సలాం హైదరాబాద్ (నవల)
సలాం హైదరాబాద్ ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ వ్రాసిన నవల. ఈ నవలలో 'పైదాయిషీ హైదరాబాది' పరవస్తు లోకేశ్వర్ హైదరాబాద్ ను మన కళ్ళ ముందుంచాడు. ఇందులో నగర పూర్వ సంస్కృతి, ఈ తరంవాళ్ళకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరించబడినవి.
సలాం హైదరాబాద్ | |
కృతికర్త: | పరవస్తు లోకేశ్వర్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలంగాణ సంస్కృతి |
ప్రచురణ: | గాంధి ప్రచురణలు, హైద్రాబాద్ (2005) |
విడుదల: |
విశేషాలు
మార్చుహైదరాబాద్ అన్నపూర్ణ. ఎక్కడెక్కడి జాతులవాళ్ళో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాలలో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషనూ, యాసను పరిహసించి తామే గోప్పవాల్లమన్నట్లు ప్రవర్తించారు. ఈ నవలలో ఇవన్ని వైనంవారిగా చెప్పుకోచ్చాడు. అప్పటి ఆచారవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్ళు, ఎక్ మే దో చాయ్, బిర్యానీ, తందూరి రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహాలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారాలు, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి. ఇదొక 'హైదరాబాది' ఆత్మ కథ.[1]
ముందుమాటలో...
మార్చుఈ నవల గురించి రచయిత తన ముందు మాటగా చెప్పుకున్న వివరాల ప్రకారం, ఈ నవలాకాలం 1578 నుండి 1970 జూలై 10 వరకు. ఇందులోని ముఖ్య వస్తువులు హైద్రాబాద్ చరిత్ర, నగరంలో నడిచిన ఉద్యమాలు, స్వామి అనే ఒక పి. యు. సి. విద్యార్థి ఆత్మకథ. ఈ మూడు వస్తువుల్నీ కలిపి జడలాగా ఈ నవలను అల్లినట్టు రచయిత చెప్పుకున్నారు.[2]
ఆదరణ
మార్చుఈ పుస్తకం మొదట ప్రచురించింది జూలై 2005 లో. నాలుగు నెలలు తిరక్క ముందే వెయ్యి కాపీలు అమ్ముడుబోయి, నవంబరు 2005 లో రెండవ ముద్రణకు రావడం ఈ నవలకు కలిగిన ఆదరణను ఋజువు చేస్తుంది. మొదటి ముద్రణకు, రెండవ ముద్రణకు మధ్యకాలంలో వచ్చిన పాఠకుల, విమర్శకుల అభిప్రాయాలు రెండవ ముద్రణలో ప్రచురించారు.
మూలాలు
మార్చు- ↑ "Salam Hydrabad By Paravastu Lokeswar (Author)". Archived from the original on 2016-03-06. Retrieved 2016-02-07.
- ↑ సలాం హైదరాబాద్