సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/5
శైలి
వ్యాసం లోని విభాగాలు
బొమ్మలు, మూలాలూ
లింకులు
ఏకరీతిగా
సారాంశం
|
వ్యాసం ఆకృతికి సంబంధించి అనేక అంశాలను శైలి వివరిస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ: భాషవికీపీడియాలో సరళ వ్యావహారిక భాషలో రాయాలి. వికీపీడియాలో వ్యాసాలను ఏ మాండలికం లోనూ రాయకూడదు. పత్రికల్లో రాసే భాషా శైలినే అనుసరించాలి. కొటేషన్ల లోను, రచనల పేర్ల లోనూ తప్ప, నేను, మేము, "మనం", మీరు వంటి పదాలను ఉపయోగించరాదు. గమనించండి, గుర్తుంచుకోండి, చెయ్యకండి వంటి పదాలను వాడకండి. అవి పాఠకుడిని ఉద్దేశించి రాసినట్లుగా ఉంటాయి; వాస్తవానికి, స్పష్టమౌతుంది వంటి పదబంధాలను కూడా నివారించండి.
తేదీలు, అంకెలుకాలదోషం పట్టే పదాలను రాయకండి (ఉదా: ప్రస్తుతం). #1 అని రాయకండి; నంబర్ ఒకటి అని రాయండి. కామిక్ పుస్తకాలు దీనికి మినహాయింపు. పన్నెండు వేలు అని రాయాలంటే 12,000 ని రాయండి, 12.000 అని కాదు; అలాగే డెసిమల్ పాయింట్లను 3.14 అని రాయాలి, 3,14 అని కాదు. 1921 జూన్ 10 అనేది సరైన తేదీ ఆకృతి. 10 జూన్ 1921, జూన్ 10, 1921 అనే రెండూ సరి కాదు. తేదీ రాయకుండా నెల మాత్రమే రాస్తే 1921 జూన్ అని రాయాలి. సంవత్సరం రాసాక "సంవత్సరం" అని రాయకండి (1921 వ సంవత్సరంలో అని రాయకండి 1921 లో అని రాయాలి) క్రీ.పూ. 400 and క్రీ.శ. 400 అని రాయడం ఒప్పే. సా.శ. 400 and సా.పూ. 400 అని రాయడమూ ఒప్పే. కానీ, వ్యాసం మొత్తమ్మీద ఒకే పద్ధతిలో రాయండి. వ్యాసంలో అంకెలను రాసేటపుడు ఒకటి, రెండు, మూడు, ..., ఎనిమిది, తొమ్మిది అని రాయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని రాయవద్దు. (సందర్భాన్ని బట్టి ఒన్ని మినహాయింపులు ఉండవచ్చు; అలాగే మరికొన్ని సంఖ్యలను కూడా అక్షరాల్లో రాసే సందర్భం ఉండవచ్చు).
పొడి పదాలు, పొట్టి పదాలుతేదీలు కచ్చితంగా తెలియనపుడు సుమారుగా చెప్పే సందర్భంలో circa, ca., approx. అని వాడేబదులు c. అని వాడాలి.
విరామ చిహ్నాలుకీబోర్డులో ఉండే డబల్ సింగిల్ కొటేషను మార్కులను - ", 'వాడండి; “ ” ‘ ’ లను వాడకండి. పుస్తకాలు, సినిమాలు, టీవీ సీరియళ్ళు, సంగీత ఆల్బంలు, చిత్రాలు, ఓడలు, మొదలైనవాటి పేర్లను ఇటాలిక్కుగా చెయ్యండి —కానీ చిన్న చిన్న కృతులను (ఆల్బం లోని ఒక పాట పేరు వంటివి) అలా చెయ్యవద్దు; వాటిని కొటేషన్లలో పెట్టండి. కొటేషన్లు రాసేటపుడు కామా గానీ ఫుల్స్టాప్ గానీ కొటేషను తరువాత పెట్టండి - అవి కొటేషనులో భాగమైతే తప్ప. (ఆమె ఇలా చెప్పింది - "నాకంతా అయోమయంగా ఉంది."); మామూలుగా నైతే ఇలా రాయాలి: (అయోమయం అంటే తికమక అని కూడా అనుకోవచ్చు .).
వాక్యాన్ని విరచని స్పేసులుపదాల మధ్య ఉండే స్పేసుల వద్ద లైనుబ్రేకు అవుతూ ఉండడం సహజం. అలా జరక్కుండా ఉండాలంటే స్పేసు బదులు
|