్ యూల్ (1863)
  14. అర్ రిచర్ట్ టెంపుల్ (1867–1868)
  15. హెచ్.ఏ.రాబర్ట్స్ (1868)
  16. జే.జి.కార్డెరీ (1868, 1883 - 1884, 1886)
  17. సి.బి.సౌండర్స్ (1868–1872, 1872 - 1875)
  18. సర్ రిచర్డ్ మీడ్ (1876–1881)
  19. సర్ స్టూవర్ట్ బేలీ (1881 - 1882)
  20. డబ్యూ.బి.జోన్స్ (1882 - 1883)
  21. ఏ.పి.హౌవెల్ (1888 - 1889)
  22. సర్ డెన్నిస్ ఫిట్జ్‌పాట్రిక్ (1889 - 1891)
  23. సర్ ట్రెవర్ చిచేలే ప్లౌడెన్[5] (1891 - 1900)
  24. కల్నల్ మెకెంజీ (1899)
  25. సర్ డేవిడ్ బార్ (1900 - 1905)
  26. సర్ చార్లెస్ బేలీ (1905 - 1908)
  27. మైఖెల్ ఓడయ్యర్ (1908–1911)
  28. కల్నల్ అలెగ్జాండర్ పిన్హీ (1911–1916)
  29. సర్ స్టూవర్ట్ ఫ్రేజర్ (1914, 1916–1919)
  30. సర్ చార్లెస్ రస్సెల్ (1919–1924)
  31. సర్ విలియం బార్టన్ (1924 - 1930)
  32. సర్ టెరెన్స్ కీస్ (1930 - 1933)
  33. సర్ డంకన్ జార్జ్ మెకెంజీ (1934–1938)
  34. సర్ ఆర్థర్ లోథియాన్ (1942–1946)

ఇతర వివరాలు

మార్చు
  1. హైదరాబాద్ విప్లవకారుల్లో ఒకడైన తుర్రేబాజ్ ఖాన్ తన 500మంది రోహిల్లా వీరులతో కలిసి బ్రిటీషు రెసిడెన్సీపై దాడికి దిగగా, భవనంలోని బ్రిటీషు సైనికులు భయంతో తమ భవనం తలుపులు మూసేసుకున్నారు.[6]
  2. ఈ భవనాన్ని భారత పురాతత్వ సర్వే సంస్థ తన ఆధీనంలోకి తీసుకొని సంరక్షిస్తుంది.[7]
  3. 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయము యొక్క కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది.

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (2 మార్చి 2018). "Telangana : Proposal to name Koti varsity 'Khairunnisa'". Mahesh Avadhutha. Retrieved 30 ఏప్రిల్ 2019.
  2. బ్రిటీషు రెసిడెన్సీ, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 49
  3. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 ఏప్రిల్ 2018. Retrieved 30 ఏప్రిల్ 2018.
  4. "Names of British Residents of Hyderabad". Wikimedia Commons. Wikimedia. Retrieved 3 ఆగస్టు 2023.
  5. David Smith, "letters Reveal Heartbreak of Young Winston, The Guardian 9 November 2003, https://www.theguardian.com/uk/2003/nov/09/booksnews.redbox Archived 5 మార్చి 2016 at the Wayback Machine; see also Ramachandra Guha, "Churchill in Bangalore," The Hindu Magazine, December 21, 2003 http://www.thehindu.com/thehindu/mag/2003/12/21/stories/2003122100040300.htm Archived 30 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  6. నమస్తే తెలంగాణ (6 అక్టోబరు 2015). "1857 తిరుగుబాటు నాయకుడు తుర్రెబాజ్‌ఖాన్". Archived from the original on 30 ఏప్రిల్ 2019. Retrieved 30 ఏప్రిల్ 2019.
  7. The Hindu (31 ఆగస్టు 2006). "Court directive to Archaeological Survey of India". Retrieved 30 ఏప్రిల్ 2019.