ఇన్లైన్ ఉల్లేఖనలంటే చిన్నపరిమాణంలో, అంకెలతో సూచించే ఉల్లేఖనలు. ఇలా ఉంటాయవి: [1] వ్యాసంలో మూలాలు అవసరమైన వాస్తవాలు రాసినపుడు, దాని పక్కనే గానీ, లేదా ఆ వాక్యం చివర గానీ చేరుస్తారు. ఏదైనా వ్యాకారణ చిహ్నాలుంటే ఆ చిహ్నం తరువాత చేరుస్తారు. ఆ అంకెను నొక్కినపుడు, పేజీలో కింద, "మూలాలు" విభాగంలో ఉండే సంబంధిత మూలం దగ్గరకు తీసుకువెళ్తుంది.
పేజీని దిద్దుబాటు చేస్తున్నపుడు, చాలా ఎక్కువగా వాడే ఉల్లేఖన పద్ధతిని వాడిన చోట్ల, ఇన్లైన్ ఉల్లేఖనలను <ref>...</ref>
అనే రెండు ట్యాగుల మధ్య చూడవచ్చు.
మీరు కొత్త పేజీని సృష్టిస్తోంటే, లేదా అంతకు ముందు అసలు మూలాలే లేని పేజీలో కొత్తగా మూలాన్ని చేరుస్తోంటే, కింద చూపిన విధంగా "మూలాలు" అనే కొత్త విభాగాన్ని చేర్చడం మరువకండి. (దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడొచ్చు):
==మూలాలు==
{{reflist}}
గమనిక: ఇది, ఇన్-లైన్ ఉల్లేఖనల కోసం చాలా ఎక్కువగా వాడుతూ ఉన్న పద్ధతి. కానీ కొన్నిచోట్ల ఇతర పద్ధతులను కూడా వాడడం మీ దృష్టికి రావచ్చు - ఉదాహరణకు బ్రాకెట్లలో ఉల్లేఖనలు అది కూడా ఆమోదం పొందిన పద్ధతే. కాకపోతే రెండు పద్ధతులను కలపరాదు. కొత్త మూలాన్ని చేర్చాలంటే అంతకు ముందున్న మూలాన్ని కాపీ చేసి తగు మార్పుచేర్పులు చెయ్యండి.
మూలాలు
- ↑ Wales, J (2024). What is an inline citation?. Wikipublisher. p. 6.