సల్మాన్ అమిన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (జ. 1976 అక్టోబరు 11) అమెరికన్ విద్యావేత్త. అతను ఉచిత ఆన్‌లైన్ విద్యా వేదిక ఐన ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు. అతను ఉచిత, లాభాపేక్ష లేని ఇంటర్నెట్ పాఠశాల ఖాన్ అకాడమీ ద్వారా చాల పేరు ప్రఖ్యాతులు గడించాడు. దీనితో విద్యా విష్యాలపై 6,500 కి పైగా వీడియో పాఠాలను తయారుచేసి విస్తృతంగా బోధించేటట్లు చేసాడు. మొదట గణితం, విజ్ఞాన శాస్త్రాలపై దృష్టి పెట్టాడు.[2] అతను ఖాన్ అకాడమీతో సంబంధం ఉన్న ఖాన్ ల్యాబ్ స్కూల్ స్థాపకుడు కూడా.[3]
జనవరి 2020 నాటికి, యూట్యూబ్‌లోని ఖాన్ అకాడమీ ఛానెల్‌లో 5.6 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఖాన్ అకాడమీ వీడియోలు 1.7 బిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడ్డాయి.[4] 2012 లో, టైం (పత్రిక) ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల వార్షిక జాబితాలో సల్మాన్ ఖాన్‌ను పేర్కొంది.[5] అదే సంవత్సరంలో ఫోర్బ్‌స్ మ్యాగజైన్ ఖాన్ ను దాని ముఖచిత్రంలో "$1 ట్రిలియన్ అవకాశం" కథతో చూపించింది.[6]
ప్రారంభ జీవితం, విద్య
మార్చుసల్మాన్ ఖాన్ అమెరికాలోని లూసియానాలోని మెటైరీలో బెంగాలీ కుటుంబంలో 1976 అక్టోబరు 11న జన్మించాడు.[7] అతని తండ్రి బంగ్లాదేశ్‌లోని బారిసాల్‌కు చెందినవాడు, తల్లి భారతదేశంలోని ముర్షిదాబాద్‌కు చెందినది.[7][8] అతను ప్రభుత్వ పాఠశాల గ్రేస్ కింగ్ హైస్కూల్‌లో చదివాడు. అక్కడ అతను గుర్తుచేసుకున్నట్లుగా, "కొంతమంది క్లాస్‌మేట్స్ జైలు బయట తాజాగా ఉండేవారు, ఇతరులు ఉన్నత విశ్వవిద్యాలయాలలో చదివేందులు కట్టుబడి ఉండేవారు." అతను 1994 లో వాలెడిక్టోరియన్ పట్టభద్రుడయ్యాడు.[9]
సాల్ ఖాన్ లూసియానాలోని ది యూనివర్శిటీ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ పూర్వ విద్యార్థి.[10] ఖాన్ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో చదివాడు. కోర్సు 6 (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్) లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1998 లో కోర్సు 18 (గణితం) లో మరొక బ్యాచిలర్ డిగ్రీ పొందాడు.[11] తన సీనియర్ విద్యా సంవత్సరంలో అతను క్లాస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.[12] [13] [14]
ఖాన్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కూడా ఉంది.
వ్యక్తిగత జీవితం
మార్చుఖాన్ పాకిస్తాన్ వైద్యురాలు ఉమైమా మార్విని వివాహం చేసుకున్నాడు. ఈ జంట తమ పిల్లలతో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో నివసిస్తున్నారు.[15][16][17]
మూలాలు
మార్చు- ↑ "2017 Form 990 for Khan Academy Inc" (PDF). Retrieved 2019-05-09.
- ↑ Number of videos, Khan Academy.
- ↑ "'From YouTube Pioneer Sal Khan, A School with Real Classrooms". NPR.
- ↑ "Khan Academy". Youtube. Retrieved March 1, 2018.
- ↑ "Salman Khan – Time 100". Time. April 18, 2012. Archived from the original on 2013-05-01. Retrieved April 22, 2012.
- ↑ "$1 Trillion Opportunity". Forbes.
- ↑ 7.0 7.1 "Salman Khan". Biography.com. Archived from the original on మే 15, 2017. Retrieved జూన్ 20, 2017.
- ↑ Gear Views (July 11, 2015). "Salman Khan's message: about bangla Khan Academy". YouTube.
- ↑ Tan, Sarah (May 18, 2013). "Khan Academy founder returns home as big name in U.S. school reform". The Times Picayune. Retrieved May 23, 2017.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-11-29. Retrieved 2020-06-07.
- ↑ Solomon, Ethan A. (December 6, 2011). "Sal Khan Is Commencement Speaker". The Tech. Archived from the original on 2017-06-09. Retrieved 2020-06-07.
- ↑ Kaplan, David A. (ఆగస్టు 24, 2010). "Innovation in Education: Bill Gates' favorite teacher". Money. CNN. Archived from the original on డిసెంబరు 23, 2010. Retrieved జూన్ 30, 2012.
- ↑ "Sal Khan at Khan Academy". LinkedIn. Archived from the original on 2014-08-13. Retrieved July 5, 2017.
- ↑ "How Khan Academy Is Changing Education With Videos Made In A Closet – with Salman Khan". Mixergy. June 28, 2010. Retrieved August 26, 2010.
- ↑ "Education 2.0: The Khan Academy". Dawn. April 26, 2011. Retrieved November 6, 2012.
- ↑ "Meet Sal Khan, Khan Academy". jointventure.org. Retrieved August 28, 2015.
- ↑ "Salman Khan – Educator". Biography. Archived from the original on 2017-08-13. Retrieved August 28, 2015.
బాహ్య లంకెలు
మార్చు